‘రష్యాపై భారీ యుద్ధానికి యుక్రెయిన్ సిద్ధంగా ఉంది’

యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరిగే కంటే ముందే తూర్పున దోన్బస్ ప్రాంతంలోని రష్యా దళాలపై కచ్చితంగా గెలుపొందాలని ఆయన అన్నారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. షాబాజ్ షరీఫ్: పాకిస్తాన్ ప్రధాని పీఠం వరకూ ఎలా వచ్చారు?

  2. బైడెన్‌తో మోదీ వర్చువల్ సమావేశం: యుక్రెయిన్ యుద్ధం గురించి ఏమన్నారంటే...

  3. బ్రిడ్జ్‌ని దొంగలు ఎత్తుకుపోయారు

  4. యుక్రెయిన్ నుంచి 45 లక్షలకు పైగా ప్రజలు శరణార్థులుగా వెళ్లిపోయారు

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకు 45 లక్షలకు పైగా ప్రజలు శరణార్థులుగా యుక్రెయిన్ నుంచి వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ (యూఎన్‌హెచ్‌సీఆర్) తెలిపింది.

    ఆదివారం నాటికి మొత్తం శరణార్థుల సంఖ్య 45,03,954 అని ప్రకటించింది.

    ఇందులో 90 శాతం మంది మహిళలు, చిన్నారులే అని తెలిపింది. 18-60 మధ్య వయస్సు ఉన్న పురుషులు దేశం దాటేందుకు యుక్రెయిన్‌లో అనుమతి లేదు.

    ఇవి ఇప్పటివరకూ ఉన్న ముఖ్యాంశాలు. నేటి లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

  5. పాకిస్తాన్ ప్రధాని రేసులో ఉన్న షాబాజ్ షరీఫ్ ఎవరు... ఆయన రాజకీయ ప్రస్థానం ఎలాంటిది?

  6. కావలి యూట్యూబర్ నాగలక్ష్మికి అంత ఫేమ్ ఎలా వచ్చింది?

  7. కీయెవ్ రీజియన్‌లో 1200 పైగా మృతదేహాలు లభ్యం

    కీయెవ్ నుంచి రష్యా దళాలు వెనక్కి వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో 1,222 మృతదేహాలు లభించాయని యుక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పారు.

    ‘‘యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా బలగాలు పాల్పడిన యుద్ధనేరాలకు సంబంధించిన 5,600 కేసులపై యుక్రెయిన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 500లకు పైగా అనుమానిత యుద్ధ నేరస్థులను గుర్తించాం. ఇందులో రష్యా ప్రభుత్వానికి, మిలిటరీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నారు’’ అని స్కై న్యూస్‌తో ఇరినా వెనెడిక్టోవా చెప్పారు.

    ‘‘యుక్రెయిన్‌లోని అన్ని ప్రాంతాల్లో యుద్ధ నేరాలే కనబడుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి మేం చేయాల్సిందంతా చేస్తాం’’ అని ఆమె అన్నారు.

    క్రమటోర్క్స్ నగరంలోని రైల్వే స్టేషన్‌పై రష్యా మిసైల్ దాడికి సంబంధించిన రుజువులు తమ వద్ద ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ దాడిలో 50కి పైగా మరణించారు.

    అయితే, రైల్వే స్టేషన్‌పై దాడిని రష్యా ఖండించింది. ఆ మిసైల్ తమది కాదని, పౌరులు తమ లక్ష్యం కాదని రష్యా వాదించింది.

  8. ఢిల్లీపై 44 పరుగులతో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలుపు

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలుపొందింది.

    టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి శుభారంభం దక్కింది. ఓపెనర్లు పృథ్వీ షా (29 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (45 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగారు.

    దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శార్దుల్ ఠాకూర్ (29 నాటౌట్: 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు.

    ప్రత్యర్థి బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు పడగొట్టారు. ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్ తలా ఓ వికెట్ తీశారు.

    అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ 19.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించారు.

    కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగగా, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లతో ఆకట్టుకున్నారు. శార్దుల్ ఠాకూర్‌కు 2 వికెట్లు దక్కాయి. లలిత్ యాదవ్ ఒక వికెట్ తీశారు.

    కుల్దీప్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. 'అతడు' తప్పిపోయిన కుమారుడినంటూ 41 ఏళ్లు ఓ కుటుంబాన్ని మోసం చేశాడు, ఆస్తులన్నీ అమ్మేశాడు

  10. ‘రష్యాతొ భారీ యుద్ధానికి యుక్రెయిన్ సిద్ధంగా ఉంది’

    రష్యాపై భారీ యుద్ధానికి యుక్రెయిన్ సిద్ధంగా ఉందని యుక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మిఖాయిలో పెడోలిక్ ఒక జాతీయ టెలివిజన్‌తో అన్నారు.

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరిగే కంటే ముందే తూర్పున దోన్బస్ ప్రాంతంలోని రష్యా దళాలపై కచ్చితంగా గెలుపొందాలని ఆయన అన్నారు. ఇలా జరిగితే మరింత శక్తిమంతంగా చర్చించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

    ‘‘భారీ యుద్ధాలకు యుక్రెయిన్ సిద్ధంగా ఉంది. యుక్రెయిన్ తప్పకుండా నెగ్గాలి. దోన్బస్‌పై యుక్రెయిన్‌దే పైచేయి కావాలి. అదే జరిగితే చర్చల సందర్భంగా యుక్రెయిన్ మరింత శక్తిమంతమైన స్థానంలో ఉంటుంది’’ అని ఇంటర్‌ఫాక్స్ న్యూస్ ఏజెన్సీతో ఆయన అన్నారు.

    ‘‘దీని తర్వాత ఇరు దేశాల అధ్యక్షులు కలుస్తారు. ఇదంతా జరగడానికి ఇంకా రెండు, మూడు వారాలు పట్టొచ్చు’’ అని చెప్పారు.

    యుక్రెయిన్
  11. 'నేను చూస్తుండగానే బాంబు పేలుడుకు నా కూతురు తల ఎగిరిపోయింది'

  12. కర్ణాటక బిట్ కాయిన్ కేసులో ఎఫ్‌బీఐ విచారణ గురించి సీబీఐ ఏం చెప్పిందంటే...

    బిట్ కాయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    కర్ణాటక బిట్‌కాయిన్ కేసును విచారించడానికి అమెరికా ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఎఫ్‌బీఐ, ఒక టీమ్‌ను కర్ణాటకకు పంపించిందని వచ్చిన నివేదికలను సీబీఐ ఖండించింది.

    ‘‘ఎఫ్‌బీఐ ఎలాంటి టీమ్‌ను ఇక్కడకు పంపించలేదు. ఒక టీమ్‌ను పంపించాలని సీబీఐ కూడా వారిని కోరలేదు. కాబట్టి ఎఫ్‌బీఐ టీమ్ ఈ కేసును దర్యాప్తు చేస్తుందనడానికి లేదు’’ అని ఒక ప్రకటనలో తెలిపింది.

    సీబీఐ, భారత్‌లోని నేషనల్ సెంట్రల్ బ్యూరో (ఇంటర్‌పోల్)తో పాటు అనేక ఇంటర్నేషనల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుంది.

  13. రష్యా మిసైల్ దాడిలో పూర్తిగా ధ్వంసమైన నిప్రో విమానాశ్రయం

    యుక్రెయిన్ తూర్పు నగరమైన నిప్రోలోని విమానాశ్రయంతో పాటు అక్కడి ఒక గ్రామంపై రష్యా క్షిపణి దాడులు జరిగాయని ఆ ప్రాంతానికి చెందిన మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ వాలెంటిన్ రెజ్నిచెంకో చెప్పారు.

