మరియుపోల్‌లో మా సైనికులు రష్యాకు లొంగేది లేదు: యుక్రెయిన్ ఎంపీ

మార్ఫింగ్ చేసిన ఒక వీడియో వైరల్ కావటంతో ఆదివారం తెల్లవారుజామున హుబ్బళిలో అల్లరిమూకలు హింసకు దిగాయి. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను పేల్చారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. నేటి ముఖ్య పరిణామాలివీ...

    • పశ్చిమ దేశాల నుంచి యుక్రెయిన్‌కు ఆయుధాలు తీసుకొస్తున్న యుక్రెయిన్ సైనిక విమానాన్ని తమ సైనిక బలగాలు పేల్చివేశాయని రష్యా చెప్తోంది.
    • యుక్రెయిన్‌లో కీలక రేవు నగరమైన మరియుపోల్‌లో యుక్రెయిన్ సైనికులు ఆయుధాలను వదిలేసి లొంగిపోయినట్లయితే వారిని ప్రాణాలతో వదిలేస్తామని రష్యా ఆదివారం నాడు సూచించింది.
    • ఉత్తర కొరియా తాను కొత్త క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు చెప్పింది. దీనితో తన సైనిక సామర్థ్యం గణనీయంగా పెరుగుతందని చెప్పింది.
    • బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ వారంలో భారత్ పర్యటనకు రాబోతున్నారు. రెండు దేశాల మధ్య రక్షణ బంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన భారత్‌లో పర్యటించనున్నారు.
    • యుక్రెయిన్ మీద అణ్వస్త్రాలు ప్రయోగించటానికి రష్యా సిద్ధపడే అవకాశముందని మాజీ సోవియట్ యూనియన్ అధ్యక్షుడు నికితా కృశ్చేవ్ మునిమనుమరాలు నీనా కృశ్చేవా ఆందోళన వ్యక్తంచేశారు.

    ఇవీ ఈనాటి ముఖ్య పరిణామాలు. ఇక్కడితో నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.

    యుక్రెయిన్ మీద రష్యా యుద్ధానికి సంబంధించిన తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని ఫాలో అవండి.

  2. దోన్బస్‌ను వదులుకునే ఉద్దేశమే లేదు: జెలియెన్‌స్కీ

    దోన్బస్ ప్రాంతంలో పోరాడుతున్నామనీ, తమకు లొంగిపోయే ఉద్దేశం లేదని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ అన్నారు.

    ఈ ఘర్షణను ఆపడానికి దోన్బస్, తూర్పు యుక్రెయిన్‌లోని కొంతభాగాన్ని మాస్కో స్వాధీనం చేసుకోవడానికి అనుమతించే ఆలోచనను జెలియెన్‌స్కీ తోసిపుచ్చారు.

    ‘‘యుక్రెయిన్, ఇక్కడి ప్రజలు చాలా స్పష్టతతో ఉన్నారు. మాకు వేరే వారి భూభాగాలపై హక్కు లేదు. మా భూభాగాలను ఇతరులకు వదులుకోం’’ అని ఆయన అన్నారు.

    దోన్బస్‌
  3. ఖార్కియెవ్‌లో భీకర షెల్లింగ్

    ఖార్కియెవ్‌

    ఫొటో సోర్స్, EPA

    ఖార్కియెవ్‌ నగరంలో జరిగిన బాంబుల దాడిలో అయిదుగురు చనిపోగా, 13 మంది గాయాల పాలయ్యారని స్థానిక అధికారులు చెప్పారు.

    నగరవ్యాప్తంగా వరుసగా సైరన్ల మోత వినిపించింది. సిటీ సెంటర్‌పై బాంబు దాడి జరిగింది. నివాస భవనాలపై జరిగిన దాడుల్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు ప్రయత్నిస్తున్నాయి.

    ఘటనా స్థలంలో ఉన్న వార్తా ఏజెన్సీ ఏఎఫ్‌పీ రిపోర్టర్లు, అక్కడ ఏం జరిగిందో వివరించారు. షెల్లింగ్ కారణంగా నగరం అంతటా మంటలు చెలరేగాయని, భవనాల పైకప్పులు ధ్వంసం అయ్యాయని వారు చెప్పారు.

