రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, చంద్రబాబు అభినందనలు
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయన ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
లైవ్ కవరేజీ
, లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు.
సీఎం రేవంత్ రెడ్డి తొలి కేబినెట్ భేటీలో ఏం చర్చించారంటే..
రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, చంద్రబాబు అభినందనలు

ఫొటో సోర్స్, ANI
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయన ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని హామీ ఇస్తున్నానని ప్రధాని మోదీ రాశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
తన పదవీ కాలంలో ప్రజాసేవలో రేవంత్ రెడ్డి విజయవంతంగా కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్వీట్) చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

ఫొటో సోర్స్, facebook/CMO ANDHRA PRADESH
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులకు జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సీఎం రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లు ఇవే.. ఎడిటర్స్ కామెంట్
తెలంగాణ ప్రగతి భవన్ ముందు కంచె తొలగింపు, అక్కడ ఏం జరుగుతోంది?
సీతక్క: బుల్లెట్ వదిలి బ్యాలెట్ పట్టి.. మంత్రి పదవి చేపట్టి..
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం
ఆరు గ్యారెంటీలపై రేవంత్ రెడ్డి తొలి సంతకం

ఫొటో సోర్స్, FB/revanthofficial
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలు ఫైల్‌పై తొలి సంతకం చేశారు.
‘అభయ హస్తం’ పథకానికి సంబంధించిన ఫైలుపై రేవంత్ రెడ్డి ఈ సంతకం చేశారు.
ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పిస్తూ రెండో ఫైల్‌పై సంతకం చేశారు.
ప్రమాణ స్వీకారం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో తొలి ప్రసంగం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదని, పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రమని, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రమని రేవంత్ రెడ్డి అన్నారు.
తాము పాలకులం కాదని, ప్రజా సేవకులమని చెప్పారు.
ప్రగతి భవన్‌లోకి వచ్చేందుకు ప్రజలకు అనుమతి ఉంటుందని, దాని చుట్టూ ఉన్న కంచెను బద్దలు కొడతామని అన్నారు.
ప్రగతి భవన్‌ను జ్యోతీరావు పూలే ప్రజా భవన్‌గా మారుస్తామన్నారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బారు నిర్వహిస్తామని రేవంత్ చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల ప్రమాణం

ఫొటో సోర్స్, @INCIndia
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
1.23 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు.
రేవంత్ రెడ్డి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క మల్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత..
1.ఉత్తమ్ కుమార్ రెడ్డి
2.దామోదర్ రాజనర్సింహ(ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు)
3.కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
4.దుద్దిళ్ల శ్రీధర్ బాబు
5.పొంగులేటి శ్రీనివాస రెడ్డి
6.పొన్నం ప్రభాకర్
7.కొండా సురేఖ
8.సీతక్క
9.తుమ్మల నాగేశ్వర రావు
10. జూపల్లి కృష్ణారావుల చేత గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు.

ఫొటో సోర్స్, @ANI
సోనియా గాంధీతో పాటు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ప్రజలకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తూ స్టేడియంలోకి వచ్చారు.
సోనియా గాంధీని రేవంత్ రెడ్డి స్వయంగా వేదికపైకి తీసుకొచ్చారు.
ఆ తర్వాత ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ స్టేడియంపైకి చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు.
తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంగా స్టేజీకి నామకరణం చేశారు.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. ప్రత్యక్ష ప్రసారం
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకార మహోత్సవం బీబీసీ తెలుగులో ప్రత్యక్ష ప్రసారం..
తెలంగాణ: కాసేపట్లో సీఎంగా రేవంత్ రెడ్డి, స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్, మరో 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

ఫొటో సోర్స్, Bhatti Vikramarka Mallu/FB
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డితోపాటు ఇవాళ 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేస్తారు. గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
కొత్త మంత్రుల జాబితాను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) విడుదల చేసింది.

ఫొటో సోర్స్, AICC
మిగిలిన మంత్రుల జాబితా..
ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు
వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ
కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు
నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మెదక్ నుంచి దామోదర్ రాజనర్సింహ
మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు

ఫొటో సోర్స్, Seethakka/Twitter
రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, TPCC/ CONGRESS
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ పెద్దలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా హైదరాబాద్‌కు చేరుకున్నారు.
హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ పెద్దలకు రేవంత్ రెడ్డి స్వయానా విమానశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్బీ స్టేడియాన్ని సర్వం సిద్ధం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమరవీరులు కుటుంబాలకూ ఆహ్వానాలు పంపారు. వారి కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు.
ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ నివేదించింది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, TPCC/ CONGRESS
గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, చంద్రబాబు అభినందనలు
