విప్రో: ఆఫర్ లెటర్‌లో జీతాల కోత ప్రకటించిన టెక్ కంపెనీ... అయోమయంలో అభ్యర్థులు

భారత్‌లోని టాప్ టెక్ సంస్థలో కొత్తగా ఉద్యోగం వచ్చినట్లు ఈమెయిల్ పొందిన సరితా ఆ ఆఫర్ లెటర్ చూసి షాకయ్యారు.

లైవ్ కవరేజీ

  1. బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం

    ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం. న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.

    ధన్యవాదాలు

  2. హైదరాబాద్: కుక్కల దాడిలో బాలుడు చనిపోవడానికి అధికార యంత్రాంగం వైఫల్యమే కారణమా?

  3. పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో వందలాది గాడిదలను ఇరాన్ ఎందుకు చంపేస్తోంది?

  4. రామ్ రహీమ్ సింగ్: రేప్, మర్డర్ కేసులలో శిక్ష అనుభవిస్తున్న బాబాకు పదేపదే పెరోల్ ఎలా లభిస్తోంది

  5. విప్రో: ఐటీ కంపెనీలో కొత్త ఉద్యోగులకు వేతన కోత

    విప్రో

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    భారత్‌లోని టాప్ టెక్ సంస్థలో కొత్తగా ఉద్యోగం వచ్చినట్లు ఈమెయిల్ పొందిన సరితా ఆ ఆఫర్ లెటర్ చూసి షాకయ్యారు.

    ఎందుకంటే, అంతకుముందు ఆఫర్ చేసిన మొత్తం కంటే 50 శాతం తక్కువగా తనకి వార్షిక వేతన ప్యాకేజీని విప్రో రివైజ్ చేసింది. దీంతో ఆమె వేతనం ఏడాదికి రూ.6,50,000 నుంచి రూ.3,50,000కి తగ్గిపోయింది.

    ఈ నిర్ణయం సమయానుకూలంగా ఉన్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలరని ఆమెకు ఈ టెక్ సంస్థ ఈమెయిల్‌లో తెలిపింది.

    తనలాంటి చాలా మంది కొత్త ఉద్యోగులకు ఐటీ దిగ్గజం విప్రో గత వారం ఇదే మాదిరి ఈమెయిల్ పంపినట్టు తనకు తెలిసింది. తొలుత ఆఫర్ చేసిన వేతనాన్ని రివైజ్ చేసి, తగ్గింపు వేతనంతో సంస్థలో చేరాలని అభ్యర్థులకు పిలుపునిచ్చింది.

    రివైజ్డ్ ఆఫర్ లెటర్ వల్ల విప్రోలో చేరేందుకు సుమారు 4 వేల మంది కొత్త ఉద్యోగులు ఆలోచనలో పడినట్టు ఐటీ ఉద్యోగుల సంఘం నాస్నెంట్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(ఎన్ఐటీఈఎస్) తెలిపింది.

    ‘‘టెక్నాలజీ రంగంలో వస్తోన్న మార్పుల దృష్ట్యా మా ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రణాళికలను సవరించాల్సి వచ్చింది. ప్రస్తుత ఆఫర్ అభ్యర్థులు వెంటనే వారి కెరీర్‌ను ప్రారంభించడానికి అవకాశంగా ఉంది. విద్యార్థులు వారి నిపుణతను పెంచుకుని, కొత్త నైపుణ్యాలను పొందాలి’’ అని విప్రో తన ప్రకటనలో సూచించింది.

    ఇండస్ట్రీలో ఇతర కంపెనీల మాదిరి తాము కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకుని, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా నియామకాలను చేపడుతున్నట్టు అభ్యర్థులకు పంపిన ఈమెయిల్‌లో విప్రో తెలిపింది.

    ఫిబ్రవరి 20 నాటికి రివైజ్ చేసిన ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్టు సర్వే ఫామ్‌ను నింపాలని అభ్యర్థులను కోరింది. ఒకవేళ అంగీకరిస్తే, ముందు ఆఫర్లన్ని కూడా నిలిచిపోతాయని పేర్కొంది.

