కేసీఆర్: ‘యాసంగిలో ప్రతి గింజను మేమే కొంటాం.. రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు’

తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. జీవో 111 ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అలాగే వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు..

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ & పద్మ మీనాక్షి

  1. పాకిస్తాన్ కొత్త ప్రధాని భారత్‌తో సంబంధాలు పెంచుకుంటారా, సైన్యం చెప్పినట్లు నడుచుకుంటారా

  2. ఇవాళ్టి ముఖ్యాంశాల్లో కొన్ని...

    న్యూయార్క్‌ సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌ కాల్పుల ఘటనలో 16 మంది గాయపడ్డారు. అనుమానితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

    అంతర్జాతీయ రుణాల చెల్లింపుకు మరింత గడువు కావాలని శ్రీలంక కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులను తీర్చే అవకాశం లేదని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.

    యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి యుక్రెయిన్‌లో మూడొంతుల మంది పిల్లలు ఇళ్లు వదిలిపెట్టి వెళ్లినట్లు యూనిసెఫ్ చెప్పింది.

    యాసంగిలో ప్రతి గింజను తామే కొంటామని, రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జీవో 111ను ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు.

    తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా నాలుగు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. బ్రేక్ దర్శనాలను బుధవారం నుంచి ఆదివారం వరకు రద్దు చేసింది.

    ఇక్కడితో లైవ్ అప్‌డేట్స్ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.

  3. శ్రీకాకుళం - కొవ్వాడ: ఆ ఊరిలో అందరూ పోలీసులే... కానీ, ఎవరికీ ఖాకీ దుస్తులు లేవు

  4. బ్రేకింగ్ న్యూస్, న్యూయార్క్‌లో కాల్పులు, 13 మందికి గాయాలు

    న్యూయార్క్
    ఫొటో క్యాప్షన్, కాల్పులు జరిగిన ప్రాంతం

    న్యూయార్క్‌లోని సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌ కాల్పుల ఘటనలో 13 మంది గాయపడ్డారు.

    పేలని బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే, వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇవ్వలేదు.

    ఘటన జరిగిన ప్రాంతానికి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు.

    అనుమానిత వ్యక్తి ఘటన స్థలం నుంచి పారిపోయినట్లు చెబుతున్నారు.

    అమెరికా అధ్యక్షుడు బైడెన్, న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్‌లకు పరిస్థితిని అధికారులు వివరించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. కేసీఆర్: ‘యాసంగిలో వడ్లను మేమే కొంటాం.. రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు’

    కేసీఆర్

    ఫొటో సోర్స్, fb/kcr

    యాసంగిలో ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని కేసీఆర్ చెప్పారు.

    రైతులు తక్కువ ధరకు వడ్లను అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు.

    ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

    రూ.1960 మద్దతు ధరకు ధాన్యం కొంటామని కేసీఆర్ వివరించారు.

    తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్ వెల్లడించారు.

  6. బ్రేకింగ్ న్యూస్, కేసీఆర్: తెలంగాణ యూనివర్సిటీల్లో 3500 నియామకాలు, ఆరు ప్రైవేటు యూనివర్సిటీలకు ఆమోదం

    తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

    గతంలో ఇచ్చిన హామీ మేరకు జీవో 111 ఎత్తివేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

    ఆరు ప్రైవేటు యూనివర్శిటీలకు ఆమోదం తెలిపింది.

    అలాగే, యూనివర్సిటీల్లో 3500 నియామకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    కేసీఆర్ లైవ్‌ ఇక్కడ చూడొచ్చు.

  7. పవన్ కల్యాణ్: ‘ఇంకొకసారి నన్ను వాళ్లకు, వీళ్లకు దత్తపుత్రుడు అంటే జగన్‌ను సీబీఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది’

    పవన్ కల్యాణ్

    ఫొటో సోర్స్, twitter/janasena

    ‘ఇంకొకసారి నన్ను వాళ్లకు, వీళ్లకు దత్తపుత్రుడు అంటే జగన్‌ను సీబీఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

    'జనసేనను టీడీపీ బీ టీమ్ అంటే వైసీపీని చర్లపల్లి జైలు షటిల్ టీమ్' అంటామని పేర్కొన్నారు.

    అప్పుడు మీరు బాదుడే బాదుడు అన్నారు కదా! ఇప్పుడు మీరు చేస్తున్న పనిని ఏమనాలి? అని ఆయన జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అనంతపురం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్.. రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు.

    రైతు కుటుంబాలను పరామర్శిస్తున్నామని తెలిసి, ప్రభుత్వం హుటాహుటిన వారికి నష్టపరిహారం చెల్లిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు.

    ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

  8. ‘నన్ను రేప్ చేసి, నా భర్తను చంపేశారు’

  9. బిహార్: నితీష్ కుమార్ సభలో బాంబు దాడి

    బిహార్‌లోని నలంద దగ్గర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్వహిస్తున్న సభలో బాంబు విసిరారు. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. శ్రీలంకలో అసలు సమస్యేంటి?

