అమర్‌నాథ్‌లో కుండపోత వర్షాలు.. పది మంది మృతి

ఇప్పటివరకు పది మంది ప్రజలు వరదల్లో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో తరలిస్తున్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    అంతర్జాతీయ అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.

  2. నేటి ముఖ్యాంశాలు

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో నమోదైన కేసులో ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్‌కు సుప్రీంకోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

    జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతిచెందారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఓ సాయుధుడు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే కుప్పకూలిన అబే ఆ తరువాత చికిత్స పొందుతూ మరణించారు.

    సినీ హీరో విక్రమ్ ఛాతి నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేర్చారు.

    చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ వివో దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తమ కంపెనీకి చెందిన 9 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై కోర్టులో వివో పిటిషన్ దాఖలు చేసింది.

    జమ్మూకశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షాలు కురిశాయి. ఇప్పటివరకు పది మంది వరదల్లో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో తరలిస్తున్నారు.

  3. అమర్‌నాథ్‌లో కుండపోత వర్షాలు.. 10 మంది మృతి

    వరదలు

    ఫొటో సోర్స్, ani

    జమ్మూకశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షాలు కురిశాయి.

    పరిసరాల్లోని శిబిరాలపైకి వరద నీరు ముంచెత్తింది. దీంతో ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి.

    ఇప్పటివరకు పది మంది వరదల్లో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో తరలిస్తున్నారు.

    పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    మోదీ

    ఫొటో సోర్స్, ANI

    అమర్‌నాథ్ వరదల్లో మృతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ విషయంపై ఆయన ట్వీట్ చేశారు.

    బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని మోదీ చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడానని వివరించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  4. పావురాల గుట్టలోనే సంఘర్షణ మొదలైంది.. ప్లీనరీ ప్రారంభోపన్యాసంలో జగన్

    jagan

    ఫొటో సోర్స్, YSRCP

    వైఎస్సార్ కాంగ్రెస్ ప్రస్థానాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రేణులకు వివరించారు. 13 ఏళ్ల కిందట పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి ప్రస్తుతం అధికారంలోకి వచ్చినంత వరకు ఎదురైన అనుభవాలు, సంఘర్షణ అన్నిటినీ ఆయన ప్రస్తావించారు.

    ‘‘2009 సెప్టెంబరు 5న పావురాల గుట్టలో సంఘర్షణ మొదలైంది. ఓదార్పు యాత్రతో పార్టీ రూపం దాల్చింది. ఆ తరువాత 2011లో వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించింది’’ అని జగన్ చెప్పారు.

    jagan

    ఫొటో సోర్స్, YSRCP

    ‘‘ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క తమ్ముడికి, అక్కకి, చెల్లెమ్మకి, అవ్వా, తాతలకి, ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి అభిమానికి మన జెండా తమ గుండెగా మార్చుకున్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యోధులకు, కోట్లమంది మనసున్న మనుషులకు మీ జగన్‌ ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా, మీవాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా సెల్యూట్‌ చేస్తున్నాను’’ అంటూ జగన్ తన ప్రసంగంలో అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

    2009 నుంచి ఇప్పటివరకు 13 ఏళ్ల ప్రయాణంలో న్నో సవాళ్లను ఎదుర్కొన్నామని.. అయినా తన సంకల్పం చెదరలేదని జగన్ చెప్పారు.

    వైసీపీ ప్లీనరీకి హాజరైన కార్యకర్తలు

    ఫొటో సోర్స్, ysrcp

    ‘‘అధికారం అంటే అహంకారం కాదు. అధికారం అంటే ప్రజల మీద మమకారం అని నిరూపిస్తూ.. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారం వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాలలో అయినా ప్రజల కోసం, పేదల కోసం, సామాన్యుల కోసం, అన్ని వర్గాల కోసం బతికాం’’ అన్నారు జగన్.

    జగన్ తన ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నేతలపైనా విమర్శలు కురిపించారు.

    ప్లీనరీ ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం కార్యకర్తలనుద్దేశించి మరోసారి మాట్లాడుతానని చెప్పారు.

  5. బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేయడంపై దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన వివో

    Vivo Mobiles

    ఫొటో సోర్స్, Twitter.com/Vivo_India

    చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ వివో దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తమ కంపెనీకి చెందిన 9 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై కోర్టులో వివో పిటిషన్ దాఖలు చేసింది.

