యుక్రెయిన్ స్కూల్ భవనంపై రష్యా బాంబు దాడి.. 60 మందికి పైగా మృతి
తూర్పు యుక్రెయిన్లోని ఒక స్కూల్ భవనంపై బాంబు దాడి జరగడంతో అనేకమంది పౌరులు మరణించినట్టు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో యుక్రెయిన్, రష్యన్ దళాలతోనూ, వేర్పాటువాదులతోనూ పోరాడుతోంది. ఈ స్కూలు భవనంలో దాదాపు 90 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. వారిలో 30 మందిని రక్షించారు. ఏడుగురు గాయపడ్డారు.
లైవ్ కవరేజీ
ఆలమూరు సౌమ్య
ధన్యవాదాలు..
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.
అనాధ తల్లి దండ్రుల కోసం సకల సౌకర్యాలతో దిల్లీ ప్రభుత్వ వృద్ధాశ్రమాలు
మండు వేసవిలో చల్లదనం అందిస్తున్న 'నన్నారి, సుగంధ' అంటే ఏంటి? ఈ షర్బత్ దేనితో తయారు చేస్తారు?
బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్ పాఠశాలలో ప్రత్యక్షమైన అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్

ఫొటో సోర్స్, Reuters
రొమేనియా, స్లొవేనియా పర్యటనలో ఉన్న అమెరికా ప్రథమ మహిళ యుక్రెయిన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. నాటో మిత్రదేశాలకు అమెరికా మద్దతును పునరుద్ఘాటించేందుకే ఈ పర్యటన జరిగింది.
యుక్రెయిన్ సరిహద్దు పట్టణం ఉజ్జోరోడ్‌లోని ఒక పాఠశాలను జిల్ బిడెన్ సందర్శించారు. అక్కడే యుక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలియెన్‌స్కీని కూడా కలిశారు. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన వారికి తాత్కాలికంగా ఆశ్రయం ఇచ్చేందుకు ఈ పాఠశాలను ఉపయోగిస్తున్నారు.
యుక్రెయిన్ ప్రజలకు అమెరికా ప్రజలు మద్దతుగా నిలబడుతున్నారని చెప్పడానికే తాను వచ్చానని ఈ సందర్భంగా అమెరికా ప్రథమ మహిళ తెలిపారు. ప్రస్తుతం మూడో నెలలోకి ప్రవేశించిన యుద్ధం క్రూరమైనదని, దీనిని ఆపాలని ఆమె అన్నారు.
అమెరికా ప్రథమ మహిళ యుక్రెయిన్ సందర్శనకు రావడం ధైర్యంతో కూడుకున్న చర్య అని ఒలెనా జెలియెన్‌స్కీ అన్నారు.
‘‘యుద్ధం జరుగుతుండగా అమెరికా ప్రథమ మహిళ ఇక్కడకు రావటం అంటే ఏంటో మేం అర్థం చేసుకోగలం. ప్రతిరోజూ యుద్ధం జరుగుతోంది. ప్రతిరోజూ ఎయిర్ సైరన్లు మోగుతున్నాయి. ఈ రోజు కూడా మోగుతూనే ఉన్నాయి’’ అని ఒలెనా అన్నారు.
మాతృదినోత్సవం రోజున అమెరికా ప్రథమ మహిళ పర్యటనకు చాలా ప్రాధాన్యం ఉందని పేర్కొంటూ.. ‘‘ఇలాంటి ముఖ్యమైన రోజున మీ ప్రేమను, మద్దతును మేం అందుకుంటున్నాం’’ అని అన్నారు.
ఫిబ్రవరి 24వ తేదీన రష్యా యుద్ధాన్ని మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ యుక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా బహిరంగంగా కనిపించలేదు.
ఇద్దరు ప్రథమ మహిళలు స్కూల్ భవనంలో ఉన్న వందలాది మంది పిల్లలతో కలసి కూర్చున్నారు. వారితో ఆడుకున్నారు. పేపర్లతో ఎలుగు బంట్లను తయారు చేశారు. ఎలుగు బంటి స్థానిక ప్రావిన్సు అధికారిక చిహ్నం.
తాజ్ మహల్ తేజో మహాలయా? జ్యోతిర్లింగమా?.. ‘22 గదుల రహస్యం’ బహిర్గతం చేయాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్

