నో ఫ్లై జోన్ ప్రకటించండి, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించండి - అమెరికాకు జెలియెన్‌స్కీ విజ్ఞప్తి
రష్యా, యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి చర్చల మీద చాలా పాజిటివ్‌గా స్పందించారు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ. మరొకవైపు యుక్రెయిన్ రాజధాని కీయెవ్ మీద రష్యా దాడులు పెంచింది.
లైవ్ కవరేజీ
సతీష్ ఊరుగొండ, వరికూటి రామకృష్ణ
యుక్రెయిన్
అధ్యక్షుడు జెలియెన్‌స్కీ అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి వర్చువల్‌గా
మాట్లాడారు. యుక్రెయిన్ గగనతలంపై నో ఫ్లై జోన్ ప్రకటించాలని, రష్యాపై
మరిన్ని ఆంక్షలు విధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆహారం కోసం క్యూలో
నిల్చున్న 10 మందిని రష్యా సైనికులు కాల్చి చంపేశారని కీయెవ్‌లోని అమెరికా ఎంబసీ
వెల్లడించింది.
జపాన్ ఈశాన్య ప్రాంతంలో బుధవారం రాత్రి శక్తివంతమైన భూకంపం సంభవించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
చేశారు.
మహిళా క్రికెట్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో టీం ఇండియా
ఓడిపోయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
అయితే, ఓటమిని సమీక్షించేందుకు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ నేతలంతా సోనియా గాంధీ నాయకురాలిగా కొనసాగాలని విజ్ఞప్తి చేశారు.
వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం ఐదు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజీనామా చేయాలని సోనియా సూచించారు. యూపీ, ఉత్తరాఖండ్‌ల కాంగ్రెస్ అధ్యక్షులు మంగళవారం రాజీనామా చేయగా, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ బుధవారం రాజీనామా చేశారు.
బ్రేకింగ్ న్యూస్, అమెరికా కాంగ్రెస్‌లో జెలియెన్‌స్కీ వర్చువల్ ప్రసంగం
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ అమెరికా కాంగ్రెస్‌ను
ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు.
వెనక్కి తగ్గాలన్న ఆలోచన తమకు అస్సలు రాలేదని ఆయన స్పష్టం
చేశారు.
రష్యాతో పోరాటానికి అమెరికా చేస్తున్న సాయానికి
జెలియెన్‌స్కీ ధన్యవాదాలు చెప్పారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని కోరారు.
యుక్రెయిన్ గగనతలంపై నో ఫ్లై జోన్ విధించాలని జెలియెన్‌స్కీ
మరోసారి విజ్ఞప్తి చేశారు.
ఆదాయం కంటే శాంతి చాలా ముఖ్యమని చెప్పారు.
బ్రేకింగ్ న్యూస్, 'ఆహారం కోసం క్యూలో నిల్చున్న 10 మందిని రష్యా సైనికులు కాల్చి చంపేశారు'
యుక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లో ఆహారం కోసం క్యూ
లైన్లో నిల్చున్న 10 మందిని రష్యా సైన్యం కాల్చి చంపిందని కీయెవ్‌లోని అమెరికా ఎంబసీ
ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఇలాంటి దారుణమైన ఘటనలు ఆపేయాలని విజ్ఞప్తి చేసింది.
రష్యా దాడి మొదలుపెట్టిన తర్వాత ఖార్కియెవ్‌లో 500 మంది పౌరులు చనిపోయారు-యుక్రెయిన్
ఫొటో సోర్స్, Reuters
ఫిబ్రవరి 24న రష్యా యుక్రెయిన్‌పై దాడులు మొదలుపెట్టినప్పటి
నుంచి ఖార్కియెవ్ నగరంలో 500 మంది పౌరులు చనిపోయారని యుక్రెయిన్ అధికారులు
చెప్పారు.
ఈ మరణాల సంఖ్యను బీబీసీ స్వయంగా వెరిఫై చేయలేదు.
ఖార్కియెవ్ యుక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం. కొన్ని
వారాలుగా అక్కడ రష్యా భీకరంగా దాడులు చేస్తోంది.