  11. ఝార్ఖండ్‌లో రోప్‌వే ప్రమాదం - ముగిసిన రక్షణ చర్యలు

    హేమంత్ సొరేన్

    ఫొటో సోర్స్, ANI

    ఝార్ఖండ్‌లోని త్రికూట్ రోప్‌వేలో చిక్కుకున్న ప్రయాణికుల రక్షణ చర్యలు ముగిసాయి. రక్షణ చర్యల్లో ఎన్‌డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు పాల్గొన్నాయి.

    ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. దీని పై విచారణ నిర్వహిస్తామని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అన్నారు.

    ఝార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో ఏప్రిల్ 10న రోప్‌వే మార్గంలోప్రమాదం చోటు చేసుకుంది.

    దేవ్‌ఘర్ ఘటన పై విచారణ జరపాలని ఝార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 26న ఈ అంశం పై విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. విచారణకు ముందు ప్రభుత్వం పూర్తి నివేదికను సమర్పించాలని కోరింది.

  12. యుక్రెయిన్ అమ్మాయి, భారత్ అబ్బాయి... కోవిడ్‌కు ముందు పరిచయం, లాక్‌డౌన్‌లో ప్రేమ, యుద్ధ సమయంలో పెళ్లి

  13. తెలంగాణ: ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్ ప్రారంభం

    తెలంగాణలోని మహిళా భద్రతా విభాగంలో ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ సెల్ "ప్రైడ్ సెల్"ను డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ప్రారంభించారు.

    ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ కోసం ప్రైడ్ సెల్ విభాగం ఏర్పాటు చేయడం దేశంలోనే మొదటిసారి.

    ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఐజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి పాల్గొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. జేఎన్‌యూ: రామ నవమి రోజున హాస్టల్‌లో మాంసం వండినందుకు అల్లర్లు

    శ్రీ రామనవమి నాడు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లోని కావేరీ హాస్టల్‌లో హింసాత్మక ఘటనలతో సంబంధం ఉన్న వారి పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

    రామ నవమి రోజున జేఎన్‌యూలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

    జేఎన్‌యూలోని కావేరీ హాస్టల్‌లో దాదాపు 320 మంది విద్యార్థులు ఉంటారు.

    ఈ మెస్‌ దగ్గర్లోనే ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు రామనవమి సందర్భంగా హోమం, పూజా కార్యక్రమం నిర్వహించారు. జెఎన్‌యులోని ఇతర హాస్టళ్లలో నివసిస్తున్న కొంత మంది విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనేందుకు వచ్చారు.

    ఒకవైపు హోమం జరుగుతుండగా హాస్టల్‌కు చికెన్ సరఫరా చేసే వ్యాపారి 25 కిలోల చికెన్‌తో కావేరీ హాస్టల్‌కు చేరుకున్నారు. అయితే, ఈ రోజు చికెన్ వండేందుకు లేదంటూ హోమంలో పాల్గొంటున్న విద్యార్థులు ఆ వ్యాపారిని వెనక్కి తిరిగి పంపించినట్లు కావేరీ హాస్టల్‌ మెస్‌ కార్యదర్శి ముదాసిర్‌ చెప్పారు.

    భోజనం చేసే సమయానికి చికెన్ లేకపోవడంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

    ఆదివారం జరిగిన ఘటనతో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    జేఎన్‌యూ మెస్
  15. గుజరాత్: శ్రీరామనవమి ఉత్సవాల్లో చెలరేగిన అల్లర్లు

    గుజరాత్

    ఫొటో సోర్స్, ANI

    శ్రీ రామనవమి సందర్బంగా గుజరాత్‌లో హిమ్మత్ నగర్‌లో జరిగిన గొడవలకు సంబంధించి పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

    రెండు వేర్వేరు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడితో ఈ గోడవ మొదలైనట్లు సాబర్‌కాంఠ జిల్లా అధికారులు తెలిపారు.

    కొంత మంది పెట్రోల్ బాంబులతో దాడి చేసుకుంటున్నట్లుగా కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.

    సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాల్ కుమార్ వధేలా చెప్పారు.

    హిమ్మత్ నగర్‌లో ఆదివారం జరిగిన రామ నవమి రధ యాత్రలోజరిగిన రాళ్ల దాడితో ఈ గోడవ మొదలయింది. దీంతో అక్కడి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పరిస్ధతిని అదుపు చేసేందుకు సెక్షన్ 144 విధించారు.

  16. శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని సులభంగా అర్థం చేసుకోండిలా....

    శ్రీలంక

    ఫొటో సోర్స్, Getty Images

    శ్రీలంక చిన్న ద్వీప దేశం. ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. కేవలం 2.2 కోట్ల జనాభా ఉండే శ్రీలంక, కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొన్ని నెలలుగా అక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో ఆహారం, గ్యాస్, పెట్రోలియం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు రష్యా, యుక్రెయిన్ యుద్ధం కారణంగా లంక పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది.

