‘కశ్మీరీ పండితుల’ వివాదంలో సాయి పల్లవి పిటీషన్ కొట్టేసిన హైకోర్టు

కశ్మీర్ పండితుల విషయంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నటి సాయి పల్లవి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్డేట్స్‌ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. బ్రిటన్ రాజకీయ సంక్షోభం గురించిన అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  2. సాయి పల్లవి పిటీషన్ కొట్టేసిన హైకోర్టు

    సాయి పల్లవి

    ఫొటో సోర్స్, Facebook/SaiPallavi

    కశ్మీర్ పండితుల విషయంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నటి సాయి పల్లవి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

    భజరంగ్ దళ్ సభ్యుడు ఫిర్యాదు మేరకు గత నెలలో సుల్తాన్ బజార్ పీఎస్‌లో సాయి పల్లవి మీద కేసు నమోదు చేశారు. గత నెల 21న ఆమెకు నోటీసులు జారీ చేశారు.

    సుల్తాన్ బజార్ పోలీసులు జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు నటి సాయిపల్లవి.

    కానీ సాయిపల్లవి అభ్యర్థనను హైకోర్టు తోసి పుచ్చింది.

  3. టీచర్ కావాలనే లక్ష్యం చేరుకోవడానికి పేపర్ గర్ల్‌గా మారిన బాలిక

  4. పలమనేరు టెర్రకోట బొమ్మలకు అంత అందం ఎలా వస్తుంది?

    చిత్తూరు జిల్లా పలమనేరులో రహదారి మీద కనిపించే టెర్రకోట మట్టిబొమ్మల వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. ఇక్కడి కళాకృతులకు దేశం నలుమూలలా డిమాండ్ ఉంది. ఈ బొమ్మలు విదేశాలకూ ఎగుమతి అవుతాయి.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  5. బ్రేకింగ్ న్యూస్, బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా

    బోరిస్ జాన్సన్

    ఫొటో సోర్స్, Reuters

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. కొత్త ప్రధానిని ఎన్నుకునేవరకు తాను కొనసాగుతానని చెప్పారు.

    కొత్తగా ఎన్నిక కానున్న ప్రధానికి తాను ఇవ్వగలిగేంత మద్దతు ఇస్తానని జాన్సన్ చెప్పారు.

    తనను ఆదరించిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు కూడా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.

    ప్రధానిగా ఉండడం ఒక ఎడ్యుకేషన్ అని, తాను ఎంతో నేర్చుకున్నానని ఆయన చెప్పారు.

    ‘‘ఒక్కోసారి పరిస్థితులు అంధకారంగా అనిపించినా బంగారు భవిష్యత్ ఉంటుంది’’ అన్నారు బోరిస్ జాన్సన్.

  6. జగన్ పాలనే గీటురాయిగా వైసీపీ ప్లీనరీ: విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ హాజరవుతారు

    విజయసాయిరెడ్డి

    ఫొటో సోర్స్, facebook/vijayasaireddy

    వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహిస్తున్న తొలి ప్లీనరీకి పార్టీలో క్షేత్ర స్థాయి నుంచి పైస్థాయి వరకు పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు.

    ప్లీనరీ నేపథ్యంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో స్పందన చూస్తుంటే ప్లీనరీ విజయవంతం కావడం ఖాయమని స్పష్టంగా తెలుస్తోందన్నారు.

    పార్టీ ఏర్పడిన తరువాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇదని.. తొలి రెండూ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్వహించగా ఇప్పుడు ఈ మూడో ప్లీనరీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహిస్తోన్నదని చెప్పారు.

    తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక విమర్శలే చేశామని.. అలాగే, ఇప్పుడు గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మాణాత్మక పాలన అందిస్తున్నారని చెప్పారు.

    జగన్మోహన్ రెడ్డి పాలనకు గీటురాయిగా ఈ ప్లీనరీ జరుగుతోందని.. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళాసాధికారిత వంటి అనేక అంశాలలో వైసీపీ సాధించిన విజయాలను ఈ ప్లీనరీలో వివరిస్తామని విజయసాయిరెడ్డి అన్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని.. పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై తొలి రోజు తీర్మానం పెట్టి రెండో రోజు ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు.

    ముందస్తు ఎన్నికలు వస్తే సీఎం కావాలని చంద్రబాబు కలలు కంటున్నారని, ఆయన కలలు కలలుగా మిగిలిపోతాయని విజయసాయిరెడ్డి అన్నారు.

  7. మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఏక్‌నాథ్ శిందే

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే బాధ్యతలు స్వీకరించారు.

    ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఇతర నాయకుల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. నిరాడంబరంగా పంజాబ్ సీఎం పెళ్లి

    భగవంత్ మాన్ వివాహం

    ఫొటో సోర్స్, ani

    పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ నిరాడంబరంగా, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

    హరియాణాకు చెందిన గురుప్రీత్ కౌర్‌‌ను ఆయన వివాహమాడారు.

    మాన్ కుటుంబసభ్యులతో పాటు ఆప్ అధ్యక్షుడు, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా రాజీనామా చేయనున్న బోరిస్ జాన్సన్

    బోరిస్ జాన్సన్

    ఫొటో సోర్స్, Getty Images

    మంత్రులు, ఎంపీల మద్దతు కోల్పోయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్కడి కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా వైదొలగనున్నారు.

    కొద్దిరోజుల తరువాత కన్జర్వేటివ్ పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకుంటారు. అనంతరం అక్టోబరులో కొత్త ప్రధానిని ఎన్నుకుంటారు.

    అంతవరకు బోరిస్ జాన్సన్ ప్రధానిగా కొనసాగుతారు.

  10. బ్రిటన్: కొనసాగుతున్న రాజీనామాలు, బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు

    బోరిస్ జాన్సన్

    ఫొటో సోర్స్, Reuters

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవి కాపాడుకోవడానికి పోరాడుతున్నారు.

    ప్రీతి పటేల్, గ్రాంట్ షాప్స్ సహా ఒకప్పటి తన నమ్మకస్తులైన మద్దతుదారులు అంతా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    తాజాగా బోరిస్ జాన్సన్ కేబినెట్ నుంచి సైమన్ హార్ట్ కూడా వైదొలగారు.

    అటార్నీ జనరల్ బ్రేవర్‌మాన్ రాజీనామా చేయనప్పటికీ నాయకత్వ పోటీలో తానూ ఉంటానని చెప్పారు.

    కాగా.. తాను పదవిలో కొనసాగడానికి ఓటర్ల నుంచి మద్దతు ఉందని ప్రధాని చెబుతున్నారు.

    మరోవైపు తన విమర్శకులను బోరిస్ జాన్స్ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ‘హౌసింగ్ అండ్ కమ్యూనిటీస్ సెక్రటరీ’ మైఖేల్ గోవ్‌ని తొలగించారు.

    బ్రెగ్జిట్ సమయంలో గోవ్ జాన్సన్‌కు అనుకూలంగా వ్యవహరించినప్పటికీ తరువాత ఇద్దరి దారులు వేరయ్యాయి.

    బుధవారం రాజీనామాల పరంపర కొనసాగడంతో బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది.

  11. కృష్ణా జిల్లా: గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు

    సముద్రంలో చేపల వేట

    ఫొటో సోర్స్, Getty Images

    బంగాళాఖాతంలో వేటకు వెళ్లి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన మత్స్యకారులు కృష్ణాజిల్లాకు చెందినవారు.

    ఆరు బోట్లతో పాటు ఒక హెలికాప్టర్ తో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

    గురువారం మచిలీపట్నం నుంచి మరో రెండు బోట్లు గాలింపు కోసం సముద్రంలోకి వెళ్తున్నాయి.

    మెరైన్ పోలీసులు, నేవీ సిబ్బంది, కోస్ట్ గార్డ్స్ బృందాలు గాలింపు చర్యలలో పాల్గొంటున్నాయి.

    గల్లంతైనవారిలో కొందరు మచిలీపట్నం సమీపంలోని క్యాంప్‌బెల్ పేటకు చెందినవారు.

  12. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎయిమ్స్‌లో చికిత్స

    lalu prasad yadav

    ఫొటో సోర్స్, Getty Images

    బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను చికిత్స నిమిత్తం దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు.

    పట్నాలోని ఆయన నివాసంలో మెట్లపైనుంచి జారిపడడంతో లాలూ కుడి భుజానికి గాయమైంది.

    దాంతో తొలుత ఆయన్ను పట్నాలోని పరాస్ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి ఆయన్ను దిల్లీ తీసుకొచ్చారు.

    75 ఏళ్ల లాలూ అనేక శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారు.

    ఈ నెలలోనే ఆయనకు సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగాల్సి ఉంది.

    పట్నాలోని పరాస్ ఆసుపత్రిలో ఉన్నప్పుడే లాలూను బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరామర్శించారు. ప్రభుత్వ వ్యయంతో లాలూకు చికిత్స చేయిస్తామని ఆయన ప్రకటించారు.

  13. ‘బీబీసీ తెలుగు’ లైవ్ పేజీకి స్వాగతం

    జాతీయ, అంతర్జాతీయ వార్తలతో పాటు తెలుగు రాష్ట్రాల న్యూస్ అప్‌డేట్స్ కోసం ‘బీబీసీ తెలుగు’ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.