కామన్వెల్త్ గేమ్స్: బర్మింగ్‌హామ్‌లో తొలి స్వర్ణం గెలిచిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన మీరాబాయి చాను

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు అదరగొట్టారు. శనివారం ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని సాధించారు. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణం సాధించి సత్తా చాటారు.

లైవ్ కవరేజీ

  1. మీరాబాయి చాను: నాడు వెదురుకర్రతో వెయిట్ లిఫ్టింగ్ చేసింది, నేడు రికార్డులు బద్ధలు చేస్తూ గోల్డ్ సాధించింది

  2. భారత్‌లో మతపరమైన ఆచారాలు పర్యావరణ పరిరక్షణకు ఎలా ఉపయోగపడుతున్నాయి?

  3. బ్రేకింగ్ న్యూస్, కామన్వెల్త్ గేమ్స్: మీరాబాయి చానుకు స్వర్ణం

    మీరాబాయి చాను

    ఫొటో సోర్స్, CLIVE BRUNSKILL

    కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని గెలుపొందింది. దీంతో శనివారం, భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది.

    ఫైనల్ పోటీలో ఆమె మొత్తంగా 201 కేజీల (88 స్నాచ్, 113 క్లీన్ అండ్ జెర్క్) బరువును ఎత్తి తొలి స్థానంలో నిలిచింది.

    స్నాచ్ విభాగం తొలి ప్రయత్నంలో 84 కేజీలు, రెండో ప్రయత్నంలో 88 కేజీలను విజయవంతంగా ఎత్తిన చాను మహిళల 49 కేజీల విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ రికార్డును నెలకొల్పింది. అనంతరం 90 కేజీలు ఎత్తేందుకు మూడో ప్రయత్నం చేసి విఫలమైంది.

    అనంతరం క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో తొలి ప్రయత్నంలో 109 కేజీలు, రెండో ప్రయత్నంలో 113 కేజీల బరువునెత్తింది. మూడో ప్రయత్నంలో 115 కేజీలు ఎత్తడంలో విఫలమైంది.

    మారిషస్‌కు చెందిన మేరీ హనిత్రా రనైవోసోవా (172 కేజీలు) రజతం, హనా కమిన్స్కీ (కెనడా, 171 కేజీలు) కాంస్యాన్ని గెలుచుకున్నారు.

    కామన్వెల్త్ గేమ్స్‌లో చానుకు ఇది మూడో పతకం కాగా వరుసగా రెండో స్వర్ణం. 2018 గోల్డ్ కోస్ట్ క్రీడల్లోనూ ఆమె బంగారు పతకాన్ని సాధించారు. 2014లో రజత పతకాన్ని గెలుపొందారు.

    శనివారం భారత్ సాధించిన మూడు పతకాలు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే రావడం విశేషం. చాను కంటే ముందు సంకేత్ రజతాన్ని, గురురాజ్ కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. తల్లిని కాల్చి చంపిన తండ్రిని శిక్షించాలంటూ రక్తంతో లేఖ రాసిన కూతుళ్లు.. ఆరేళ్ల తర్వాత జీవిత ఖైదు విధించిన కోర్టు

  5. కేరళ లాటరీ: అప్పుల బాధలు తట్టుకోలేక ఇల్లు అమ్మేస్తుంటే కోటి రూపాయల లాటరీ తగిలింది..

  6. బ్రేకింగ్ న్యూస్, కామన్వెల్త్ గేమ్స్: భారత్‌కు మరో పతకం, కాంస్యం గెలిచిన వెయిట్ లిఫ్టర్ గురురాజ్ పుజారి

    వెయిట్ లిఫ్టర్ గురురాజ్ పూజరి

    ఫొటో సోర్స్, REUTERS/Jason Cairnduff

    కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు అదరగొట్టారు. వరుసగా దేశానికి రెండో పతకాన్ని అందించారు. తాజాగా వెయిట్ లిఫ్టర్ గురురాజ్ పుజారి కాంస్య పతకాన్ని సాధించాడు.