యుక్రెయిన్‌లో ఇప్పటి వరకు 691 మంది పౌరులు చనిపోయారని,
మరో 1143 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల వాచ్‌డాగ్ అంచనా వేసింది.
రష్యా దాడి కారణంగా ఇప్పటివరకు 20 లక్షలకు పైగా ప్రజలు యుక్రెయిన్‌ను వదిలి వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. పొరుగు దేశమైన పోలాండ్‌కు అత్యధికంగా 15 లక్షల మంది శరణార్థులుగా వెళ్లారు.
సరిహద్దుల వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలాండ్ ఉద్యోగులకు వివిధ దేశాల నుంచి ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్లినవారు సహాయపడుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
గడిచిన కొన్నిరోజుల్లో 'ఆపరేషన్ గంగ' కార్యక్రమం కింద యుక్రెయిన్‌లో చిక్కుకున్న చాలామంది భారతీయును స్వదేశానికి తీసుకొచ్చారు. అయినప్పటికీ భారతీయుల్లో చాలామంది యుక్రెయిన్ నుంచి సరిహద్దులకు తరలివస్తోన్న శరణార్థుల కోసం స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
నా కొడుకుని వెనక్కు తీసుకురావాలంటే నేనెవరి తలుపు తట్టాలి?, రష్యా సైనికుడి తల్లి ఆవేదన
ఫొటో సోర్స్, Getty Images
''మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు'' - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్న సైనికుల తల్లులను ఉద్దేశించి అన్న మాట ఇది.
కానీ.. కొందరు తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, భార్యలు, ప్రియురాళ్లు.. యుక్రెయిన్ వెళ్లిన రష్యా సైన్యంలోని తమ ఆప్తుల కోసం తల్లడిల్లుతున్నారు. ఆ సైనికుల్లో చాలా మందికి తాము యుక్రెయిన్ ఎందుకు వెళుతున్నామో కూడా తెలియదని వీరు చెప్తున్నారు.
మరీనా తన మనుమడి నుంచి కబురు అంది వారం రోజులకు పైగా దాటిపోయాక.. ఆమె అందరికీ ఫోన్ చేయటం మొదలుపెట్టింది.
'నేను బెలారుస్-యుక్రెయిన్ సరిహద్దులో ఉన్నాను. త్వరలో ఇంటికి వస్తాను' అని అతడి నుంచి అందిన చివరి సందేశం. ఆ తర్వాతి నుంచీ ఎలాంటి కబురూ, సమాచారం లేదు. దీంతో ఏం ఘోరం జరిగిందోనని ఆమె భయపడుతోంది.
''అతడి మిలటరీ యూనిట్‌కు ఫోన్ చేశాను. అతడు రష్యా నుంచి బయటకు వెళ్లలేదని వాళ్లు చెప్పారు. 'జోక్ చేస్తున్నారా? అతడు బెలారుస్ నుంచి నాతో మాట్లాడాడు. మీ సైనికులు ఎక్కడున్నారో మీకు తెలీదా?' అని అడిగాను. వాళ్లు ఫోన్ పెట్టేశారు. అప్పటి నుంచీ నాతో మాట్లాడటం లేదు'' అని వివరించారు మరీనా.పూర్తి వివరాలు ఈ కథనంలో
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఫొటో సోర్స్, Getty Images
నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1039 పాయింట్లు పెరిగి 56,816 వద్ద క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 312 పాయింట్లు పెరిగి 16,975 వద్ద ముగిసింది.
బ్యాంక్, ఆటో, మెటల్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాలు బాగా రాణించాయి. మెటల్ రంగం సుమారు 3శాతం పెరిగింది.
నిఫ్టీలో భాగా లాభ పడ్డ షేర్లలో అల్ట్రాటెక్ సిమెంట్ అగ్రస్థానంలో నిలిచింది. రూ.284.65 (4.73%) పెరిగి రూ.6,305 వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్ (3.68%), ఇండస్‌ఇండ్ బ్యాంక్ (3.57%), శ్రీ సిమెంట్స్ (3.49%) ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
కొద్ది రోజులుగా భారీగా నష్టపోతూ వచ్చిన పేటీఎం షేరు ఇవాళ బాగా పెరిగింది. సుమారు 7శాతం పెరిగి రూ.634.80 వద్ద క్లోజ్ అయింది.
