‘‘దేశద్రోహ చట్టాన్ని పునరాలోచించాల్సిన అవసరం లేదు’’: సుప్రీం కోర్టు అఫిడవిట్‌లో కేంద్రం
దుర్వినియోగం అవుతున్నట్లు చెబుతోన్న కొన్ని ఘటనల ఆధారంగా ఈ చట్టంపై పునరాలోచన తగదని కేంద్రం పేర్కొంది.
లైవ్ కవరేజీ
అరుణ్ శాండిల్య
నేటి ముఖ్యాంశాలు
- వంటగ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 50 పెంచారు.
- హైదరాబాద్‌లో ముస్లిం యువతి ఆశ్రీన్‌ను పెళ్లి చేసుకున్న హిందూ యువకుడు నాగరాజు హత్యను మజ్లీస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
- చంచల్‌గూడ జైలుకు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడ ఎన్‌ఎస్‌యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు.
- మహిళలు బహిరంగ ప్రదేశాలలోకి వచ్చినప్పుడు తల నుంచి పాదాల వరకు శరీరం మొత్తం కప్పుకొనేలా బురఖాలు ధరించాలని అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్‌లు శనివారం ఆదేశాలు జారీ చేశారు.
- ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ టాటా ఉక్కు కర్మాగారంలో ఉన్న బొగ్గు ప్లాంట్‌లో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి.
- దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.
‘‘దేశద్రోహ చట్టాన్ని పునరాలోచించాల్సిన అవసరం లేదు’’: కేంద్రం

ఫొటో సోర్స్, Getty Images
దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
కేదార్‌నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో ఇచ్చిన తీర్పును పునరాలోచించాల్సిన అవసరమే లేదని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది.
రాజ్యాంగంలోని మూడో భాగంలో ఉన్న ఆర్టికల్ 14, 19, 21ల ప్రకారమే, వాటి దృక్కోణం నుంచి చూసే సెక్షన్ 124-ఎ రాజ్యాంగబద్ధతను రాజ్యాంగ ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నట్లు కేదార్‌నాథ్ సింగ్ కేసును తరచి చూస్తే స్పష్టంగా తెలుస్తుందని అందులో వ్యాఖ్యానించింది.
దుర్వినియోగం అవుతున్నట్లు చెబుతోన్న కొన్ని ఘటనల ఆధారంగా ఈ చట్టాన్ని పునరాలోచించుకోవడం తగదని పేర్కొంది.
పరువు హత్యలు కాదు, అహంకార హత్యలు
కేటీఆర్: ‘రాహుల్ గాంధీకి వడ్లు తెల్వదు.. ఎడ్లు తెల్వదు.. రాసిస్తే, చదివి వెళ్లిపోతారు’

ఫొటో సోర్స్, TRS PARTY/FB
తెలంగాణకు ప్రతిపక్షాలు, పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు, పోతుంటారని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్‌టైల్ పరిశ్రమకు భూమిపూజ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందిస్తోన్న ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులందరికీ పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘రాష్ట్రానికి టూరిస్టులు వస్తారు, పోతారు. రోజుకొకరు వస్తున్నారు. నిన్న గాక మొన్న ఒకాయన మహబూబ్‌నగర్‌కు వచ్చిండు. నిన్న ఒకాయన వరంగల్‌కు వచ్చిండు. వాళ్లేదో రాసిస్తే ఆయన చదివి పోయిండు. ఆయనకు ఏం తెల్వదు పాపం.. వడ్లు తెల్వదు.. ఎడ్లు తెల్వదు. ఏదో డైలాగ్ కొట్టాలి.. నాలుగు మాట్లాడాలి.. అవతల పడాలి అనేది వారి ప్రణాళిక అని’’ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ప్రసంగించారు.
హైదరాబాద్ దళిత యువకుడి హత్య: ‘ఇస్లాం ప్రకారం ఇది చాలా పెద్ద నేరం’ - అసదుద్దీన్ ఒవైసీ
యుక్రెయిన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్, రష్యా మత గురువు మధ్య వాదోపవాదాలు ఎందుకు?
రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో నాపై పోటీ చేసి గెలుస్తారా?.. అసదుద్దీన్ సవాల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో పోటీ చేసి గెలిచి చూపించాలని ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అన్నారు.
ఈసారి రాహుల్ గాంధీ వాయనాడు స్థానం నుంచి కూడా ఓడిపోతారని.. కాబట్టి హైదరాబాద్‌లో పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అసదుద్దీన్ అన్నారు.
లేదంటే మెదక్ నుంచైనా పోటీ చేసి గెలిచి చూపించాలని అన్నారు.
టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలకు సవాలుగా నిలిచేందుకు తాను తెలంగాణకు వచ్చినట్లు రాహుల్ గాంధీ తన పర్యటనలో అనడంతో అందుకు స్పందనగా అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
జంషెడ్‌పూర్ టాటా స్టీల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ టాటా ఉక్కు కర్మాగారంలో ఉన్న బొగ్గు ప్లాంట్‌లో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి.
ప్లాంటులోని ఓ బ్యాటరీ పేలడం వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
ఇద్దరు కార్మికులు గాయపడినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రపంచంలో ఎక్కడా లేనన్ని ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు ఒక్క భారతదేశంలోనే ఎందుకు?
మహిళలు ఇంటి నుంచి బయటకొస్తే తల నుంచి పాదాల వరకు కప్పుకొనేలా దుస్తులు ధరించాలి: తాలిబాన్
మహిళలు బహిరంగ ప్రదేశాలలోకి వచ్చినప్పుడు తల నుంచి పాదాల వరకు శరీరం మొత్తం కప్పుకొనేలా బురఖాలు ధరించాలని అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్‌లు శనివారం ఆదేశాలు జారీ చేశారు.
తాలిబాన్ చీఫ్ హయబుతుల్లా అఖుంద్‌జాదా పేరిట ఈ డిక్రీ జారీ అయింది.
‘‘మహిళలు చదోరీ(తల నుంచి కాలి బొటన వేలు వరకు మొత్తం కప్పే బురఖా) ధరించాలి’ అని అందులో ఉందని పాకిస్తాన్ పత్రిక డాన్ తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కేసీఆర్ కుటుంబ పాలనకు ముగింపు పలకండి: రాహుల్ గాంధీ
‘‘తెలంగాణలో కాంగ్రెస్ బయట చాలామంది యువకులు, నాయకులు ఉన్నారు. వారికి కాంగ్రెస్ ఆలోచనా విధానం, సిద్ధాంతాలు వివరించి ఆహ్వానించండి. కేసీఆర్, టీఆర్ఎస్‌తో పోరాడండి.
ఎనిమిదేళ్లుగా తెలంగాణ కలకు నష్టం జరుగుతోంది. తెలంగాణలో దోపిడీ చూస్తున్నారు.
స్కూల్, కాలేజీ, ఆసుపత్రి దక్కలేదు. ఆ సొమ్ము అంతా ఒక కుటుంబానికే వెళ్తోంది.
తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన పోగొట్టండి. తెలంగాణ యువతకు ఇదే ఆహ్వానం.. కాంగ్రెస్ లోకి రండి, తెలంగాణను మార్చండి. సోనియా మీతో పాటు తెలంగాణ కల కన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు.
దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. అయినా, మేం తెలంగాణ ప్రజల పక్షానే ఉన్నాం. తెలంగాణ పోరాటంలో నిజాయితీ ఉంది.
తెలంగాణ ప్రజలతో కలసి తెలంగాణ కలను సాకారం చేస్తాను నేను.
నా అవసరం ఎక్కడ ఉన్నా నేను వచ్చేందుకు సిద్ధం. ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను’’ అన్నారు రాహుల్ గాంధీ.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పార్టీకి నష్టం కలిగేలా మీడియాలో మాట్లాడొద్దు: రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, congress
‘‘కాంగ్రెస్ కుటుంబం మనది. ఆరెస్సెస్ కుటుంబం కాదు. ఒక వ్యక్తి మాత్రమే నిర్ణయించడు. ప్రతి కుటుంబంలో ఉన్నట్లే మన కుటుంబంలోనూ అభిప్రాయ బేధాలు ఉంటాయి.
అందరు చెప్పేదీ వింటాం.కుటుంబ సభ్యులు చెప్పేట్లు నాలుగు గోడల మధ్య మాట్లాడుకుందాం. అంతే కానీ మీడియాలో కాదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
‘సమస్యలు, ఫిర్యాదులూ మన వ్యవస్థీకృతంగానే చేయాలి. మీడియాలోకి వెళ్తే కాంగ్రెస్‌కు నష్టం చేస్తున్నట్లే. నిన్న మీటింగ్ చాలా సక్సెస్ అయ్యింది. మీరంతా కష్టపడండి మీకే ఫలితం కనిపిస్తుంది’ అన్నారు రాహుల్.
పని చేస్తేనే ఎన్నికల్లో టికెట్ దొరుకుతుంది: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గాంధీ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘మన కల సాకారం కావాలంటే మనలో ఐక్యత ముఖ్యం. పనిచేస్తే ప్రతిఫలం ఉంటుంది, ఎంత సీనియర్ అయినా పనిచేయకపోతే టికెట్ లభించదు, మెరిట్ ఆధారంగానే టికెట్లు ఇస్తాం, ప్రజల మధ్య ఉన్నవారికి అవకాశాలిస్తాం, ఎవరి పట్లా వివక్ష లేదు’ అన్నారు రాహుల్.