    విద్యుత్ కోతలు, ఖాళీ ఏటీఎంలు, పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు సర్వసాధారణం అయ్యాయి. శ్రీలంక దాదాపు ప్రతీది దిగుమతి చేసుకుంటుంది. పెట్రోలియం నుంచి ముడి చక్కెర వరకు అన్నీ దిగుమతులే. ఇప్పుడు దిగుమతులకు అంతరాయం కలగడంతో భారీ ద్రవ్యోల్బణం, అత్యవసర వస్తువులకు సుదీర్ఘ క్యూలు ఏర్పడుతున్నాయి.

    శ్రీలంకలో ఆర్ధిక పరిస్థితి పై పూర్తికథనం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి

  17. అంతర్జాతీయ రుణాల చెల్లింపుకు గడువు కోరిన శ్రీలంక

    అంతర్జాతీయ ద్రవ్య నిధి, విదేశీ రుణాలు తీర్చేందుకు గడువు కావాలని శ్రీలంక కోరింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పులను తీర్చే స్థితిలో లేదని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దుకునే పనుల్లో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపింది.

  18. తిరుమలలో విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తొక్కిసలాటలో ముగ్గురికి గాయాలు

    తిరుమల

    తిరుమలలో అధిక రద్దీ కారణంగా నాలుగు రోజులు విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. బ్రేక్ దర్శనాలను బుధవారం నుంచి ఆదివారం వరకు రద్దు చేసింది.

    ఎటువంటి దర్శన టోకెన్లు లేకుండా తిరుమలకు వెళితే ఉచిత దర్శనం చేసుకోవచ్చని తెలిపింది.

    సర్వదర్శనం టోకెన్ల జారీ దగ్గర జరిగిన తోపులాటతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

    వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలోకి టోకెన్ ఉన్న భక్తులను అనుమతిస్తున్నారు. మరో రెండు గంటల తర్వాత టోకెన్ లేని భక్తులును కూడా అనుమతిస్తారని తెలిపారు.

    ఆఫ్‌లైన్ విధానంలో సర్వదర్శన టోకెన్ల జారీ ప్రకియని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతానికి టోకెన్లు లేకుండానే భక్తులను తిరుమలకు అనుమతిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

    గోవిందరాజస్వామి సత్రాల వద్ద తోపులాటలో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  19. యుక్రెయిన్: నిరాశ్రయులైన 48 లక్షల మంది చిన్నారులు.

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, GETT

    రష్యా యుక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి యుక్రెయిన్‌లో మూడొంతుల మంది పిల్లలు ఇళ్ళు వదిలిపెట్టి వెళ్లినట్లుయూనిసెఫ్ చెప్పింది. యుక్రెయిన్‌లో యుద్ధం మొదలై ఆరు వారాలు అవుతోంది.

    142 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు యూనిసెఫ్ ధృవీకరించింది. అయితే, మరణించిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరించింది.

    ఇంత తక్కువ సమయంలో యుక్రెయిన్‌లో ఉన్న 75లక్షల మంది పిల్లల్లో 48 లక్షల మంది నిరాశ్రయులయ్యారని యూనిసెఫ్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ మాన్యుయెల్ ఫోన్టైన్ చెప్పారు. తన 31 ఏళ్ల ఉద్యోగ అనుభవంలో ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువమంది నిరాశ్రయులవ్వడం ఎక్కడా చూడలేదని అన్నారు.

    "ఇళ్లల్లో ఉన్న 32లక్షల మందిలో సగం మందికి తగినంత ఆహారం అందుతూ ఉండకపోవచ్చు" అని ఆయన సెక్యూరిటీ కౌన్సిల్‌కు చెప్పారు.

    మరియుపూల్, ఖేర్సన్ లాంటి నగరాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉండి ఉండవచ్చని అన్నారు. మంచి నీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు లేవని చెప్పారు. ఆహార, ఔషధ సరఫరాలకు అంతరాయం కలుగుతున్నట్లు చెప్పారు.

    రష్యా 121,000 మంది పిల్లలను యుక్రెయిన్ నుంచి బయటకు తరలించిందని ఐక్యరాజ్య సమితికి యుక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లిట్స్యా ఆరోపించారు.

    అయితే, ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని ఫోన్టైన్ అన్నారు. ఈ ఆరోపణలను యూనిసెఫ్ విచారిస్తుందని తెలిపారు.

  20. పశ్చిమ బెంగాల్: అసన్‌సోల్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికలో హింసాత్మక ఘటనలు

    పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక జరుగుతుండగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

    ఈ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా అగ్నిమిత్ర పాల్ పోటీ చేస్తున్నారు.

    “టీఎంసి పార్టీ సభ్యులు మా కాన్వాయ్ పై దాడి చేసి, రాళ్లు రువ్వారు. పోలీసులు చూస్తూ ఊరుకున్నారు" అని ఆమె అన్నారు.

    “మా సెక్యూరిటీ పై వెదురు కర్రలు విసిరారు.మమత బెనర్జీ ఎంత ప్రయత్నించినప్పటికీ, ఇక్కడ గెలిచేది మేమే" అని అగ్నిమిత్ర అన్నారు.

    అగ్నిమిత్ర పాల్

    ఫొటో సోర్స్, ANI