గత సెషన్లో బాగా నష్టపోయిన ఆసియా మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడ్ కావడం సెన్సెక్స్, నిఫ్టీలకు కలిసొచ్చింది. షాంఘై కాంపోజిట్ 3.48శాతం, హాంగ్ సెంగ్ 9శాతం వరకు పెరిగాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వు ఈ రోజు రాత్రి వడ్డీ రేట్ల మీద నిర్ణయం తీసుకోనుంది. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచొచ్చని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే 2018 తరువాత ఇదే తొలి పెంపు అవుతుంది.
అఖిలేశ్ యాదవ్: ‘లఖీంపుర్ ఖేరీ ఫైల్స్’ తీయాల్సిన సమయం వచ్చింది
ఫొటో సోర్స్, ANI
కశ్మీర్ పండితుల మీద తీసిన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా మాదిరిగానే లఖీంపుర్ ఖేరీ రైతుల మరణాలపై సినిమా తీయాలని కోరుకుంటున్నట్లు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు.
రైతులను జీపుతో తొక్కించి చంపిన ఘటన మీద ‘లఖీంపుర్ ఖేరీ ఫైల్స్’ తీయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చారు.
రష్యా విదేశాంగ మంత్రి: చర్చలు కష్టంగానే ఉన్నాయ్ కానీ రాజీ కుదురుతుందనే ఆశిస్తున్నా
ఫొటో సోర్స్, EPA
యుక్రెయిన్‌తో శాంతి చర్చల్లో ఫలితం అంత సులభంగా తేలేది కాదని, అయినా రాజీ కుదురుతుందనే ఆశతో ఉన్నట్లు రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు.
ఆర్‌బీసీ న్యూస్‌తో మాట్లాడిన ఆయన, అనేక కారణాల వల్ల యుక్రెయిన్‌తో చర్చలు అంత సులభంగా జరగడం లేదని తెలిపారు.
యుక్రెయిన్ నేటోలో చేరడం, డీమిలిటరైజేషన్ మాత్రమే సమస్యలు కాదని తూర్పు యుక్రెయిన్‌లోని ప్రజల భద్రత కూడా మరొక ప్రధాన సమస్యని ఆయన అన్నారు.
‘యుక్రెయిన్‌తో యుద్ధంలో చనిపోయిన మరొక రష్యా జనరల్’
యుద్ధంలో మరొక రష్యా సైనిక జనరల్ చనిపోయినట్లు యుక్రెయిన్ ప్రకటించింది. మరియూపూల్‌కు శివార్లలో జరుగుతున్న పోరాటంలో యుక్రెయిన్ బలగాల చేతిలో రష్యాకు చెందిన మేజర్ జనరల్ ఒలెగ్ మిత్యాయేవ్ చనిపోయినట్లు యుక్రెయిన్ హోంశాఖ తెలిపింది.
దీంతో తమ చేతుల్లో చనిపోయిన రష్యా సైనిక జనరల్స్ సంఖ్య నాలుగుకు చేరినట్లు వెల్లడించింది. అయితే ఇందులో వాస్తవం ఎంతో బీబీసీకి తెలియలేదు.
రష్యా సైనిక జనరల్ చనిపోయారని వస్తున్న వార్తలపై మాస్కో ఇంకా స్పందించలేదు. రష్యాకు చెందిన సుమారు 20 మంది సైనిక జనరల్స్ యుక్రెయిన్‌లో ఉండి యుద్దాన్ని నడుపుతున్నట్లుగా భావిస్తున్నారు.
యుక్రెయిన్ ఆర్మీ: రష్యా సేనలను గట్టిగా తిప్పికొడుతున్నాం
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, రష్యా దాడుల్లో ధ్వంసమైన ఖార్కివ్‌లోని భవనం
రష్యాతో శాంతి చర్చల మీద యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ఆశావాహంగా ఉండగా మరొకవైపు యుక్రెయిన్ రాజధాని కీయెవ్ మీద రష్యా దాడులు పెంచింది. అయితే రష్యాతో యుద్ధంలో తమ బలగాలు చాలా గట్టిగా పోరాడుతున్నట్లు యుక్రెయిన్ చెబుతోంది. రష్యా యుద్ధ విమానాలను కూల్చడంతోపాటు మిసైల్స్‌ను ధ్వంసం చేస్తున్నట్లు యుక్రెయిన్ వైమానికదళం చెబుతోంది.