    పురుషుల 61 కేజీల విభాగంలో పోటీపడిన గురురాజ్ పుజారి మొత్తంగా 269 కేజీల బరువునెత్తి పతకాన్ని గెలుపొందాడు.

    స్నాచ్ విభాగంలో అత్యుత్తమంగా 118 కేజీలు ఎత్తిన గురురాజ్, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 151 బరువునెత్తి మూడో స్థానంలో నిలిచాడు.

    ఈ కేటగిరీలో అజ్నిల్ బిన్ బైడెన్ మొహమ్మద్ (మలేసియా) స్వర్ణాన్ని గెలుపొందగా, మోరియా బారు (పపువా న్యూ గినియా) రజత పతకాన్ని గెలిచారు.

    దీనికంటే ముందు 55 కేజీల విభాగంలో సంకేత్ మహాదేవ్ సర్గార్ రజత పతకాన్ని గెలుపొందాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. కామన్వెల్త్ గేమ్స్: ప్రిక్వార్టర్స్‌లో తెలంగాణ బాక్సర్ హుస్సాముద్దీన్

    కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ శుభారంభం చేశాడు.

    శనివారం జరిగిన పురుషుల ఫెదర్ వెయిట్ (54-57 కేజీలు) కేటగిరీ తొలి రౌండ్‌లో నిజామాబాద్‌కు చెందిన మొహమ్మద్ హుస్సాముద్దీన్ 5-0తో అంజోలెలె (రష్యా)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు.

    ఆగస్టు 1న సాయంత్రం 6 గంటలకు జరిగే ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన మొహమ్మద్ సలీమ్ హొస్సేన్‌తో హుస్సాముద్దీన్ తలపడతాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. పాకిస్తాన్‌లో పంజాబ్ రాజకీయ సంక్షోభం.. కోల్పోయిన అధికారాన్ని మళ్లీ పొందిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ

  9. బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరంలో తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర మందిరం, ఇతర విశేషాలు..

  10. బ్రేకింగ్ న్యూస్, కామన్వెల్త్ గేమ్స్‌: భారత్‌ ఖాతాలో తొలి పతకం, సంకేత్ సర్గార్‌కు రజతం

    సంకేత్ మహాదేవ్ సర్గార్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, సంకేత్ మహాదేవ్ సర్గార్

    కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల బోణీ చేసింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతోన్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌ తొలి పతకాన్ని అందుకుంది.

    పురుషుల 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో సంకేత్ మహాదేవ్ సర్గార్ రజత పతకాన్ని గెలుపొందాడు.

    పోటీల్లో భాగంగా సంకేత్ మొత్తం 248 కేజీల బరువెత్తి రన్నరప్‌గా నిలిచాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    మలేసియాకు చెందిన అనిక్ 249 కేజీలు లిఫ్ట్ చేసి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. శ్రీలంకకు చెందిన దిలాంక యోడాగేకు కాంస్య పతకం దక్కింది.

    రెండో రౌండ్‌లో 139 కేజీల బరువు ఎత్తే క్రమంలో సంకేత్ గాయపడ్డాడు. అయినప్పటికీ మూడో రౌండ్‌లో రాణించి సంకేత్ పతకాన్ని అందుకున్నాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  11. బీజీఎంఐ: పబ్‌జీకి ప్రత్యామ్నాయంగా మారిన ఈ గేమ్‌ను భారత్ ఎందుకు బ్లాక్ చేసింది?

  12. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్లే ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా?

  13. పూడిమడక బీచ్ ముగిసిన రెస్క్యూ ఆపరేషన్-ఆరు మృతదేహాలు లభ్యం

    పూడిమడక బీచ్‌

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, ముగిసిన రెస్క్యూ ఆపరేషన్

    శుక్రవారం అనకాపల్లి జిల్లా, పూడిమడక బీచ్‌కు వచ్చిన 13 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ఆరుగురు గల్లంతయ్యారు. వెంటనే అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

    ఈ ప్రమాదంలో గల్లంతయిన ఆరుగురు విద్యార్ధుల మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.

    దీంతో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది.

    చివరి రెండు మృతదేహాలలలో ఒకటి పూడిమడకలో, మరొకటి తంతడిలో లభించాయి.

