యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. యుక్రెయిన్ గగనతలంపై నో ఫ్లై జోన్ ప్రకటించాలని, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆహారం కోసం క్యూలో నిల్చున్న 10 మందిని రష్యా సైనికులు కాల్చి చంపేశారని కీయెవ్‌లోని అమెరికా ఎంబసీ వెల్లడించింది.
జపాన్ ఈశాన్య ప్రాంతంలో బుధవారం రాత్రి శక్తివంతమైన భూకంపం సంభవించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మహిళా క్రికెట్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో టీం ఇండియా ఓడిపోయింది.
యుక్రెయిన్, రష్యా తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని చూడండి.
ఆసక్తికర కథనాల కోసం బీబీసీ తెలుగు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.