    ఆ 9 ఖాతాలలో రూ. 250 కోట్లు ఉన్నట్లు వివో పేర్కొంది.

    బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం వల్ల కంపెనీ కార్యకలాపాలు కొనసాగించడం సాధ్యం కాదని వివో పేర్కొంది.

    కాగా మనీలాండరింగ్ ఆరోపణలతో వివోకు సంబంధించిన 9 బ్యాంకు ఖాతాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిలిపివేసింది.

  6. బ్రేకింగ్ న్యూస్, విక్రమ్‌కు ఛాతి నొప్పి , చెన్నై ఆసుపత్రిలో చికిత్స

    విక్రమ్

    ఫొటో సోర్స్, chiyan vikram

    సినీ హీరో విక్రమ్ ఛాతి నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేర్చారు.

    ఆయన నటించిన భారీ బడ్జెట్ చిత్రం పొన్నియిన్ సెల్వన్ టీజర్ లాంచ్ ఈ రోజు జరగనుంది.

    అయితే, మొదట విక్రమ్‌కు గుండె పోటు వచ్చిందని వార్తలు మీడియాలో కనిపించాయి. దీనిపై ఆయన కుమారుడు ధ్రువ్ స్పందించారు.

    ‘‘మా నాన్నకు గుండె పోటు వచ్చిందని చెబుతున్న వార్తల్లో నిజం లేదు. అది కేవలం ఛాతి నొప్పి మాత్రమే. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు’’అని ఆయన విజ్ఞప్తి చేశారు.

    మరోవైపు ఒకరోజులో డిశ్చార్జి అవుతారని విక్రమ్ మేనేజర్ ఎం సూర్యనారాయణన్ కూడా స్పష్టంచేశారు.

  7. బ్రేకింగ్ న్యూస్, షింజో అబె: జపాన్ మాజీ ప్రధాని మృతి

    shinzo abe

    ఫొటో సోర్స్, Reuters

    జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతిచెందారు.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఓ సాయుధుడు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే కుప్పకూలిన అబే ఆ తరువాత చికిత్స పొందుతూ మరణించారు.

    ఈ మేరకు లిబరల్ డెమొక్రటిక్ పార్టీ సీనియర్ నేత ఒకరు ధ్రువీకరించారు.

    67 ఏళ్ల షిబె జపాన్‌కు అత్యధిక కాలం ప్రధానిగా పనిచేశారు.

    కాల్పులు జరిపిన వ్యక్తికి సుమారు 40 ఏళ్లు ఉంటాయి. కాల్పుల అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.

  8. విజయమ్మ రాజీనామా, తెలంగాణలో షర్మిలకు అండగా ఉండాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటన

    వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న జగన్, విజయమ్మ

    ఫొటో సోర్స్, YSR congress

    ఫొటో క్యాప్షన్, వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న జగన్, విజయమ్మ

    తెలంగాణలో ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తని, ఇక ముందు జరగబోయేది ఒక ఎత్తని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయమ్మ అన్నారు.

    మంగళగిరిలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న ఆమె, తెలంగాణలో ముందుగానే ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు.

    తెలంగాణలో షర్మిలకు పార్టీ కార్యక్రమాల్లో సహాయంగా ఉండేందుకు తాను వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

    కుటుంబంంలో విభేదాలున్నాయనే ప్రచారానికి, వక్రీకణలకు తావులేకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు.

    కష్టంలో ఉన్నప్పుడు తాను జగన్ కు అండగా నిలిచానని, ఒంటరిపోరాటం చేస్తున్న షర్మిలకు అండగా ఉండేందుకు ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు ఆమె చెప్పారు.

    రాజీనామా చేస్తున్నందుకు వైఎస్ఆర్ అభిమానులు తనను క్షమించాలని విజయమ్మ అన్నారు.

    ఏపీ రాజకీయాలో జగన్‌కు, తెలంగాణలో షర్మిలకు వేర్వేరు రాజకీయ విధానాలు ఉన్నాయన్న విజయమ్మ, ఆ ఇద్దరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను పుణికిపుచ్చుకున్నవారేనని అన్నారు.