    రాజధాని కీయెవ్ నుంచి వైదొలిగిన రష్యా దళాలు ఖార్కియెవ్ సహా యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలో దాడులను పెంచాయి. రష్యా సరిహద్దుకు ఖార్కియెవ్ కేవలం 21 కి.మీ దూరంలో ఉంటుంది.

    శుక్రవారం నివాస భవానాలపై జరిగిన దాడిలో 10 మంది మరణించారు. శనివారం నాటి దాడుల్లో మరో ఇద్దరు చనిపోయారు.

  4. భారత్ వల్లే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మరణాలపై అసలు లెక్కలు విడుదల చేయడం లేదా

  5. ఈ మొక్కలు పులుల ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి

  6. ఐపీఎల్: ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ విజయం

    మార్‌క్రమ్

    ఫొటో సోర్స్, IPL/twitter

    ఫొటో క్యాప్షన్, మార్‌క్రమ్

    ఐపీఎల్‌లో పంజాబ్ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 151 పరుగులు చేయగా హైదరాబాద్ జట్టు 19వ ఓవర్లోనే విజయం అందుకుంది.

    18.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 152 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.

    హైదరాబాద్ జట్టులో మార్‌క్రమ్ 41, నికోలస్ పూరన్ 35, రాహుల్ త్రిపాఠీ 34, అభిషేక్ శర్మ 31 పరుగులు చేశారు.

    ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్-4లోకి చేరింది.

  7. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

    తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.

    గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండొచ్చని తెలంగాణ వాతావరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ ఎ.శ్రావణి చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే, వెంటనే ఈ 5 పనులు చేయండి

  9. 100 ఏళ్ల వయసున్న నాలుగు భారీ వృక్షాలను వేరే చోట సురక్షితంగా నాటిన మహబూబ్‌నగర్ అధికారులు

    తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో వందేళ్ల వయసున్న నాలుగు భారీ వృక్షాలను అక్కడి అధికారులు వేరే చోటికి తరలించారు.

    పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ గెస్ట్‌ హౌస్ ప్రాంగణంలోని ఈ వృక్షాలను పట్టణ శివార్లలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కుకు తరలించారు.

    రోడ్లు, భవనాల శాఖ గెస్ట్ హౌస్ వద్ద మార్కెట్ నిర్మిస్తుండడంతో ఈ వృక్షాలను అక్కడి నుంచి కేసీఆర్ పార్క్‌కు తరలించి అక్కడ మళ్లీ నాటారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. మరియుపోల్‌లో యుక్రెయిన్ సైనికులు రష్యాకు లొంగేది లేదు: ఒడెసా ఎంపీ

    ఒడెసా ఎంపీ ఒలెక్సీయ్ గొన్చారెంకో

    మరియుపోల్‌లో రష్యా బలగాలతో పోరాడుతున్న యుక్రెయిన్ సైనికులు రష్యాకు లొంగిపోరని ఒడెసా ఎంపీ ఒలెక్సీయ్ గొన్చారెంకో బీబీసీతో చెప్పారు.

    ఆయన ఆదివారం బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘నేను నిన్న వాళ్లతో మాట్లాడాను. వాళ్లు చివరి వరకూ యుద్ధం చేస్తారని నాకు తెలుసు’’ అని పేర్కొన్నారు.

    మరియుపోల్‌లో మిగిలివున్న యుక్రెయిన్ సైనికులను నిర్మూలించినట్లయితే రష్యాతో చర్చల ప్రక్రియ ముగిసిపోతుందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ హెచ్చరించారు.

    యుక్రెయిన్‌లో కీలక రేవు నగరమైన మరియుపోల్‌లో యుక్రెయిన్ సైనికులు ఆయుధాలను వదిలేసి లొంగిపోయినట్లయితే వారిని ప్రాణాలతో వదిలేస్తామని రష్యా ఆదివారం నాడు సూచించింది.

    మరియుపోల్‌లో పరిస్థితి నిజమైన ‘జాతి హననం’గా ఉందని.. ప్రస్తుతం లక్ష మంది వరకూ పౌరులు నగరంలో ఉన్నారని గొన్చారెంకో చెప్పారు.

    రష్యా సైన్యం చుట్టుముట్టిన ఈ నగరంలో 20,000 మందికి పైగా జనం చనిపోయినట్లు భావిస్తున్నారన్నారు.