    ‘‘నిప్రో ఎయిర్‌పోర్ట్‌పై మరో దాడి జరిగింది. అది పూర్తిగా సర్వనాశనమైంది. ఎయిర్‌పోర్ట్‌తో పాటు దాని పరిసరాల్లోని ఇన్‌ఫాస్ట్రక్చర్ అంతా ధ్వంసమైంది. ఇంకా క్షిపణులు ఎగురుతూనే ఉన్నాయి’’ అని వాలెంటిన్ తెలిపారు.

    జోనెత్క్స్‌లోని ఒక మౌలిక సదుపాయాల కేంద్రంపై దాడి జరిగిందనీ అందులో జరిగిన ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.

    నిప్రో విమానాశ్రయం
  14. ఇంటర్నెట్‌లో సీక్రెట్ పేజీలు.... చేసిన తప్పులు, వ్యక్తిగత రహస్యాలు చెప్పుకునే కొత్త మార్గాలు

  15. పాకిస్తాన్‌లో నేటి నుంచి మరో స్వాతంత్ర్య పోరాటం: ఇమ్రాన్ ఖాన్

    పాకిస్తాన్‌లో ‘అధికారాన్ని మార్చే విదేశీ కుట్ర’కు వ్యతిరేకంగా ఆదివారం నుంచి మరో స్వాతంత్ర్య పోరాటం ప్రారంభం అయిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

    ‘‘పాకిస్తాన్ 1947లో స్వాతంత్ర్యాన్ని పొందింది. కానీ, అధికారాన్ని మార్చే విదేశీ కుట్రకు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ మరో స్వాతంత్ర్య పోరాటం ప్రారంభం అయింది. పాకిస్తాన్ ప్రజలు ఎల్లప్పుడూ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారు’’ అని ఆయన ట్వీట్‌లో రాశారు.

    పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోయారు. ఆదివారం జరిగిన ఓటింగ్‌లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 174 మంది ఓటు వేశారు. దీంతో ఆయన పదవీచ్యుతులు అయ్యారు.

    సోమవారం పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. ఆంధ్రప్రదేశ్: 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్

    ఆంధ్రప్రదేశ్ మంత్రుల రాజీనామాను గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆమోదించారు.

    మొత్తం 24 మంది మంత్రుల రాజీనామాకు ఆమోదం తెలిపిన ఆయన తదుపరి మంత్రివర్గం ఏర్పడేంతవరకు ఈ శాఖలన్నీ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటాయని తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల జాబితా ఇదే...

    బొత్స సత్యనారాయణ

    ఫొటో సోర్స్, ANI

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్త మంత్రివర్గానికి సంబంధించిన తుది జాబితాను సిద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత మూడు రోజులుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు.

    ఈ జాబితా ఖరారైంది. అనధికారికంగా విడుదలైంది. అయితే, ఇంకా అధికారికంగా జాబితాను విడుదల చేయలేదదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారికి ఇప్పటికే ఫోన్ చేసి సమాచారాన్ని తెలిపినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

    సోమవారం ఉదయం 11.31 గంటలకు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వారి ఈ తుది జాబితా ఇదే.

  18. సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీగా మళ్లీ ఎన్నికైన సీతారాం ఏచూరి

    సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి

    ఫొటో సోర్స్, Facebook/Sitaram Yechury

    సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీగా వరుసగా మూడో సారి సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు.

    2015 నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్)కు ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు.

    గతంలో ఆయన రాజ్యసభ సభ్యునిగా కూడా చేశారు.

  19. తెలంగాణ ధాన్యం కొనుగోలు: రా రైస్, బాయిల్డ్ రైస్ మధ్య తేడా ఏంటి?

    బాయిల్డ్ రైస్ అయినా.. కేంద్రం కొనాల్సిందే అని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. కానీ రా రైస్ మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం అంటోంది. ఇంతకీ ఏమిటీ వివాదం? రా, బాయిల్డ్ రైస్‌ల మధ్య తేడా ఏంటి?

  20. తామర పురుగు: ఏపీ, తెలంగాణల్లో మిర్చి పంటకు పట్టిన ఈ తెగులు దేశంలో అనేక పంటలను నాశనం చేయబోతోందా?