ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
అమిత్ షా కు సంబంధించిన ఒక ఫేక్ వీడియో షేర్ చేశారనే ఆరోపణలపై విచారణ నిమిత్తం దిల్లీ పోలీసులు ఆయనకు ఈ సమన్లు అందించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, REUTERS
కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి రావాలని హమాస్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
ఇజ్రాయెల్ శాంతి ప్రతిపాదన ఉదారంగా ఉందని అమెరికా చెబుతోంది.
ఇజ్రాయెల్ ప్రతిపాదనతో తమకు ప్రత్యేకించి ఎటువంటి సమస్యా లేదని హమాస్ అధికారి ఒకరు తెలిపారు.
అయితే ఇజ్రాయెల్ ప్రతిపాదనకు అంగీకరిgచకపోవడానికి కారణం హమాస్ పూర్తిస్థాయి కాల్పుల విరమణకు పట్టుబట్టడమే.
గాజాలో యుద్ధానికి పూర్తిగా ముగింపు పలికి, శాశ్వత కాల్పుల విరమణతోపాటు, ఇజ్రాయెలీ దళాలను ఉపసంహరించుకోవాలని హమాస్ కోరుకుంటోంది.
అదే సమయంలో ఇజ్రాయెల్ కొంతకాలం కాల్పులకు విరామం ఇవ్వాలని ఒత్తిడి చేస్తోంది.
అయితే ఇరుపక్షాలు ‘అంతర్లీన శాంతి పునరుద్ధరణ ఒప్పందంపై’ ఆమోదయోగ్యమైన అంగీకారానికి వస్తారని భావిస్తున్నారు.
సోమవారం హమాస్ బృందమొకటి ఈజిప్ట్‌కు చేరుకుంది. ఈ బృందం శాంతి చర్చలకోసమే ఈజిప్ట్‌కు వచ్చిందా లేదా అనే విషయంపై ఇప్పటిదాకా స్పష్టత లేదు.
మరోపక్క యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గాజాలో శాంతి ఒప్పందానికి సంబంధించి సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అరబ్ నేతలతో చర్చలు జరిపారు.
ప్రతిపాదిత కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ అంగీకరిస్తుందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది.
గాజాలో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్‌పైనా అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెరుగుతోంది.
మరోపక్క హమాస్ చెరలోని ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయించాలని, బాధిత కుటుంబాలు ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇటీవల కాలంలో టెలి అవీవ్‌లో బందీల బంధువులు అనేక భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో రఫా ప్రాంతంలో దాడులకు ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య బందీల విడుదల, కాల్పుల విరమణకు సంబందించి ఒప్పందం కుదిరితే రఫాపై ఇజ్రాయెల్ దాడులు ఆగిపోవచ్చు.

ఫొటో సోర్స్, FACEBOOK/TELANGANA CMO
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు.
అమిత్ షా కు సంబంధించిన ఒక ఫేక్ వీడియో షేర్ చేశారనే ఆరోపణలపై విచారణ నిమిత్తం దిల్లీ పోలీసులు ఆయనకు ఈ సమన్లు అందించారు.
సమన్లను గాంధీభవన్‌లో అందించినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుని హోదాలో సమన్ల మీద రేవంత్ రెడ్డి పేరు రాసినట్టుగా తెలుస్తోంది.
బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని అమిత్ షా అన్నట్లుగా ఒక వీడియో వైరల్ అయింది.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు విస్తృతంగా ఆ వీడియోని వైరల్ చేశారు. అయితే అది ఫేక్ వీడియో అని బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఆ కేసు నిమిత్తం విచారణకు హాజరుకావాలని రేవంత్ రెడ్డికి నోటీసులు అందించారు దిల్లీ పోలీసులు.
మే ఒకటో తేదీన విచారణకి హాజరుకావాలని వారు సూచించారు. దీనిపై రేవంత్ ఇంకా స్పందించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధరంగంలో తమ పరిస్థితి ఏమాత్రం బాలేదని యుక్రెయిన్ ఆర్మీ చీఫ్ అంగీకరించారు.
తూర్పు సరిహద్దుల నుంచి యుక్రెయిన్ ఆర్మీ వెనక్కి రావాల్సి వచ్చిందని జనరల్ ఒలెస్కాండర్ సిరెస్కీ చెప్పారు.
అమెరికా నుంచి యుక్రెయిన్‌కు సైనిక సహకారం అందడానికి ముందే ఈ పరిస్థితి నుంచి ప్రయోజనం పొందేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.
‘‘సరిహద్దుల్లో పరిస్థితి చాలా దారుణంగా మారింది. తూర్పు దోన్యస్క్ ప్రాంతం నుంచి యుక్రెయిన్ ఆర్మీ వెనక్కి రావాల్సి వచ్చింది’’ అని టెలిగ్రామ్‌లో సిరిస్కీ పేర్కొన్నారు.
తూర్పు దోన్యస్క్ ఏరియాలోని ఒచెరెటైన్ సమీపంలోని ఒక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
యుక్రెయిన్‌కు రూ. 5 లక్షల కోట్ల (61 బిలియన్ డాలర్లు) విలువైన సైనిక సహకారాన్ని అందించే ప్రతిపాదనను గత వారం అమెరికా పార్లమెంట్ ఆమోదించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.