  11. యుక్రెయిన్‌లో మరో రష్యన్ కమాండర్ మృతి

    యుక్రెయిన్ యుద్ధం

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌ మీద దండయాత్ర చేస్తున్న రష్యా సైనిక బలగాల్లోని 8వ సైన్యం డిప్యూటీ కమాండర్ వ్లాదిమిర్ పెట్రోవిచ్ ప్రోలోవ్ యుక్రెయిన్ యుద్ధంలో చనిపోయారని రష్యా వార్తా సంస్థ టాస్ తెలిపింది.

    ఈ వార్తను సెయింట్ పీటర్స్‌బర్గ్ గవర్నర్ అలెగ్జాండర్ బెగ్లోవ్ నిర్ధరించారు. ‘‘యుక్రెయిన్ జాతీయవాదులతో పోరాటంలో వ్లాదిమిర్ పెట్రోవిచ్ ఫ్రోలోవ్ వీరమరణం చెందారు’’ అని బెగ్లోవ్ పేర్కొన్నారు.

    ‘‘డోన్బాస్‌లో పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇకపై బాంబు పేలుళ్లు వినకుండా ఉండటానికి, చావు కోసం ఎదురుచూస్తూ ఉండటానికి స్వస్తి పలకటానికి, ఇల్లు వదిలేసి చివరి వీడ్కోలు చెప్తూ వెళ్లిపోవటాన్ని ఆపటానికి ఫ్రోలోవ్ తన ప్రాణాలు త్యాగం చేశారు’’ అని ఆయన చెప్పారు.

    అయితే యుక్రెయిన్‌లో జరుగుతున్న షెల్లింగ్ కాల్పుల్లో అత్యధికంగా రష్యా బలగాలు చేస్తున్న కాల్పులే.

    ఈ యుద్ధంలో ఇప్పటివరకూ రష్యా సైన్యంలో పలువురు జనరళ్లు, ఉన్నతస్థాయి సైనికాధికారులు చనిపోయినట్లు వార్తలు వచ్చాయ. ఇంతటి ఉన్నతస్థాయి సైనికాధికారులు యుద్ధరంగానికి అంత దగ్గరగా వెళ్లి తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టటం అసాధారణం. అయితే.. యుద్ధంలో తమ సైనిక చర్యలు సఫలమయ్యేలా పట్టు సాధించటానికి వారు యుద్ధరంగంలోకి దిగుతున్నారని పశ్చిమ దేశాల వర్గాలు భావిస్తున్నాయి.

  12. ఒకేసారి వేల డ్రోన్లతో దాడులు - భవిష్యత్‌ యుద్ధాలు ఇలానే జరుగుతాయా

  13. ‘రష్యా అణ్వస్త్రాలు ఉపయోగించే అవకాశముంది’ - కృశ్చేవ్ మునిమనుమరాలి హెచ్చరిక

    నీనా కృశ్చేవా
    ఫొటో క్యాప్షన్, నీనా కృశ్చేవా

    యుక్రెయిన్ మీద అణ్వస్త్రాలు ప్రయోగించటానికి రష్యా సిద్ధపడే అవకాశముందని మాజీ సోవియట్ యూనియన్ అధ్యక్షుడు నికితా కృశ్చేవ్ మునిమనుమరాలు నీనా కృశ్చేవా ఆందోళన వ్యక్తంచేశారు.

    న్యూయార్క్‌లోని న్యూస్కూల్‌లో అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రష్యన్ స్కాలర్ నీనా కృశ్చేవా. ఆమె ఆదివారం నాడు బీబీసీతో మాట్లాడుతూ.. యుక్రెయిన్ మీద యుద్ధంలో విజయం సాధించటం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చివరికి ఏంకావాలన్నా చేస్తారని పేర్కొన్నారు.

    ‘‘ఈ యుద్ధంలో గెలవాలన్నదే పుతిన్ లక్ష్యమని, గెలవటం కోసం ఎంతకైనా తెగించటానికి సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నా’’ అని చెప్పారామె.

    వ్లాదిమిర్ పుతిన్

    ఫొటో సోర్స్, EPA

    ‘‘విజయం సాధించినట్లు ప్రకటించటానికి వ్యూహాత్మక అణ్వస్త్రాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని భావిస్తే.. రష్యా దానిని ఉపయోగించటానికి సిద్ధంగా ఉండొచ్చు’’ అని పేర్కొన్నారు.

    ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్‌ నికితా కృశ్చేవ్ నాయకుడిగా ఉన్నపుడు ఆందోళన రేకెత్తించిన దీర్ఘశ్రేణి క్షిపణులకన్నా.. వ్యూహాత్మక అణ్వాయుధాలు తక్కువ శక్తివంతమైనవి.

    పుతిన్‌ ఈ వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించవచ్చునని, అవి యుక్రెయిన్ నేల మీద దారుణమైన ప్రభావం చూపవచ్చునని పుతిన్ విమర్శకురాలైన నీనా కృశ్చేవా ఆందోళన వ్యక్తంచేశారు.

  14. తెలంగాణ జీవరేఖ ప్రాణహిత.. ఈ నది ప్రాముఖ్యత, చారిత్రక విశేషాలు ఏంటంటే..

  15. కర్నూలు జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తత

    కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

    ఫొటో సోర్స్, UGC

    ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా హోలగుంద మండల కేంద్రంలోశనివారం హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రదర్శన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రదర్శన పెద్ద మసీదు దగ్గరికి చేరుకోగానే హిందూ ముస్లింలు రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.

    ఈ ఘర్షణలో ఆరుగురు గాయపడ్డట్లు కర్నూలు జిల్లా ఎస్‌పీ సుధీర్ కుమార్ రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు. అయితే.. సుమారు 20 మందికి గాయాలయ్యాయని స్థానికులు అంటున్నారు.

    పరిస్థితులు ఉద్రిక్తంగా మారటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎస్‌పీ స్వయంగా ఈ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

    కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

    ఫొటో సోర్స్, UGC

    ప్రదర్శన పెద్ద మసీదు దగ్గరికి చేరుకోగానే జై శ్రీరామ్ అంటూ ఓ వర్గం నినాదాలు చేసిందని దీంతో మరో వర్గం అల్లాహు అక్బర్ అని నినాదాలు చేయడంతో ఒకరిపై ఒకరు రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారని ఎస్‌పీ సుధీర్‌ కుమార్ రెడ్డి చెప్పారు. ఘటన సమయంలో పోలీసులు అక్కడే ఉండటంతో కేవలం పది నిమిషాల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చామని తెలిపారు.

    ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలకు చెందిన 30 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇందులో బయట వ్యక్తులు ఎవరూ లేరని అందరూ స్థానికులేనని ఆయన వివరించారు.

  16. కర్ణాటకలో మార్ఫింగ్ వీడియోపై ఆందోళన.. హుబ్బళిలో హింస

    హుబ్బళిలో అల్లర్లు

    ఫొటో సోర్స్, ANI

    కర్ణాటకలోని హుబ్బళిలో ఆదివారం ఉదయం హింస తలెత్తింది. మార్ఫింగ్ చేసిన ఒక వీడియో వైరల్ కావటంతో తెల్లవారుజామున అల్లరిమూకలు హింసకు దిగాయి. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను పేల్చారు.

    ‘‘పోలీసులకు ఫిర్యాదు అందటంతో.. ఒక ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేస్తున్నట్లు మార్ఫింగ్ చేసిన వీడియోను పోస్ట్ చేసిన యువకుడిని అరెస్ట్ చేశాం’’ అని హుబ్బళి పోలీస్ కమిషనరల్ లభు రామ్ బీబీసీకి తెలిపారు.

    రాత్రి ప్రార్థనల అనంతరం ఓల్డ్ సిటీ పోలీస్ స్టేషన్ వద్ద అకస్మాత్తుగా జనం పోగయ్యారు. ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తినిఅప్పటికే అరెస్ట్ చేశామని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్తూ పోలీసులు చేసిన శాంతియుత ప్రయత్నాలు ఫలించలేదు.

    ‘‘ఆ గుంపు హింసాత్మకంగా మారి రాళ్లు విసరటం, పోలీసు వాహనాన్ని తలకిందులు చేయటం మొదలుపెట్టింది’’ అని లభు రామ్ చెప్పారు.

    దీంతో పోలీసులు వారితో తలపడాల్సి వచ్చింది. అల్లరిమూక అటూగా వెళుతున్న వాహనాల మీద, సమీపంలోని ఆస్పత్రి మీద, మరో ప్రార్థనా స్థలం మీద రాళ్లు విసిరటంతో పాటు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టిందని కమిషనర్ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఈ ఘర్షణలో పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. కొన్ని పోలీసు వాహనాలకు అల్లరి మూకలు నిప్పు పెట్టాయి.

