ఇవాళ్టి ముఖ్యాంశాల్లో కొన్ని...
జాతిని ఉద్దేశించి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. తనను పదవి నుంచి తొలగించాలని ఒక దేశం నుంచి పాకిస్తాన్‌కు సందేశం వచ్చిందని ఆయన చెప్పారు. మరోవైపు చివరి వరకు పోరాడతానని ఆయన అన్నారు.
ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయబోననే సంకేతాలు ఇచ్చారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
మిత్రభావంతో మెలగని దేశాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.
గ్యాస్‌ను కొనుగోలు చేయాలనుకునే దేశాలు రష్యా కరెన్సీలో లావాదేవీలు నిర్వహించాలని, రష్యన్ బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని పుతిన్ చెప్పారు.
పుతిన్ డిమాండ్లను పరిశీలిస్తామని జర్మనీ తెలిపింది. అయితే, చమురు దిగుమతులపై ఎవరి ఒత్తిడికీ తలొగ్గబోమని స్పష్టం చేసింది.
మరియుపూల్‌లో జరుగుతున్న యుద్ధంలో చిక్కుకున్న పౌరులను రక్షించేందుకు యుక్రెయిన్ ప్రభుత్వం తాజాగా రెండు బస్సులను పంపించింది.
తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీచూడండి. ధన్యవాదాలు.