తెలంగాణ: సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం రేపు మధ్యాహ్నం

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో చిన్న మార్పు జరిగింది. మారిన షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 7 మధ్యాహ్నం 1:04 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు.

  2. ఒంట్లోని రోగాల గురించి చిగుళ్లు ఏం చెబుతాయి?

  3. ఉద్యోగానికి దరఖాస్తు చేసేటప్పుడు ‘ఎక్స్‌పెక్టెడ్ శాలరీ’ ఎలా అడగాలి? కంపెనీ ప్రతిపాదించే ‘శాలరీ రేంజ్’‌ను ఎలా అర్థం చేసుకోవాలి?

  4. రేవంత్ రెడ్డి ఎలా గెలిచారు, కేసీఆర్ ఎందుకు హ్యాట్రిక్ మిస్సయ్యారు?

  5. తెలంగాణ: రేవంత్ ప్రమాణ స్వీకార సమయంలో మార్పు

    రేవంత్ రెడ్డి

    ఫొటో సోర్స్, twitter/RahulGandhi

    రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో చిన్న మార్పు జరిగింది. తొలుత రేపు ఉదయం 10.28 గంటలకు నిర్వహించాలని భావించారు.

    కానీ, మారిన షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    ఇటు, ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

    సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అక్కడికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

    రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పెద్దలు రాబోతున్నారు. దిల్లీ వచ్చిన రేవంత్ రెడ్డి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    దిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి పార్లమెంటు వద్దకు చేరుకున్నప్పుడు పలువురు నేతలు ఆయన్ను కలుసుకుని అభినందనలు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  6. నిమిషా ప్రియ: భారత నర్సుకు యెమెన్‌లో మరణశిక్ష, బ్లడ్ మనీతో బయటపడగలరా?

  7. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిసిన రేవంత్ రెడ్డి

    సోనియా గాంధీని కలిసిన రేవంత్ రెడ్డి

    ఫొటో సోర్స్, @RahulGandhi

    తెలంగాణ కాంగ్రెస్‌కు సీఎల్పీ నేతగా ఎంపికైన రేవంత్ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు.

    దిల్లీలో ఖర్గే నివాసానికి వెళ్లిన రేవంత్ ఆయన్ను కలిశారు. ఖర్గేను కలవడానికి ముందు కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కూడా రేవంత్ భేటీ అయ్యారు.

    ఎల్బీ స్టేడియంలో రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి దిల్లీ వచ్చారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. చెట్లకూ వృద్ధాప్య పింఛన్, ఏ చెట్టుకు ఎంత ఇస్తారు, ఎలా తీసుకోవాలి....

  9. తెలంగాణ విజయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం ఎంత?

  10. దిల్లీలో రేవంత్ రెడ్డి, మంత్రివర్గ కూర్పుపై నేడు అధిష్టానంతో చర్చలు

    రేవంత్ రెడ్డి

    ఫొటో సోర్స్, FB / ANUMULA REVANTH REDDY

    తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆయన మంగళవారం రాత్రి దిల్లీకి చేరుకున్నారు.

    కాంగ్రెస్ పెద్దలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. రాత్రి 2 గంటల వరకు కర్ణాటక మంత్రి డీకే శివ కుమార్‌తో చర్చలు జరిపారు.

    బుధవారం నాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను రేవంత్ రెడ్డి కలవనున్నారు.

    రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ పెద్దలను రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అంతేకాక, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపించనున్నారు.

    మంత్రుల ఎంపికపై నేడు దిల్లీలో చర్చలు జరిగే అవకాశం ఉంది.

  11. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.