    ‘‘ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. నిషేధాజ్ఞలు విధించాం’’ అని పోలీస్ కమిషనర్ వివరించారు.

    దీనికిముందు శనివారం నాడు.. హుబ్బళి జంట నగరమైన ధార్వాడ్‌లో ఒక ఆలయం వద్ద ముస్లిం చిరువ్యాపారికి చెందిన పుచ్చకాయలను ధ్వంసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు శ్రీరామ్‌సేన సభ్యులకు శ్రీరామ్‌సేన సంస్థ సన్మానం చేసింది.

    ఆ చిరువ్యాపారి ఆ ఆలయం దగ్గర దశాబ్ద కాలం నుంచీ పుచ్చకాయలు, ఇతర పండ్లు అమ్ముతూ జీవిస్తున్నారు. గత వారం కొందరు వ్యక్తులు అతడి దుకాణం దగ్గరకు వెళ్లి దాదాపు పది క్వింటాళ్ల పుచ్చకాయలను ధ్వంసం చేసింది.

  17. హాలీవుడ్‌ సెన్సేషన్‌ 'మెర్ల్ ఓబెరాన్': బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఈ భారతీయ తారను మనం మరిచిపోయామా?

  18. భారత్‌లో పర్యటించనున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    నరేంద్రమోదీ, బోరిస్ జాన్సన్

    ఫొటో సోర్స్, ANI

    బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ వారంలో భారత్ పర్యటనకు రాబోతున్నారు. రెండు దేశాల మధ్య రక్షణ బంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన భారత్‌లో పర్యటించనున్నారు.

    దిల్లీలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జాన్సన్ సమావేశం కానున్నారు. రక్షణ, వాణిజ్య బంధాలపై ప్రధానంగా వీరు చర్చల్లో దృష్టి కేంద్రీకరిస్తారు.

    ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బోరిస్ జాన్సన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇదివరకు ఆయన పర్యటనలు కోవిడ్-19 వ్యాప్తి వల్ల వాయిదా పడ్డాయి.

  19. దేశంలో 1,150 కొత్త కోవిడ్ కేసులు నమోదు

    కోవిడ్-19

    ఫొటో సోర్స్, Reuters

    భారతదేశంలో గత 24 గంటల్లో 1,150 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకూ దేశంలో మరో నలుగురు వ్యక్తులు కోవిడ్ వల్ల చనిపోయారు.

    ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 11,558 కి పెరిగినట్లు చెప్పింది.

    ఇప్పటివరకూ 4,25,08,788 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది.

    శనివారం నాటికి దేశవ్యాప్తంగా 186.51 కోట్ల వాక్సినేషన్లు పూర్తయ్యాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. మరో క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా.. తమ అణ్వాయుధ సామర్థ్యం బలపడిందని ప్రకటన

    ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష

    ఫొటో సోర్స్, Reuters

    ఉత్తర కొరియా తాను కొత్త క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు చెప్పింది. దీనితో తన సైనిక సామర్థ్యం గణనీయంగా పెరుగుతందని చెప్పింది.

    ఈ కొత్త తరహా క్షిపణి చిన్నపాటి అణుబాంబులను తీసుకెళ్లగలదని నిపుణులు భావిస్తున్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధాన్ని పరీక్షించటానికి ఏర్పాట్లు ప్రారంభించినట్లు వారు అంచనా వేస్తున్నారు.

    ఉత్తర కొరియా శనివారం రాత్రి రెండు క్షిపణులను సముద్రంలోకి పేల్చినట్లు దక్షిణ కొరియా నిర్ధారించింది.

    ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్-సంగ్ జయంతి సందర్భంగా ఈ క్షిపణులను పేల్చివుండవచ్చునని దక్షిణ కొరియా భావిస్తోంది.

    ఈ కొత్త క్షిపణి వ్యవస్థ పరీక్షను అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వీక్షించారని ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ ఆదివారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపింది.

    ‘‘దీర్ఘశ్రేణి ఆయుధాల సామర్థ్యాన్ని ఇది గణనీయంగా పెంచుతుంది. వ్యూహాత్మక అణ్వాయుధాల నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది’’ అని పేర్కొంది.