ఫొటో సోర్స్, Getty Images
ఆగ్రాలోని తాజ్ మహల్‌లో తాళం వేసి ఉన్న 22 గదుల తలుపులను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ద్వారా తెరిపించాలని అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌లో ఒక పిటిషన్ దాఖలైంది.
ఈ గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మూసి ఉన్న గదుల తలుపులు తెరవాలని పిటిషన్‌లో కోరారు. ఇందుకోసం ఏఎన్ఐ చేత నిజ నిర్ధారణ జరిపించాలని పిటిషనర్ పేర్కొన్నారు.ఈ కమిటీ నివేదికను కోర్టుకు సమర్పించేలా, కోర్టు సమక్షంలోనే ఆ నివేదికను బహిర్గతం చేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు.
కొందరు చరిత్రకారులు, హిందూ సంస్థలు తాజ్ మహల్ ఒక పురాతన శివాలయం అని వాదిస్తున్నారని కూడా పిటిషనర్ పేర్కొన్నారు.
ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ అని చాలామంది చరిత్రకారులు విశ్వసిస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం ఇది తేజో మహాలయ, తాజ్ మహల్ జ్యోతిర్లింగం అని నమ్ముతున్నారని కూడా పేర్కొన్నారు.
నాలుగు అంతస్థుల తాజ్ మహల్‌లోని కింది రెండు అంతస్థుల్లోనూ ఉన్న గదుల్లో సుమారు 22 గదులను శాశ్వతంగా మూసేశారని పేర్కొంటూ.. వీటిలోనే శివుని ఆలయం కూడా ఉందని పీఎన్ ఓక్ వంటి ప్రముఖ చరిత్రకారుడితో పాటు కోట్లాది మంది హిందువులు కూడా నమ్ముతున్నారని వెల్లడించారు.
చటేశ్వర్ పుజారా: వరుసగా 4 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు.. అందులో రెండు డబుల్ సెంచరీలు
పవన్ కల్యాణ్‌ది చంద్రబాబు భరోసా యాత్ర – వైసీపీ విమర్శ
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ స్పందించింది.
‘కౌలు రైతు భరోసా యాత్ర’ చేస్తున్న పవన్ కల్యాణ్ మాటలు విన్న తరవాత..ఆయన చేస్తున్నది చంద్రబాబు భరోసా యాత్ర అని అందరికీ మరింత స్పష్టంగా అర్థమైందనినంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు.
రైతుల పేరిట తాను చేస్తున్నది కేవలం రాజకీయమేనని, చంద్రబాబు కోసమే తాను ఈ పని చేస్తున్నానని పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పేశాడని పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలో మరణించిన 450 మందికి పైగా రైతులకు కూడా పరిహారం జగన్ ప్రభుత్వమే పరిహారం ఇచ్చిందని, పవన్ కల్యాణ్ వెళుతున్న ప్రతి రైతు, గుర్తింపు పొందిన కౌలు రైతు ఇంటికీ పరిహారం ఇంతకు ముందే అందిందని రవిచంద్ర కిశోర్ రెడ్డి తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్నవారి ప్రతి కుటుంబానికీ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించి, పోలీస్ రిపోర్టుల ఆధారంగా పరిహారాన్ని అందజేశామని, ఈ విషయాన్ని ఒప్పుకునే మనసు, ధైర్యం పవన్ కల్యాణ్‌కు లేదని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్: ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్లీ వైసీపీకే అధికారం’, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, facebook/janasenaparty
ఫొటో క్యాప్షన్, బాధిత రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు.
ఇప్పటికే పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా వచ్చే ఎన్నికల్లో విపక్షాల మధ్య ఐక్యత అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ మరోసారి తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.
కర్నూలు జిల్లాలో సాగుతున్న కౌలు రైతు భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారు. ఇప్పటికే అనంతపురం, ఏలూరు జిల్లాల్లో పర్యటించిన ఆయన ఆదివారం కర్నూలు జిల్లా సిరివెల్లి మండలంలో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు పార్టీ తరుపున రూ. లక్ష చొప్పున నష్టపరిహారం అందించారు.
ఆ సందర్భంగా మాట్లాడిన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ భవిష్యత్ కోసం అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీతో తమ అనుబంధం కొనసాగుతుందని తెలిపారు. మోదీ అంటే తనకు గౌరవం అన్నారు. అదే సమయంలో పొత్తులు ప్రజలకు ఉపయోగపడాలంటూ పవన్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం దిగజారిపోతుందన్నారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల పక్షాన నిలిచేందుకే తాను బయటకు వచ్చానని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాల్సిన అవసరం వైసీపీ పాలనా తీరు వల్లనే వచ్చిందన్నారు.
ఎవరెవరు కలుస్తారన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. పొత్తుల గురించి చంద్రబాబు మాట్లాడితే అప్పుడు చూద్దామంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నందున అందరూ ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో అద్భుతం జరుగుతుందని, ప్రత్యామ్నాయ ప్రజా ప్రభుత్వం వస్తుందని నమ్మకం ఉందంటూ పవన్ మీడియాతో అన్నారు.
ఇప్పటికే బాదుడే బాదుడు పేరుతో చంద్రబాబు పర్యటనల సందర్భంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లాలో జరిగిన సభలో రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉందని, ఉమ్మడిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వాటికి కొనసాగింపుగా ఉన్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నవనీత్ రాణా: 14 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన అమరావతి ఎంపీ