తెలంగాణ ప్రజలు ఎవరిని కోరుకుంటారో, ఎవరు ప్రజల పక్షాన ఉంటారో వారికే టికెట్లు ఇస్తామని... స్వతంత్ర, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ఇది నిర్ణయమవుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
తెలంగాణలో ప్రతి వ్యక్తికీ వరంగల్ డిక్లరేషన్ గురించి చెప్పాలి
‘మీ మొదటి పని.. తెలంగాణలోని ప్రతి వ్యక్తి, రైతుకూ వరంగల్ డిక్లరేషన్ గురించి వివరించడమే. రాబోయే వంద రోజుల్లో
ఇది కేవలం డిక్లరేషన్ కాదు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజల మధ్య ఇదొక భాగస్వామ్యం. రాబోయే నెల రోజుల్లో మీ నియోజకవర్గంలో అందరికీ సమగ్రంగా వరంగల్ డిక్లరేషన్ గురించి వివరించండి. ఇది కాంగ్రెస్ గ్యారెంటీ. 12 ఏళ్ల బాలుడిని అడిగినా వరంగల్ డిక్లరేషన్ ఏంటి అంటే చెప్పేలా ఉండాలి’’ అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చంచల్‌గూడ జైలులో ఎన్ఎస్‌యూఐ నేతలను కలిసిన రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, RevanthReddy/twitter
చంచల్‌గూడ జైలుకు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడ ఎన్‌ఎస్‌యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు.
అక్కడకు వెళ్లడానికి ముందు ఆయన కార్యకర్తలు, నేతలనుద్దేశించి ట్వీట్ చేశారు.
అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నిబద్ధత గల కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ ఆత్మ అని రాహుల్ గాంధీ అన్నారు.
వారికి అండగా ఉంటానని అన్నారు.
18 మంది ఎన్‌ఎస్‌యూఐ నేతలను టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసిందని ఆయన ట్వీట్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు రాహుల్ గాంధీ నివాళి

ఫొటో సోర్స్, Congress
ఫొటో క్యాప్షన్, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సమాధి వద్ద నివాళులర్పిస్తున్న రాహుల్ గాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 50వ వర్ధంతి సందర్బంగా హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్క్‌లో సంజీవయ్య విగ్రహానికి ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు.
ఆయన వెంటన తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలంతా ఉన్నారు.
కాగా రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన సందర్భంగా పోలీసులు తమ పార్టీ నేతలు, కార్యకర్తలను అడ్డుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఈ మేరకు ఆయన ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పిచ్చుకలను రక్షించేందుకు 50 వేలకు పైగా గూళ్లు పంచారు
మే 9 విక్టరీ డే ఉత్సవాలు రష్యాకు ఎందుకంత ముఖ్యం?
చంచల్‌గూడ చేరుకున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు.
అక్కడ ఆయన జైలులో ఉన్న ఎన్ఎస్‌యూఐ నేతలో ములాఖత్ కానున్నారు.
ఎన్ఎస్‌యూఐ తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మరికొందరు నేతలు ఉస్మానియా యూనివర్సిటీ ఎదుట నిరసన తెలపడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీలోకి అనుమతించాలని కోరుతూ వారు నిరసన తెలిపారు.
వారిని కలుసుకునేందుకే రాహుల్ ఇప్పుడు చంచల్‌గూడ చేరుకున్నారు.
రాహుల్ రాక నేపథ్యంలో చంచల్‌గూడ జైలు వద్ద భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన కేసులో సబ్ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ కుమార్‌ను అనంతపురం జిల్లా పామిడి పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లా జి.ఎ.కొట్టాల తండాకు చెందిన ఓ యువతి తనను విజయ్ కుమార్ ప్రేమించి మోసం చేశారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తాడిపత్రి డీఎస్పీ చైతన్య ‘బీబీసీ’తో చెప్పారు.
యువతి తండ్రి తిరుపాల్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయ్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు.
విజయ్ కుమార్‌కు గతంలో వేరే యువతితో వివాహమైందని, ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న యువతి కూడా ఆయనకు బంధువేనని చెప్పారు.
దర్యాప్తు అనంతరం ఆయనపై చర్యలు ఉంటాయని డీఎస్పీ చెప్పారు.
గతంలో ప్రేమించి మోసం చేశాడని తిరుపతి దిశ పోలీస్ స్టేషన్‌లో విజయ్ కుమార్‌పై ఓ యువతి కేసు పెట్టడంతో ఆ యువతిని విజయ్ కుమార్ పెళ్లి చేసుకున్నారు.