తెలంగాణలోని వరంగల్ జిల్లా స్థంభంపల్లిలోనిటెస్కోగోదాంలో సోమవారం భారీఅగ్నిప్రమాదం జరిగింది.టెస్కో చేనేత
కార్మికుల ఉత్పత్తులను అమ్మే ప్రభుత్వ సంస్థ.
మొత్తం 6 ఫైర్ ఇంజన్లు గోడౌన్లో మంటలను అదుపుచేసే
పనిలో ఉన్నాయి, మధ్యాహ్నం వరకు మంటలు అదుపులో రావొచ్చు
అని వరంగల్ ఫైర్ ఆఫీసర్భగవాన్ రెడ్డి తెలిపారు.
ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని, విచారణ
కొనసాగుతోందని ఆయన మీడియారు తెలిపారు. చేనేత అధికారులు అందించిన ప్రాథమిక సమాచారం మేరకు
ప్రమాదంలో సుమారు 30 కోట్లవిలువైన వస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి.
ఎక్కువగా నూలుతో చేసిన వస్త్రాలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక
అధాకారులు తెలిపారు.
చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. వరంగల్,హన్మకొండ, వర్ధన్నపేట, పరకాల్ లకు చెందిన 40 మంది
ఫైర్ సిబ్బందిఫైర్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు.
ఉమ్మడి వరంగల్ పరిధిలోని చేనేత సహకార సంఘాల్లో ఉత్పత్తైన దుప్పట్లు, స్కూల్ యూనిఫామ్స్, తివాచీలు, బెడ్ షీట్స్ ల నిల్వ కోసం 2019 నుండి
ప్రస్తుతం ప్రమాదం జరిగిన గోడౌన్ ను టెస్కో నిర్వహిస్తోంది. ఇందులో సరైన అగ్నిప్రమాద
నివారణ సదుపాయాలు లేవన్న ఆరోపణలు ఉన్నాయి.
చేనేత శాఖ అధికారుల పిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ప్రమాదం పై ఎఫ్ఐఆర్
బుక్ చేసారు.
‘’ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇప్పటికీ
తేలలేదు. ఇది తాత్కాళిక గోడౌన్. ఇందులో నీటిని నిల్వ ఉంచే సంప్ నిర్మాణం లేదు. ప్రమాదంపై
ఉన్నతాధికారులకు సమాచారం అందించాం. అధిక ఉష్ణోగ్రతలు ఒక కారణం అవ్వొచ్చని భావిస్తున్నాం.
గోడౌన్లో మొత్తం 27 కోట్ల
విలువచేసే సరుకు ఉంది . అంతా మంటల్లో కాలిపోయింది’’ అనిటెస్కోవరంగల్ డివిజనల్ మార్కేటింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.