ఫొటో సోర్స్, Getty Images
పార్లమెంటు సభ్యురాలు నవనీత్ రాణా జైలు నుంచి విడుదలయ్యారు. మహారాష్ట్ర అమరావతి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నవనీత్, ఎమ్మెల్యే అయిన ఆమె భర్త రవి రాణాలు 14 రోజులు జైలులో గడిపారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం మాతోశ్రీ ఎదుట ఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
వీరిద్దరిపైనా దేశద్రోహం కేసు పెట్టారు. ఈ అభియోగం సరికాదని ముంబయి సెషన్స్ కోర్టు మే 4వ తేదీన తెలిపింది. వీరిద్దరికీ బెయిల్ మంజూరు చేసింది.
ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, తనను హింసించిందని నవనీత్ రాణా అన్నారు.
14 రోజుల జైలు జీవితంతోనే తాను ఓటమిని అంగీకరించనని, తాను వెనక్కి తగ్గనని ఆమె తెలిపారు. హనుమాన్ చాలీసా పఠించడం, రాముడి పేరును ఉచ్ఛరించడమే నేరమైతే తాను 14 ఏళ్లు జైలు జీవితం గడిపేందుకు కూడా సిద్ధమేనని అన్నారు.
త్వరలోనే తాను ప్రధాన మంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రిని కలుస్తానని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్: అత్యాచారాలు, గ్యాంగ్‌రేప్‌లు పెరుగుతున్నాయా... హాస్పిటల్స్, రైల్వే స్టేషన్‌లలో కూడా ఎలా జరుగుతున్నాయి?
మదర్స్ డే: అమ్మ బాధ చూడలేక అమ్మలాగే మారిపోయిన కూతురు
తూర్పు యుక్రెయిన్లోని ఒక స్కూల్ భవనంపై బాంబు దాడి..

ఫొటో సోర్స్, SERHIY GAIDAI
తూర్పు యుక్రెయిన్లోని ఒక స్కూల్ భవనంపై బాంబు దాడి జరగడంతో అనేకమంది పౌరులు మరణించినట్టు భావిస్తున్నారు.
ఆ ప్రాంతంలో యుక్రెయిన్, రష్యన్ దళాలతోనూ, వేర్పాటువాదులతోనూ పోరాడుతోంది.
బిలోహోరివ్కా పట్టణంలోని పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో ఇద్దరు చనిపోయారని, 60 మంది శిథిలాల కింద చిక్కుకుని మరణించి ఉండవచ్చని లుహాన్స్క్ ప్రాంత గవర్నర్ సెర్హి గైడై తెలిపారు.
ఈ స్కూలు భవనంలో దాదాపు 90 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. వారిలో 30 మందిని రక్షించారని, ఏడుగురు గాయపడ్డారని ఆయన చెప్పారు.
శనివారం ఒక రష్యా విమానం ఈ స్కూలు భవనంపై బాంబు విడిచిందని శనివారం గైడై తెలిపారు.
ఆయన ఆరోపణను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు. రష్యా దీనిపై స్పందించలేదు.
కాజల్ అగర్వాల్: 'నిన్ను కన్న క్షణమే నీతో ప్రేమలో పడిపోయా...'
వీడియో క్యాప్షన్, ఉమ్రాన్ మాలిక్: బుల్లెట్ లాంటి బంతుల వెనుక రహస్యమిదే 'అసానీ' తుపాను హెచ్చరిక
దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.
ఇది వాయవ్య దిశగా వేగంగా కదులుతూ ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం తుపానుగా మారే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
తుపానుగా మారితే, దీనికి ‘అసానీ’ అని పేరు పెట్టనున్నారు. ఇది శ్రీకాకుళం–ఒడిశా తీరం మధ్య ఈ నెల 10వ తేదీన తీరం దాటే అవకాశం ఉంది.
దీని కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఉత్తర్‌ప్రదేశ్‌లో లక్షకు పైగా లౌడ్ స్పీకర్లు తొలగించామని చెప్పిన యోగి

ఫొటో సోర్స్, ANI
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటివరకు లక్షకు పైగా లౌడ్ స్పీకర్లను తొలగించినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం తెలిపారు. తొలగించిన లౌడ్ స్పీకర్లను మళ్లీ తగిలించకూడదని అధికారులకు సూచించారు.
"ఉత్తర్‌ప్రదేశ్‌లో మతపరమైన ప్రదేశాల నుంచి ఇప్పటివరకు లక్షకు పైగా లౌడ్‌స్పీకర్లను తొలగించామని తెలుపుతూ, వాటిని తిరిగి అమర్చకుండా చూడాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు" అని పీటీఐ వార్తా సంస్థ ట్విట్టర్‌లో తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆ రాష్ట్రంలో, చట్టవిరుద్ధంగా అమర్చిన లౌడ్‌స్పీకర్‌లను తొలగించాలని, ప్రభుత్వ అనుమతి ఉన్న లౌడ్‌స్పీకర్ల నుంచి వచ్చే శబ్దం నిర్ణీత పరిధిలో ఉండేలా చూసుకోవాలనే ప్రచారం గత నెలలో జోరందుకుంది.
వివక్షకు తావు లేకుండా మత సంబంధ స్థలాల నుంచి చట్టవిరుద్ధంగా అమర్చిన లౌడ్ స్పీకర్లను తొలగిస్తున్నామని, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోని వాటిని అక్రమ లౌడ్ స్పీకర్లుగా పరిగణిస్తున్నామని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ లక్నోలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
యుక్రెయిన్ స్కూల్ భవనంపై రష్యా బాంబు దాడి.. 60 మందికి పైగా మృతి