    అయితే, ఈ విషయంలో గ్రాడ్యుయేట్లకు సాయం చేసేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎన్ఐటీఈఎస్ ప్రెసిడెంట్ సింగ్ సలూజ కోరారు.

  6. ముస్లింలకు శ్మశానాల కొరత... కబ్జాలు, కాంక్రీటు సమాధుల నిర్మాణమే కారణమా?

  7. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్‌గా ఆప్ అభ్యర్థి హెల్లీ ఒబెరాయ్ విజయం

    షెల్లీ ఒబెరాయ్

    ఫొటో సోర్స్, TWITTER@OberoiShelly

    దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థి హెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు.

    మేయర్‌గా విజయం సాధించిన హెల్లీ ఒబెరాయ్‌కి దిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శుభాకాంక్షలు తెలియజేశారు.

    ‘‘రౌడీలు ఓడిపోయారు. ప్రజాస్వామ్యం గెలిచింది. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా హెల్లీ ఒబెరాయ్‌ని గెలిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దిల్లీ ప్రజలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నా. మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ తొలి మేయర్ షెల్లీ ఒబెరాయ్‌కి శుభాకాంక్షలు’’ అంటూ మనీశ్ సిసోడియా ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    షెల్లీ ఒబెరాయ్ ఎవరు?

    తూర్పు పటేల్ నగర్‌కు చెందిన కార్పోరేటర్ షెల్లీ ఒబెరాయ్.

    ఆమె ట్విటర్ ప్రొఫైల్ ప్రకారం, తాను దిల్లీ యూనివర్సిటీ, ఇంద్రప్రస్థా యూనివర్సిటీ, ఇగ్నో, ఎన్ఎంఐఎంఎస్‌లలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

    తనని తాను రచయితగా పరిచయం చేసుకున్నారు షెల్లీ ఒబెరాయ్.

    డిసెంబర్‌లో జరిగిన దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. 15 ఏళ్లుగా బీజేపీనే మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారంలో ఉంది. అయితే, ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లను, బీజేపీ 104 సీట్లను సంపాదించుకున్నాయి.

  8. రష్యా, యుక్రెయిన్ యుద్ధం: బఖ్మూత్ నగరంపై పట్టు కోసం ఇరు సైన్యాల మధ్య హోరా హోరీ పోరు

  9. వీడియో: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభ సుడిగుండంలో ఎలా చిక్కుకుంది?

    వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి కారణాలేంటంటే..

    ఆర్థిక సంక్షోభానికి తాజా అడ్రస్‌గా మారింది పాకిస్తాన్‌... ఆర్థిక సంక్షోభం అంటే.. ఒక దేశం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి, దేశ ప్రజలకు అవసరమైన నిత్యవసరాలను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితులకు చేరుకోవడం.

    దాంతో మనం తినే, వినియోగించే అత్యవసరాల ధరలన్నీ కొండెక్కి కూర్చుంటాయి.పాకిస్తాన్‌లో ఇప్పుడు అక్షరాలా ఇదే జరుగుతోంది.

    నిజానికి పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం గురించి మనం చాలా కాలం నుంచే వింటున్నాం. మేం ఈ పరిస్థితి నుంచి కచ్చితంగా బయటపడతాం అని ఆ దేశ ప్రభుత్వం చెబుతున్నా... అలాంటి పరిస్థితైతే ఎక్కడా కనిపించట్లేదు సరికదా నిజానికి అంతకంతకూ అది తీవ్రమవుతోంది కూడా.

    రోజులు గడిచేకొద్దిపాకిస్తాన్ అప్పుల ఊబిలో మరింతగా కూరుకుపోతోంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ మరో శ్రీలంక కానుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

    అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? పాక్ ఓడ.. నిండా మునిగేవరకు ఆ దేశ పాలకులు, ప్రభుత్వం ఎందుకు మేలుకోలేదు? అప్పుల కోసం IMF వైపు చూస్తున్నా ఆ సంస్థ ఎందుకని స్పందించడం లేదు?

    అక్కడ పరిస్థితులు ఇంతగా దిగజారిపోవడానికి కారణాలేంటో చూద్దాం.

