కామన్వెల్త్ గేమ్స్ 2022: మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌లకు స్వర్ణాలు

కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు స్వర్ణ పతకం గెలుచుకుంది. లక్ష్య సేన్ సాధించిన పురుషుల సింగిల్స్ స్వర్ణంతో భారత స్వర్ణ పతకాల సంఖ్య 20కి చేరింది.

లైవ్ కవరేజీ

  1. క్విట్ ఇండియా: ఈ నినాదం ఎలా పుట్టింది... ఈ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులెవ్వరు?

  2. ధన్యవాదాలు!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ఇక్కడితో ముగిస్తున్నాం.

  3. నేటి ముఖ్యాంశాలు

    కామన్వెల్త్ గేమ్స్‌ 2022 మహిళా క్రికెట్‌లో భారత్ రజత పతకం గెలుచుకుంది. ఫైనల్స్‌లో 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

    కామన్వెల్త్ గేమ్స్‌ 2022లో జావెలిన్ త్రోలో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీం 90.18 మీటర్లు త్రో చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ గేమ్స్‌లో పాకిస్తాన్‌కు ఇది రెండో స్వర్ణం.

    ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. మూడు రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో కనీసం 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

    రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో ఖాటూ శ్యామ్‌జీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.

    మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

    ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి వీడ్కోలు పలికారు. ఈ నెల 10వ తేదీన ఆయన పదవీ కాలం ముగియనుంది.

    బ్యాడ్మింటన్‌లో మెన్స్ డబుల్స్ విభాగంలో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జంట స్వర్ణ పతకం గెలుచుకుంది.

  4. సెక్స్ లైఫ్‌ను ఆసక్తికరంగా మార్చుకునేందుకు 7 చిట్కాలు

  5. ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి

  6. కామన్వెల్త్ గేమ్స్: బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్, టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో ఇండియాకు స్వర్ణాలు

    బ్యాడ్మింటన్‌లో మెన్స్ డబుల్స్ విభాగంలో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జంట స్వర్ణ పతకం గెలుచుకుంది.

    టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్ ఫైనల్స్ లో ఆచంట శరత్ కమల్ గోల్డ్ సాధించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2

    పోస్ట్ of X ముగిసింది, 2

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3

    పోస్ట్ of X ముగిసింది, 3

  7. వారెన్ బఫెట్, రాకేశ్ ఝుంఝున్‌వాలా ఎలా స్టాక్ మార్కెట్స్‌లో కోట్లు సంపాదించారు?

  8. బ్రేకింగ్ న్యూస్, కామన్వెల్త్ గేమ్స్‌:మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌లకు స్వర్ణాలు

    పీవీ సింధు

    ఫొటో సోర్స్, Getty Images

    కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్స్‌లో కెనడాకు చెందిన మిచెల్ లీని 21-15, 21-13తో స్కోరుతో ఓడించింది.

    ఈ మ్యాచ్‌లో సింధు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు కనిపించలేదు. ఎడమకాలికి పట్టీ ఉంది. గేమ్ ప్రారంభంలో సింధు కాస్త తడబడినట్టు అనిపించినా, ఆమె అనుభవం ఆమెకు ఉపయోగపడింది. మళ్లీ గేమ్‌లోకి దూసుకొచ్చింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    కామన్వెల్త్ గేమ్స్‌లో సింధుకి ఇదే తొలి స్వర్ణం. 2018లో గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు రజతం సాధించింది. కానీ, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం సాధించింది. అందులో సింధు భాగం పంచుకున్నారు.

    2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు కాంస్య పతకాన్ని అందుకుంది.

    మెన్స్ సింగిల్స్ లోనూ భారత్‌కు స్వర్ణం

    మరోవైపు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత్ ‌కు చెందిన లక్ష్య సేన్ స్వర్ణపతకం సాధించారు.

    మలేషియాకు చెందిన ఎన్జీ జే యాంగ్ పై లక్ష్యా సేన్ 19-21, 21-9, 21-16 స్కోరుతో విజయం సాధించారు.