ముఖ్యాంశాలు:
హలో ఆల్, మీరు బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ
చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు
ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు ఉన్న ముఖ్యాంశాలను ఇక్కడ చూడొచ్చు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత
భగవంత్ మాన్, పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు.
విమెన్ క్రికెట్ వరల్డ్ కప్‌లో
ఇంగ్లండ్ చేతిలో టీం ఇండియా ఓడి పోయింది.
నేడు స్టాక్ మార్కెట్లు
లాభాల్లో ట్రేడవుతున్నాయి.
రష్యాతో శాంతి చర్చలు
సరైన దిశలో జరుగుతున్నట్లు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలియన్‌స్కీ ప్రకటించారు.
యుక్రెయిన్ రాజధాని
కీయెవ్ లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న భగవంత్ మాన్
ఫొటో సోర్స్, AAP/Twitter
ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ కాసేపట్లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగానే ముఖ్యమంత్రి
అభ్యర్థిగా మాన్ పేరును ఆమ్ఆద్మీ పార్టీ ప్రకటించింది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో 92 సీట్లు గెలుచుకుంది.
ఒక
కమెడియన్‌గా,
రాజకీయ నాయకుడిగా భగవంత్ మాన్‌కు ప్రజల్లో గుర్తింపు ఉంది. పంజాబ్‌లోని
సంగ్రూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ధూరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన ఆప్‌కు స్టార్ క్యాంపెయినర్‌గా
కొనసాగుతున్నారు. ఆ పార్టీకి ఆయనే అతిపెద్ద బలం, బలహీనత
కూడా.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా ఓడిపోయింది. భారత్ విధించిన 135 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ సులభంగా చేధించింది. 31.2 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 136 పరుగులు తీసింది ఇంగ్లండ్. హీతర్ నైట్ 72 బాల్స్‌కు 53 పరుగులు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్ బౌలర్లు బాగానే బౌలింగ్ చేసినా టార్గెట్ చిన్నది కావడంతో ఇంగ్లండ్‌ను ఆపలేక పోయారు. మేఘనా సింగ్ 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 134 పరుగులకే ఆలవుట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్ ప్లేయర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు.
ఓటమి అంచున టీం ఇండియా
ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా ఓడిపోయే దశకు చేరుకుంది. భారత్ విధించిన 135 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ తేలికగా చేధిస్తోంది. 30 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది ఇంగ్లండ్. మరొక 5 పరుగులు చేస్తే ఇంగ్లండ్ గెలుస్తుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 134 పరుగులకే ఆలవుట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్ ప్లేయర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు.
లాభాల్లో ట్రేడవుతున్న పేటీఎం
నేడు కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 234 పాయింట్లు పెరగ్గా, సెన్సెక్స్ 816 పాయింట్లు పెరిగింది. వాహన, బ్యాంకు, ఐటీ, మెటల్, పవర్ రంగాలు 1-2శాతం లాభపడ్డాయి. ఇక టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బాగా యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి. కొత్త ఖాతాదారులను చేర్చుకోకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను ఆర్‌బీఐ తాత్కాలికంగా నిషేధించిన నేపథ్యంలో కొద్ది రోజులుగా నష్టపోతూ వచ్చిన పేటీఎం షేర్ ఇవాళ లాభాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం 4.14శాతం పెరిగి రూ.616.70 వద్ద ట్రేడ్ అవుతోంది.
కష్టాల్లో టీం ఇండియా
ఫొటో సోర్స్, Getty Images
న్యూజీలాండ్‌లో ఇంగ్లండ్‌తో టీం ఇండియా తలపడుతోంది. ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. ఇప్పటికి 15 ఓవర్లు అయిపోయాయి. ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకా 75 పరుగులు కొట్టాలి. మేఘనా సింగ్, జూలన్ గోస్వామి చెరో ఒక వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 134 పరుగులకు ఆలవుట్ అయింది.