నేటి ముఖ్య పరిణామాలివీ...
- పశ్చిమ దేశాల నుంచి యుక్రెయిన్‌కు ఆయుధాలు తీసుకొస్తున్న యుక్రెయిన్ సైనిక విమానాన్ని తమ సైనిక బలగాలు పేల్చివేశాయని రష్యా చెప్తోంది.
- యుక్రెయిన్‌లో కీలక రేవు నగరమైన మరియుపోల్‌లో యుక్రెయిన్ సైనికులు ఆయుధాలను వదిలేసి లొంగిపోయినట్లయితే వారిని ప్రాణాలతో వదిలేస్తామని రష్యా ఆదివారం నాడు సూచించింది.
- ఉత్తర కొరియా తాను కొత్త క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు చెప్పింది. దీనితో తన సైనిక సామర్థ్యం గణనీయంగా పెరుగుతందని చెప్పింది.
- బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ వారంలో భారత్ పర్యటనకు రాబోతున్నారు. రెండు దేశాల మధ్య రక్షణ బంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన భారత్‌లో పర్యటించనున్నారు.
- యుక్రెయిన్ మీద అణ్వస్త్రాలు ప్రయోగించటానికి రష్యా సిద్ధపడే అవకాశముందని మాజీ సోవియట్ యూనియన్ అధ్యక్షుడు నికితా కృశ్చేవ్ మునిమనుమరాలు నీనా కృశ్చేవా ఆందోళన వ్యక్తంచేశారు.
ఇవీ ఈనాటి ముఖ్య పరిణామాలు. ఇక్కడితో నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.
యుక్రెయిన్ మీద రష్యా యుద్ధానికి సంబంధించిన తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని ఫాలో అవండి.