    ఈ స్వర్ణ పతకంలో భారత్ బంగారు పతకాల సంఖ్య 20కి చేరింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 4

  9. మిమ్మల్ని దోమ కుట్టిందంటే.. అది కచ్చితంగా ఆడదోమే..ఎందుకు ఆడదోమలే రక్తం పీలుస్తాయి?

  10. పాప్ స్మియర్: లక్షలాది మహిళలను గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడే ఈ టెస్ట్ వెనుక ప్రేమ కథ మీకు తెలుసా?

    మహిళలు

    ఫొటో సోర్స్, Getty Images

    "అమెరికన్ మహిళల ఆరోగ్యానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల స్వస్థతకు సహకరించే ఈ శతాబ్దపు అతిగొప్ప ఆవిష్కరణ ఇది. మన కాలంలో క్యాన్సర్‌ను నిరోధించేందుకు అత్యంత ముఖ్యమైన, ఆచరణాత్మకమైన, ఉపయోగకరమైన ఆవిష్కరణ."

    1957లో అమెరికాలోని జనరల్ ఫెడరేషన్ ఆఫ్ వుమెన్స్ క్లబ్స్ ప్రత్యేక సమావేశంలో చెప్పిన మాటలవి. పాప్ స్మియర్ పరీక్షను అభివృద్ధి చేసిన డాక్టర్ జార్జ్ పాపానికోలౌ గౌరవార్థం ఏర్పాటు చేసిన సమావేశం అది. ఆయన పేరు మీదే ఈ టెస్ట్ ఉనికిలోకి వచ్చింది.

    గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు చికిత్స పొందిన మహిళగా, ఈ టెస్ట్ వెనుక కథ తెలుసుకోవాలనుకున్నా.

    దీని వెనుక పెద్ద కథే ఉంది. గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఉపయోగపడే పాప్ స్మియర్ టెస్ట్ ప్రపంచం అంగీకారం పొందేందుకు చాలా సమయం పట్టింది.

  11. క్యాసినో పెట్టాలంటే ఏయే అనుమతులు కావాలి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో క్యాసినో పెట్టొచ్చా?

  12. కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ

    ముద్రగడ పద్మనాభం

    మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కోనసీమ పెద్దలకు బహిరంగ లేఖ రాశారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడంపై వస్తున్న అభ్యంతరాలు సబబు కాదని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.

    అంబేద్కర్ భారత రాజ్యాంగ పిత అని, కోనసీమకు ఆయన పేరు పెట్టి గౌరవించడంపై అభ్యంతరాలు లేవనెత్తడం, అల్లర్లు చెలరేగడం న్యాయం కాదని అన్నారు.

    నిజానికి, ఆ ప్రాంతానికి మాజీ లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి పేరు పెట్టాలని, ఆయన స్పీకర్ అయిన తరువాతే కోనసీమ ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఏ కారణం చేతనో ఆయన పేరు పరిగణనలోకి తీసుకోలేదని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.

    ప్రపంచమంతా కొనియాడుతున్న అంబేద్కర్‌ను మనం గౌరవించాలని చెబుతూ, ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని మంత్రి పినపే విశ్వరూప్, శాసనసభ్యులు పొన్నాడ సతీశ్ తదితరులను కోరారు.

    ముద్రగడ పద్మనాభం

    ఫొటో సోర్స్, UGC

  13. 'పాకిస్తాన్‌లోని మా తాతల గ్రామాన్ని ఈ జన్మలో చూడలేననుకున్నా.. మా తాతలాగే తయారై పాక్‌లో అడుగు పెట్టా.. ఆ తర్వాత..'

  14. రాజ్యసభలో వెంకయ్య నాయుడికి వీడ్కోలు పలికిన ప్రధాని మోదీ

    వెంకయ్య నాయుడు

    ఫొటో సోర్స్, SANSADTV/ANI

    ఈ నెల 10వ తేదీన భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడి పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా, నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో ఆయనకు వీడ్కోలు పలికారు.

    వెంకయ్య నాయుడితో కలిసి పనిచేసే అవకాశం దక్కడం తన అదృష్టమని మోదీ అన్నారు. పార్టీ చీఫ్‌గా, క్యాబినెట్‌లో మంత్రిగా, దేశ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు అందించిన సేవలను కొనియాడారు. వివిధ పదవులను ఆయన నిర్వహించిన తీరును దగ్గర నుంచి చూశానని అన్నారు.

