ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ సాయుధుడు ముగ్గురిని కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చేసుకున్నాడు. ఇది జాత్యహంకార దాడేనని నగర మేయర్ డోనా డీగన్ చెప్పారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన ల్యాండర్‌లోని ‘చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్’(ChaSTE ) పేలోడ్ అక్కడ సేకరించిన ఉష్ణోగ్రతల వివరాలను పంపింది.
ఆ వివరాలను ఇస్రో వెల్లడించింది.
చంద్రుడి ఉఫరితలంపైన, ఉపరితలం నుంచి కొన్ని సెంటీమీటర్ల లోతున ChaSTEనమోదు చేసిన ఉష్ణోగ్రతలను ఇస్రో గ్రాఫ్ రూపంలో వెల్లడించింది.
వాగ్నర్ చీఫ్ యెవ్‌గినీ ప్రిగోజిన్ చనిపోయినట్లు రష్యా ప్రభుత్వం ధ్రువీకరించింది.
బుధవారం జరిగిన విమాన ప్రమాదం ఘటనలో లభించిన మృతదేహాలకు జన్యుపర్యమైన పరీక్షల అనంతరం ఈ ధ్రువీకరణకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఆయనతోపాటు మరణించిన పది మందినీ గుర్తించినట్లు దర్యాప్తు చేపడుతున్న కమిటీ తెలిపింది.
మరోవైపు ఈ ప్రమాదానికి తామే కారణమన్న వార్తలను రష్యా ఖండించింది.
ఆస్ట్రేలియాలో యుద్ధ విన్యాసాలు చేస్తున్న అమెరికా మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది.
డార్విన్ కోస్టులో ఈ ప్రమాదం జరిగినట్లు స్కై న్యూస్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
ప్రమాదం జరిగే సమయంలో ఆ హెలికాప్టర్‌లో 20 అమెరికా నావికా దళ జవాన్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు గాయపడ్డారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి.
మెల్విలీ దీవి సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్కై న్యూస్ వెల్లడించింది.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ సాయుధుడు ముగ్గురిని కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చేసుకున్నాడు.
జాక్సన్‌విల్‌లోని డాలర్ జనరల్ స్టోర్‌లోకి ప్రవేశించి అతడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.
దాడి చేసిన వ్యక్తి తెల్లజాతీయుడని, అతడి వయసు 20లలో ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఈ దాడిలో ఇద్దరు మగవారు, ఒక మహిళ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరు ముగ్గురూ నల్లజాతీయులేనని, ఇది జాత్యహంకార దాడని నగర మేయర్ డోనా డీగన్ చెప్పారు.
దుండగుడి దగ్గర ఆటోమేటిక్ రైఫిల్‌తోపాటు ఒక హ్యాండ్ గన్ కూడా ఉందని, అతడు తన కుటుంబంతో జాక్సన్‌విల్‌లోని క్లే కౌంటీలో ఉండేవాడని వివరించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజీని చూడండి. నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.