  10. ఆంధ్రప్రదేశ్: టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టారని ఆరోపణలు.. అవాస్తవమన్న పోలీసులు, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    టీడీపీ నేత పట్టాభి

    ఫొటో సోర్స్, UGC

    ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. గతంలో ఎంపీ రఘరామకృష్ణంరాజుని కస్టడీలో గాయపరిచారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. తాజాగా టీడీపీ నేత కె.పట్టాభిని కూడా కొట్టారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

    సోమవారం సాయంత్రం గన్నవరంలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చిపోయి టీడీపీ ఆఫీసుని ధ్వంసం చేశారు. కారుకి నిప్పు పెట్టారు. ఆ సమయంలోనే టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు.

    సోమవారం నాటి ఘటనలకు బాధ్యుడిగా అరెస్ట్ చేసిన తర్వాత తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్‌కు ఆయన్ని తరలించారు. అక్కడే తనను పోలీసులు కొట్టారంటూ నిందితుడు కోర్టులో న్యాయమూర్తి ముందు వాపోయినట్టు వార్తలు వచ్చాయి. అంతకుముందు ఆయన కోర్టులోకి ప్రవేశిస్తూ తన చేతి వేళ్లు వాచిపోయి ఉన్నాయంటూ మీడియాకి చూపించారు.

    పట్టాభి భార్యతో పాటు టీడీపీ నేతలు కూడా పోలీసుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్తకు ఏమి జరిగినా ఏపీ డీజీపీదే బాధ్యత అని పట్టాభి భార్య అన్నారు. డీజీపీ కార్యాలయం ముందు నిరసనకు కూడా ఆమె యత్నించారు. ఆమెను పోలీసులు అడ్డుకుని, గృహనిర్బంధం చేయడంతో ఇంట్లోనే నిరసన తెలిపారు.

    అయితే పట్టాభిని పోలీసులు కొట్టారనే ఆరోపణలను కృష్ణా జిల్లా ఎస్‌పీ జాషువా తోసిపుచ్చారు. అలాంటిదేమీ జరగలేదని చెప్పారు.

    మంగళవారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచే ముందు పట్టాభికి గన్నవరం ఆస్పత్రిలో వైద్యులతో పరీక్షలు చేయించారు. ఆయనకి గాయాలు లేవని వైద్యులు తమ నివేదికలో తేల్చారు. గన్నవరం కోర్టు ఆయనకి రిమాండ్ విధించడంతో తొలుత సబ్ జైలుకి తరలించారు.

    గన్నవరం సీఐ కనకారావు మీద దాడి చేశారంటూ పట్టాభి సహా 11 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదయ్యింది.

  11. బీబీసీ కార్యాలయాలలో ఆదాయ పన్ను శాఖ సర్వే.. ‘‘ఉద్దేశపూర్వకమైన బెదిరింపు చర్య’’ - బ్రిటన్ పార్లమెంటులో ఎంపీలు

  12. దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మీద విచారణకు కేంద్ర హోంశాఖ అనుమతి

    మనీష్ సిసోడియా

    ఫొటో సోర్స్, ANI

    దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీద అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరపటానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది.

    దీంతో.. సిసోడియా మీద వచ్చిన ‘రాజకీయ గూఢచర్యం’ ఆరోపణల మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేయటానికి మార్గం సుగమం అయిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    దిల్లీ ప్రభుత్వంలోని ‘ఫీడ్‌బ్యాక్ యూనిట్’ ద్వారా.. కేంద్ర మంత్రిత్వశాఖలు, ప్రతిపక్ష పార్టీలతో పాటు వివిధ సంస్థలు, వ్యక్తుల మీద సిసోడియా గూఢచర్యం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.

    దిల్లీలో 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఈ ‘ఫీడ్‌బ్యాక్ యూనిట్’ను స్థాపించారు. విజిలెన్స్ శాఖ మంత్రి అయిన సిసోడియా మీద బీజేపీ ఈ ఆరోపణలు చేసింది.