    వెంకయ్య నాయుడు ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేశారని, ఎప్పుడూ ఏ పనిని భారంగా భావించలేదని మోదీ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    వెంకయ్య నాయుడికి మంచి హాస్య చతురత ఉందని, మాతృభాషపై ఉన్న ఎనలేని అభిమానం కనబరుస్తారని ప్రశంసించారు.

    "మాతృభాష కంటి చూపు లాంటిదని, పరభాష కళ్లజోడు లాంటిదని" వెంకయ్య నాయుడు చెబుతుండేవారని మోదీ గుర్తుచేసుకున్నారు.

    ఆయన అన్న ప్రతి మాటకు ప్రాధాన్యం ఇచ్చామని, గౌరవించామని మోదీ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  15. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

    రాజగోపాల్‌రెడ్డి

    ఫొటో సోర్స్, Komatireddy Rajgopal Reddy/FACEBOOK

    మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ మేరకు స్పీకరు పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ అందించారు.

    మునుగోడు కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

    స్పీకర్, రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను ఆమోదించారు.

    కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వైదొలగుతున్నట్టు రాజగోపాలరెడ్డి ప్రకటించారు.

    రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో త్వరలో మునుగోడు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

    రాజగోపాల్‌రెడ్డి

    ఫొటో సోర్స్, Komatireddy Rajgopal Reddy/FACEBOOK

  16. మల్లిక శెరావత్: ‘హీరోలతో రాజీపడకపోవడం వల్ల చాలా అవకాశాలు పోగొట్టుకున్నా’

  17. రాజస్థాన్‌: ఖాటూ శ్యామ్‌జీ ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మహిళలు మృతి

    ఖాటూ శ్యామ్‌జీ

    ఫొటో సోర్స్, Mohar singh meena

    రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో ఖాటూ శ్యామ్‌జీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.

    స్థానికుల కథనం ప్రకారం, సోమవారం ఉదయం ఆలయ ద్వారాలు తెరుచుకోగానే తొక్కిసలాట మొదలైంది. గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

    “రాజస్థాన్‌లోని సీకర్‌లో ఖాటూ శ్యామ్‌జీ ఆలయంలో జరిగిన సంఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అంటు ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.

    "ఆలయంలో తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

    ఖాటూ శ్యామ్‌జీ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినదని, అక్కడకి విశేషంగా భక్తులు వస్తారని బీబీసీ రిపోర్టర్ మోహర్ సింగ్ మీణా తెలిపారు.

    ఆయన అందించిన వివరాల ప్రకారం, ఏకదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం దర్శనం కోసం సుమారు లక్షన్నర మంది ప్రజలు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తెరవగానే రాత్రంతా వేచి ఉన్న భక్తుల మధ్య తోపులాట ప్రారంభమైంది. తెల్లవారుజామున సుమారు 4.30 నుంచి 5.00 మధ్య జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు భక్తులు గాయపడ్డారు.

    "ఈ ఘటనలో 63 ఏళ్ల మహిళ మరణించినట్లు" సీకర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కున్వర్ రాష్ట్రదీప్ తెలిపారు.

  18. ఇజ్రాయెల్ - పాలస్తీనా: గాజాలో కాల్పుల విరమణ.. దాడుల్లో కనీసం 43 మంది మృతి

    ఇజ్రాయెల్

    ఫొటో సోర్స్, ANADOLU AGENCY VIA GETTY

    ఫొటో క్యాప్షన్, 2022 ఆగస్టు 07న గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల అంత్యక్రియలకు హాజరైన జనం

    ఎట్టకేలకు ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. మూడు రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో కనీసం 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఈజిప్షియన్ మధ్యవర్తుల జోక్యం తరువాత, స్థానిక సమయం 23.30 నుంచి కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (పీఐజే) తెలిపింది.

    ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యైర్ లాపిడ్ కార్యాలయం కూడా కాల్పుల విరమణను ధృవీకరించింది.

