భారత మహిళల క్రికెట్ జట్టు: ఒకే రోజు రెండు రికార్డులు సాధించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్
ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధంతరంగా నిలిచిపోగా.. డక్‌వర్త్ లూయిస్ రూల్ ప్రకారం భారత్ 5 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు.
లైవ్ కవరేజీ
జో బైడెన్ 10 గంటల పాటు రహస్యంగా రైలులో ప్రయాణం.. ఇంత సీక్రెట్‌గా ఎలా ఉంచారు?
ప్రపంచంలో ఇలాంటి జుట్టు కొన్ని వందల మందికే ఉంటుందట, ఏమిటీ ప్రత్యేకత?
రోహిణీ సింధూరి-రూపా మౌద్గిల్: ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవేంటి, కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది?
ఏజ్ ఆఫ్ కన్సెంట్: సెక్స్‌కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
తుర్కియే-సిరియా: భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు?– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
పుతిన్: ‘‘పశ్చిమ దేశాలది బూటకపు నిబద్ధత’’

యుక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
మాస్కోలోని గోస్టినీ డ్వోర్ హాల్‌లో ఆయన ప్రసంగాన్ని వినేందుకు పలువురు మంత్రులు, అధికారులు, పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు.
వ్లాదిమిర్ పుతిన్ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే ప్రజలంతా లేచి నిలబడి ఆయనకు గౌరవాన్ని ప్రకటించారు.
పుతిన్ ఏం అన్నారంటే..
‘‘ఇది దేశానికి చాలా క్లిష్టమైన సమయం, సవాలుతో కూడిన సమయం. ప్రపంచం చాలా వేగంగా మారుతోంది.
చారిత్రక సంఘటనలు దేశం భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనమందరిపై గొప్ప బాధ్యత ఉంది.
యుక్రెయిన్‌పై రష్యా చేసిన దాడి ఒక ‘ప్రత్యేక ఆపరేషన్’.రష్యా నిరంతరం నాజీల బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది.
యుక్రెయిన్ ప్రభుత్వం నిరంతరం రష్యా పట్ల ద్వేషం, బెదిరింపులను ప్రోత్సహిస్తోంది.
రష్యా వచ్చి తమకు సహాయం చేస్తుందని యుక్రెయిన్ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
దోన్బస్ ప్రాంతంలోని సంఘర్షణకు శాంతిపూర్వక పరిష్కారం కోసం రష్యా ప్రయత్నించింది.
శాంతిని పునరుద్ధరించడానికి పశ్చిమ దేశాలు బూటకపు నిబద్ధతను చూపిస్తున్నాయి. అది పెద్ద అబద్ధం.
జీవ, అణ్వాయుధాలను సేకరించడానికి యుక్రెయిన్ ప్రయత్నిస్తోంది. ఈ సమస్యకు శాంతిపూర్వక పరిష్కారాన్ని కనుగొనడానికి మేం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.
ఈ క్లిష్టమైన సంఘర్షణను ముగించడానికి మేం శాంతియుత మార్గం కోసం చూస్తున్నాం. కానీ, మా వెనుక చాలా భిన్నమైన వాతావరణం సృష్టించారు.’’
ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు, ఎందుకు తమ మూలాలు వెతుక్కుంటున్నారు?
ఉమన్ బాడీ బిల్డర్: కష్టాల కడలిలో ఈదుతూ కండలు తీర్చిదిద్దుకున్న మహిళ
తుర్కియే: ఇంకా టెంట్లలోనే లక్షలాది మంది భూకంప నిర్వాసితుల నివాసం
సిరియా భూకంపం: శిథిలాల్లో జన్మించిన శిశువును ఎవరు దత్తత తీసుకున్నారంటే...
జో బైడెన్: ఫోన్లు కూడా లేకుండా 10 గంటల పాటు రైలులో రహస్య ప్రయాణం.. ఇంత సీక్రెట్‌గా ఎలా ఉంచారు?
హైదరాబాద్‌లో దారుణం.. కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే ఐదేళ్ల బాలుడు చనిపోయాడు.
ఈ నెల 19వ తేదీన జరిగన ఈ ఘోర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఆ బాలుడి తండ్రి గంగాధర్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఆయన ఆదివారం నాడు బాలుడిని తనతో పాటు తను పని చేసే స్థలానికి తీసుకువెళ్లారు.
అక్కడ రోడ్డు మీద ఒంటరిగా నడుస్తున్న బాలుడి మీద వీధి కుక్కలు దాడి చేసి విపరీతంగా కరిచాయి.
బాలుడి తండ్రి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆ చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
బాలుడి మీద కుక్కల దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు తీవ్రంగా కలచివేసేలా ఉన్నాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2023: ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ ‘ఆర్ఆర్ఆర్’.. ఉత్తమ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’