    చనిపోయిన వారిలో పవన్ సూర్యకుమార్‌ (గుడివాడ), గణేశ్‌ (మునగపాక), జగదీశ్‌ (గోపాలపట్నం), రాంచంద్ (యలమంచిలి), జశ్వంత్(నర్సీపట్నం), సతీశ్ ఉన్నారు.

    రెండు హెలికాప్టర్లు, నాలుగు బోట్ల ద్వారా విద్యార్థుల కోసం గాలించారు. వీరంతా అనకాపల్లిలోని డీఐఈటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు

  14. ఒబేసిటీ: భారతదేశపు చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయులు, కారణాలు ఇవే

  15. ఓఆర్ఎస్: డయేరియా నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని ఇది, నిర్లక్ష్యం చేస్తున్నామా

  16. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక తీవ్రవాది హతం

    జమ్మూ కశ్మీర్‌

    ఫొటో సోర్స్, ANI

    జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా వానిగాం బాలా ప్రాంతంలో ఈరోజు తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

    ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక తీవ్రవాది మరణించినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

    తీవ్రవాదుల గురించి సమాచారం అందిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అనంతరం ఎన్‌కౌంటర్ ప్రారంభించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. ఏపీ: మంత్రికి, మాజీ మంత్రికి తప్పని లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు

  18. కామన్వెల్త్ క్రీడల్లో పాకిస్తాన్‌పై భారత్ పైచేయి

    భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్

    కామన్వెల్త్ క్రీడల్లో తొలి రోజు పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. సెమీఫైనల్‌లో శ్రీహరి 54.55 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన పీటర్ కోయెట్జ్ 53.91 సెకన్ల టైమింగ్‌తో మొదటి స్థానంలో నిలిచాడు.

    కిందటి ఏడాది శ్రీహరి నటరాజ్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 53.77 సెకన్లతో జాతీయ రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల స్విమ్మర్ శ్రీహరి కామన్వెల్త్ క్రీడల్లో ఈరోజు ఫైనల్ మ్యాచ్ కోసం స్విమ్మింగ్ పూల్‌లోకి అడుగుపెట్టనున్నాడు.

    పీవీ సింధు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, పీవీ సింధు

    బ్యాడ్మింటన్‌లో భారత్ పాకిస్తాన్‌పై గెలిచింది. తొలి టీమ్ మ్యాచ్‌లో భారత్ 5-0తో పాకిస్తాన్‌ను ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బి సుమీత్‌రెడ్డి, మాచిమండ పొన్నప్ప జోడీ 21-9, 21-12 స్కోరుతో మహ్మద్‌ ఇర్ఫాన్‌ సయీద్‌ భట్టి-గజాలా సిద్ధిఖీ జోడీపై విజయం సాధించింది.

    ఆ తరువాత పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-7, 21-12తో మురాద్ అలీని ఓడించాడు.

    మరోవైపు, మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో పీవీ సింధు 21-7, 21-6తో మహూర్ షాజాద్‌పై విజయం సాధించింది.

    దీని తరువాత, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ, ట్రెసా, గాయత్రి జోడీ కూడా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించారు.

    భారత బాక్సర్ శివ్ థాపా 63 కేజీల విభాగంలో 5-0 స్కోరుతో పాకిస్తాన్‌కు చెందిన సులేమాన్ బలోచ్‌పై విజయం సాధించాడు.

    భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు తమ మొదటి గ్రూప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 3–0తో ఓడించింది. రెండో గేమ్‌లో ఫిజీపై 3–0తో విజయం సాధించింది. పురుషుల జట్టు బార్బడోస్, సింగపూర్‌లను ఓడించింది. స్క్వాష్‌లో అనాహత్ సింగ్, అభయ్ సింగ్ విజయం సాధించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    క్రికెట్‌లో భారత జట్టు ఓడిపోయింది. భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

    అలాగే, లాన్ బౌల్, 50 మీటర్ల బటర్‌ఫ్లై, 400 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, సైక్లింగ్‌లో కూడా భారత్ ఓడిపోయింది.