    2021 మేలో కూడా గాజాలో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

    గాజా స్ట్రిప్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడుల దృశ్యాలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, గాజా స్ట్రిప్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడుల దృశ్యాలు

    తాజా ఘర్షణల్లో, గాజాలోని పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని గగనతలం నుంచి రాకెట్ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది.

    ఆ మిలిటెంట్ సమూహం నుంచి బెదిరింపులు రావడంతో తాము దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

    అంతకుముందు, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఒక సీనియర్ పీఐజే సభ్యుడిని ఇజ్రాయెల్ అరెస్ట్ చేసింది. దాంతో, గాజాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

    తాజా దాడుల్లో కనీసం 43 మంది చనిపోయారని, అందులో 15 మంది పిల్లలు ఉన్నారని, 300 మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనియన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. "ఇజ్రాయెల్ దురాగతాలే" ఇందుకు కారణమని ఆరోపించింది.

    ఆదివారం గాజా నుంచి ప్రయోగించిన రాకెట్లు జెరూసెలెం చేరుకున్నాయి. ఈజిప్ట్ జోక్యం చేసుకుని సంధి ప్రయత్నాలు ప్రారంభించడంతో కాల్పుల విరమణ అమలులోకొచ్చింది.

  19. కామన్వెల్త్ గేమ్స్ 2022: జావెలిన్ త్రోలో పాకిస్తాన్ ప్లేయర్ అర్షద్ నదీంకు స్వర్ణం.. భారత స్టార్ నీరజ్ చోప్రా గైర్హాజరు

    జావెలిన్ త్రో

    ఫొటో సోర్స్, Getty Images

    కామన్వెల్త్ గేమ్స్‌ 2022లో జావెలిన్ త్రోలో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీం 90.18 మీటర్లు త్రో చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ గేమ్స్‌లో పాకిస్తాన్‌కు ఇది రెండో స్వర్ణం.

    గాయాల కారణంగా భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఫైనల్స్‌కు దూరమయ్యాడు. ఇప్పటివరకు నీరజ్ చోప్త్రా 90 మీటర్లు దాటి త్రో చేయలేదు.

    భారత ఉపఖండంలో జావెలిన్‌ను 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరిన తొలి అథ్లెట్‌గా అర్షద్ నదీం రికార్డు సృష్టించాడు.

    ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో నదీం అయిదవ రౌండ్‌లో 90.18 మీటర్ల దూరం విసిరి కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు నదీం అత్యుత్తమ ప్రదర్శన ఇదే.

    ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) రజత పతకాన్ని గెలుచుకున్నాడు. పీటర్స్ జావెలిన్‌ను 88.64 మీటర్ల దూరంలో విసిరాడు. జూలియస్ యెగో (కెన్యా) 85.70 మీటర్ల దూరంలో జావెలిన్ విసిరి మూడో స్థానంలో నిలిచాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. కామన్వెల్త్ గేమ్స్ 2022: మహిళల క్రికెట్‌లో భారత్‌కు రజత పతకం... ఆస్ట్రేలియాకు స్వర్ణం

    క్రికెట్‌

    ఫొటో సోర్స్, TWITTER

    కామన్వెల్త్ గేమ్స్‌ 2022 మహిళా క్రికెట్‌లో భారత్ రజత పతకం గెలుచుకుంది. ఫైనల్స్‌లో 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

    బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

    భారత జట్టు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే అన్ని వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.

    భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి, కేవలం 34 బంతుల్లోనే 50 పరుగులు సాధించింది.

    అంతకుముందు ఆదివారం, న్యూజీలాండ్ మహిళల జట్టు ఇంగ్లండ్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి, కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు స్థానం కల్పించడం ఇదే తొలిసారి. అలాగే, 24 సంవత్సరాల తరువాత క్రికెట్ ఈ గేమ్స్‌లోకి తిరిగివచ్చింది.

    చివరిగా 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్ టోర్మమెంట్ జరిగింది. అప్పట్లో 50 ఓవర్ల మ్యాచులు జరిగాయి. ఇందులో 16 జట్లు పాల్గొన్నాయి.

    ఇందులో దక్షిణాఫ్రికా జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, ఆస్ట్రేలియా రజతం, న్యూజీలాండ్ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకున్నాయి.