ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ- జనసేన కూటమి తమ మేనిఫెస్టోను విడుదల చేసింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ- జనసేన కూటమి తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ పాల్గొన్నారు.
ఈ కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న కొన్ని హామీలు..
ఈ హామీలతో పాటు ఇంకా అనేక రకాల హామీలను ఈ కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
తమ కోవిడ్-19 టీకాతో కొన్ని అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందని ఆస్ట్రాజెనికా సంస్థ అంగీకరించింది. దీనిపై బీబీసీ కార్టూన్ ఇది..


ఫొటో సోర్స్, ANI
అమేఠీ, రాయ్‌బరేలీల నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల పోటీపై నెలకొన్న సందిగ్ధతపై కేంద్ర హోం మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు అమిత్ షా స్పందించారు.
అస్సాంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు.
‘‘అసలు వారు ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో నాకు తెలియదు. కాన్ని ప్రస్తుతం నెలకొన్ని సందిగ్ధత చూస్తుంటే అసలు వారికి ఆత్మవిశ్వాసం లేనట్లు కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు.
‘‘ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాంటే, ఒకప్పటి వారి కంచుకోటల్లాంటి సీట్లను వదిలిపెట్టి, వారు పరుగులు తీస్తున్నారు’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో అమేఠీ, రాయ్‌బరేలీల స్థానాలకు నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు చివరి తేదీ మే 3.
అమేఠీలో ప్రస్తుతం బీజేపీ నుంచి స్మృతీ ఇరానీ బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీపై ఇక్కడి నుంచి ఆమె పోటీచేసి విజయం సాధించారు. రాయ్‌బరేలీ నుంచి గత ఎన్నికల్లో సోనియా గాంధీ విజయం సాధించారు.
అయితే, ప్రస్తుతం ఈ రెండు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ కూడా రాయ్‌బరేలీ నుంచి పోటీచేసే తమ అభ్యర్థి పేరును ప్రకటించలేదు.
ఈ రెండు సీట్లూ గాంధీ కుటుంబానికి కంచుకోటల్లా ఉండేవి. 2004 నుంచీ రాయ్‌బరేలీలో సోనియా గాంధీ గెలుస్తూ వస్తున్నారు. మరోవైపు అమేఠీ 2004 నుంచి అమేఠీ నుంచి రాహుల్ గెలుస్తూ వచ్చారు. అయితే, 2019లో ఆయన బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, ఆ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేశారు. ఆ సీటులో మాత్రం విజయం సాధించారు.

ఫొటో సోర్స్, ANI
ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ చేపట్టేందుకు వివిధ కంటింజెట్లు నారాయణపూర్‌లోని మాధ్ ప్రాంతానికి వెళ్లాయి. అక్కడే పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
‘‘ఇంకా ఎక్కువ మంది మావోయిస్టులు మరణించి ఉండొచ్చు. చాలా మందికి గాయాలైనట్లు ఆధారాలున్నాయి. భద్రతా బలగాలు సంఘటన స్థలం నుంచి తిరిగి వచ్చిన తర్వాత, పూర్తి పరిస్థితిని వివరించగలం’’ అని ఒక సీనియర్ పోలీసు అధికారి బీబీసీకి చెప్పారు.
ఈ నెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు చెప్పాయి. ఇది కాకుండా, మరో ఘటనలో 13 మంది మావోయిస్టులు చనిపోయారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని చూడండి.