    ఈ ఆరోపణలపై సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా సిఫారసు చేశారు. దీంతో ఈ విషయంలో కేసు నమోదు చేయటానికి సీబీఐ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. అమెరికా నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం స్టాక్‌హోంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

    ఎయిర్ ఇండియా

    ఫొటో సోర్స్, AFP

    అమెరికాలోని నెవార్క్ (న్యూ జెర్సీ) నుంచి 300 మంది ప్రయాణికులతో న్యూ దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ‘ఏఐ-106’ విమానాన్ని అత్యవసరంగా స్వీడన్‌లోని స్టాక్‌హోంలో దించేశారు.

    విమానంలోని ఒక ఇంజన్‌లో లీకేజీ కారణంగా దీనిని స్టాక్‌హోం మళ్లించి దించేయాల్సి వచ్చిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    విమానం దిగేటప్పటికి స్టాక్‌హోం విమానాశ్రయంలో అగ్నిమాపక శకటాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్తున్నారు.

    అయితే విమానంలో ఎవరికీ ఎటువంటి నష్టమూ జరగలేదని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. తెలంగాణ ‘పోలీస్ కస్టడీలో చిత్ర హింసలు.. చైన్ స్నాచింగ్ కేసులో అనుమానితుడి మృతి’ - ఖదీర్ ఖాన్‌‌ను అదుపులోకి తీసుకున్నాక ఏం జరిగింది?

  15. కుక్కలు మనుషుల్ని ఎందుకు కరుస్తాయి? పిచ్చి కుక్క కాటు అంటే ఏంటి?

  16. దిల్లీలో బైక్ ట్యాక్సీలపై నిషేధం

    బైక్ ట్యాక్సీ

    ఫొటో సోర్స్, Getty Images

    దేశ రాజధాని దిల్లీలో మోటార్‌బైక్ ట్యాక్సీలను నిషేధించారు. ప్రైవేటు వాహనాల్లో పాసింజర్లను తీసుకెళ్లటం చట్టాన్ని ఉల్లంఘించటమేనని ప్రభుత్వం నోటీసు జారీ చేసింది.

    ఈ ఉత్తర్వులు ఊబర్, ఓలా, రాపిడో వంటి కంపెనీలకు, వాటిలో తమ సొంత బైక్ ట్యాక్సీలతో ఉపాధి పొందుతున్న వేలాది మందికి శరాఘాతంలా మారాయి.

    ఈ ఉత్తర్వులపై ఆయా కంపెనీలు ఇంకా స్పందించలేదు.

    దిల్లీలో రద్దీ ట్రాఫిక్‌లో ప్రయాణించటానికి ప్రతి రోజూ వేలాది మంది చౌకైన బైక్ ట్యాక్సీలను వాడుతుంటారు.

    అయితే మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రైవేటు వాహనాలను వాణిజ్య ఆపరేషన్లకు ఉపయోగించరాదు.

    జనవరి నెలలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రాపిడో మోటార్‌బైక్ ట్యాక్సీలకు లైసెన్స్ మంజూరు చేయటానికి నిరాకరించింది. వాటి లైసిన్సింగ్, భద్రత, చార్జీలకు సంబంధించి మార్గదర్శకాలేవీ లేవని పేర్కొంది.

    రాపిడో బైక్ ట్యాక్సీ ఆపరేషన్లకు లైసెన్స్ లేనందున ఆ కార్యకలాపాలను నిలిపివేయాలని ముంబై హైకోర్టు కూడా ఆదేశించింది.

    దానికి ముందు డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రైవేటు వాహనాలను మోటార్‌బైక్ ట్యాక్సీలుగా నడపటం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆటో కార్మికులు నిరసనకు దిగారు.

    భారతదేశంలో మోటార్‌బైక్ ట్యాక్సీ మార్కెట్ విలువ 5 కోట్ల డాలర్లుగా ఉందని, ఇది 2030 నాటికి 150 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అలైడ్ మార్కెట్ రీసెర్చ్ గత ఏడాది ఒక నివేదికలో అంచనా వేసింది.

    అయితే బైక్ ట్యాక్సీలకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు, స్థానికంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్ల ప్రతిఘటన.. ఈ మార్కెట్ వృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆ నివేదిక చెప్తోంది.