నేటి ముఖ్యాంశాలు
ధన్‌బాద్ న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ మరణించిన ఏడాది తర్వాత ఆయనను ఢీకొట్టిన ఆటో డ్రైవర్ లఖన్ వర్మ, సహచరుడు రాహుల్ వర్మను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆగస్టు 6న వీరికి శిక్ష ఖరారు అవుతుంది.
గత 8 సంవత్సరాలలో 7.22 లక్షల మందికి పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్లు కేంద్ర సిబ్బంది, శిక్ష వ్యవహారాల శాఖ తెలిపింది.
ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌధరి పిలిచారంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తోపాటు ఇతర బీజేపీ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన చేపట్టారు.
కేసుల విచారణ విషయంలో న్యాయమూర్తులను విమర్శించడానికి ఒక హద్దు ఉండాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అనడం మీద ఆధిర్ రంజన్ చౌదరి ఇప్పటికే క్షమాపణలు చెప్పారంటూ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు.
మధ్యప్రదేశ్‌లో ఒక్క సిరంజీతో 30 మంది విద్యార్థులకు కోవిడ్-19 వ్యాక్సిన్ వేయడం మీద వైద్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు.
మధ్యప్రదేశ్‌లోని ఆదివాసీ ఒక మహిళకు వజ్రం దొరికింది. 4.39 కేరట్ల ఆ వజ్రం విలువ రూ.20 లక్షలు ఉంటుందని అంచనా.
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ఆదాయం తొలిసారి తగ్గింది. 2022 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 28.82 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2021 ఇదే త్రైమాసికంలో 29.07 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది.
పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సీ) నియామకాల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీని కేబినెట్ నుంచి తొలగించారు.
ఈ పేజీలో లైవ్ అప్‌డేట్స్ ముగిశాయి. బీబీసీ తెలుగు వార్తల కోసం ఈలింక్‌పైక్లిక్ చేయండి.










