యుక్రెయిన్-రష్యా యుద్ధం: గత కొన్ని గంటల్లో ఏం జరిగిందంటే..
యుక్రెయిన్‌లోని మరియుపూల్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ మళ్లీ ఆగిపోయింది. రష్యా నిరంతరం దాడులు చేస్తుంటే ప్రజలను తరలించడం అసాధ్యమని మరియుపూల్ సిటీ కౌన్సిల్ పేర్కొంది. శనివారం కూడా ఇలాంటి ప్రయత్నం విఫలమైంది.
కీయెవ్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇర్పిన్ పట్టణంపై రష్యా ఇవాళ కూడా దాడులు చేసింది. ఈ పట్టణంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇర్పిన్ నుంచి పారిపోతున్న ప్రజల్లో ముగ్గురు చనిపోయారని భావిస్తున్నారు. ప్రజలు వాడుతున్న ధ్వంసమైన బ్రిడ్జిపై రష్యా దాడి చేయడంతో వారు చనిపోయారని చెబుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
15 లక్షల మంది ప్రజలు యుక్రెయిన్ నుంచి ఇరుగుపొరుగునున్న దేశాలకు వెళ్లారని యూఎన్ పేర్కొంది.
రష్యాలోని పలు నగరాల్లో యుద్ధ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు చేపట్టిన సుమారు 2వేల మందిని అదుపులోకి తీసుకున్నారు.
మాస్కో డిమాండ్లు నెరవేరే వరకు యుక్రెయిన్‌పై సైనిక చర్య ఆపేది లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్. తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని చూడండి. ధన్యవాదాలు.

