  9. యూపీలో నమోదైన ఓ కేసులో జర్నలిస్ట్ మొహమ్మద్ జుబేర్‌కు 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో నమోదైన కేసులో ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్‌కు సుప్రీంకోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

    సీతాపూర్ మేజిస్ట్రేట్ కోర్టు పరిధి దాటి వెళ్లబోనని, తదుపరి విచారణ జరిగే వరకు ఈ అంశంపై ఎలాంటి కొత్త ట్వీట్లు చేయబోనని ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు.

    అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను మొహమ్మద్ జుబేర్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో జుబేర్ పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది.

    మొహమ్మద్ జుబేర్ చేసిన ట్వీట్ పై ఉత్తర్ ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది

    మొహమ్మద్ జుబేర్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్

    ఫొటో సోర్స్, MOhammad Zubair

    ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ జుబేర్ కు సుప్రీం కోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్
  10. Shinzo Abe, Narendra Modi: షింజో అబేపై దాడి విచారకరం - మోదీ

    జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పుల ఘటనపై భారత ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు విచారం వ్యక్తం చేశారు.

    ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

    తన ప్రియమిత్రుడు షింజోపై దాడి ఘటన తనను కలచివేసిందని మోదీ ట్వీట్ చేశారు. ఆయన కోలుకోవాలని కోరుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. షింజో అబేపై కాల్పులు తనను షాక్‌కు గురిచేశాయని రాహుల్ ట్వీట్ చేశారు.

    భారత, జపాన్ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి షింజో అబే కృషి చేశారని ఆయన అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  11. వైసీపీ ప్లీనరీకి బయలుదేరిన విజయమ్మ, జగన్

    jagan, YS vijayamma

    ఫొటో సోర్స్, ysrcongress

    ఆంధ్రప్రదేశ్‌లో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి అన్ని ఏర్పాట్లూ చేశారు.

    నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతల నుంచి కార్యకర్తల వరకు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు.

    పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్లీనరీ జరిగే ప్రదేశానికి బయలుదేరారు.

    అంతకుముందు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయేలోగా ఎలాంటి భారీ నిర్ణయం తీసుకోను

    బోరిస్ జాన్సన్

    ఫొటో సోర్స్, Getty Images

    బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్ కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు పదవిలో కొనసాగుతారు.

    ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఓ హామీ ఇచ్చారు. కొత్త ప్రధాని ఎన్నికయ్యేవరకు కేర్‌టేకర్ ప్రధానిగా బాధ్యతల్లో ఉండబోతున్న తాను ఈలోగా ఎలాంటి భారీ నిర్ణయాలూ తీసుకోబోనని ప్రకటించారు.

    బ్రిటన్‌లోని కొద్దికాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలలో భాగంగా ఆయన జాన్సన్ మద్దతుదారులే ఆయనకు దూరంగా జరుగుతూ రాజీనామాలు చేశారు. దాంతో పాటు జాన్సన్ కూడా ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

    దీంతో అనేక నాటకీయ పరిణామల అనంతరం బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు.

    అయితే, అక్టోబరులో కొత్త ప్రధాని ఎన్నికయ్యేంతవరకు తాను పదవిలో కొనసాగుతానని చెప్పారు.

  13. నదిలో కొట్టుకుపోయిన కారు - 9 మంది యాత్రికుల మృతి, ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనితాల్ జిల్లాలో ప్రమాదం

    ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు ఓ కారు నదిలో కొట్టుకుపోవడంతో పంజాబ్‌కు చెందిన 9 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.

    నైనితాల్ జిల్లాలోని రామ్‌నగర్ వద్ద దేలా నదికి భారీ వరద రావడంతో ప్రవాహ వేగానికి కారు కొట్టకుపోయింది. దీంతో 9 మంది మృత్యువాత పడ్డారు.

    ప్రమాదం నుంచి ఓ బాలికను రక్షించగలిగారు.

    ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని అధికారులు గుర్తించారు.

    మిగతా అయిదుగురి మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. నదిలో కొట్టుకుపోయిన కారులో ఇవి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

    మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

    ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. ‘బీబీసీ తెలుగు’ లైవ్ పేజీకి స్వాగతం

    జాతీయ, అంతర్జాతీయ వార్తలతో పాటు తెలుగు రాష్ట్రాల న్యూస్ అప్‌డేట్స్ కోసం ‘బీబీసీ తెలుగు’ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.