ఫొటో సోర్స్, @SSRAJAMOULI
దాదాసాహెబ్ ఫాల్కే ఉత్తమ చిత్రం అవార్డును వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు ప్రకటించారు.
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం రాత్రి ముంబైలో జరిగింది.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాను ‘సంవత్సరపు సినిమా’గా ప్రకటించారు.
అలియా భట్‌కు ఉత్తమ నేటి అవార్డు, ఆమె భర్త రణ్‌బీర్ కపూర్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించాయి.
అలియాకు గంగూబాయ్ కతియావాడి సినిమాకు అవార్డు లభించగా, రణ్‌బీర్‌కు బ్రహ్మాస్త్ర సినిమాకు అవార్డు లభించింది.
సీనియర్ నటి రేఖకు.. సినీ రంగానికి విశేష కృషి అవార్డు ప్రకటించారు.
కాంతార నటుడు రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును ఇచ్చారు.
అలాగే కశ్మీర్ ఫైల్స్‌లో నటించిన అనుపమ్ ఖేర్‌కు మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత మహిళల క్రికెట్ జట్టు: ఒకే రోజు రెండు రికార్డులు సాధించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్

ఫొటో సోర్స్, Getty Images
మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టు సెమీ ఫైనల్ చేరుకుంది.
సోమవారం ఇండియా, ఐర్లండ్ జట్ల మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్.. వర్షం కారణంగా అర్ధంతరంగా నిలిచిపోగా.. డక్‌వర్త్ లూయిస్ రూల్ ప్రకారం భారత్ 5 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు రికార్డులు నెలకొల్పారు.
ప్రపంచంలో 150 టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన తొలి మహిళా ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ నిలిచారు.
అలాగే.. టీ20 ఇంటర్నేషనల్స్‌లో హర్మన్‌ప్రీత్ 3,000 పరుగులు పూర్తిచేశారు.
అయితే.. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ పెద్దగా రన్స్ చేయకపోవటం పట్ల కొందరు అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.
సెల్ఫీ కోసం సోను నిగమ్ మీద దాడి చేసిన అభిమాని

ఫొటో సోర్స్, Getty Images
గాయకుడు సోను నిగమ్ మీద సోమవారం రాత్రి ముంబైలో ఒక అభిమాని దాడి చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ముంబైలోని చెంబూర్‌లో ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లిన సోను నిగమ్ మీద రాత్రి 11 గంటల సమయంలో ఈ దాడి జరిగింది.
ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళుతున్న సోను నిగమ్‌ను కొందరు అభిమానులు చుట్టుముట్టారని, సోను నిగమ్ సిబ్బంది వారిని అడ్డుకున్నారని పోలీస్ అధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సోను నిగమ్ ఈ ఘటనకు సంబంధించి ఏఎన్ఐ వార్తా సంస్థతో కూడా మాట్లాడారు.
‘‘కచేరీ ముగిసిన తర్వాత నేను వేదిక మీద నుంచి దిగుతున్నాను. అప్పుడు స్వప్నిల్ ప్రకాష్ అనే వ్యక్తి నన్ను పట్టుకున్నారు. నన్ను కాపాడటానికి వచ్చిన హరి, రబ్బానీలను కూడా అతడు నెట్టివేశాడు. నేను మెట్ల మీద పడిపోయాను. జనం బలవంతంగా సెల్ఫీలు తీసుకోవటం, ఘర్షణకు దిగటం చేయకూడదని తెలియజేయటానికి ఈ ఘటన మీద నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని ఆయన వివరించారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ కేసులో నిందితుడు.. సెల్ఫీ ఫొటోలు తీసుకోవటం కోసం సోను నిగమ్‌ను పట్టుకున్నట్లు కనిపిస్తోందని పోలీసులు ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. కానీ సోను నిగమ్ తిరస్కరించటంతో ఆయనను, మరో ఇద్దరిని తోసివేసినట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారని చెప్పారు.
తెలుగు భాషా దినోత్సవం: తెలుగు భాషకు ప్రాచీన హోదా వల్ల ఏదైనా మేలు జరిగిందా?
తెలుగు భాషా దినోత్సవం: తెలుగు, సంస్కృతం, హిందీ, తమిళం.. ఏది ప్రాచీన భాష?
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2022: ముగిసిన ఓటింగ్, మార్చి 5న విజేత ప్రకటన
మహిళల టీ20 ప్రపంచ కప్: ఐర్లండ్ మీద గెలుపుతో సెమీస్‌కు చేరిన భారత్

ఫొటో సోర్స్, Getty Images
మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో గ్రూప్ 2లో భారత జట్టు తన చివరి మ్యాచ్‌లో ఐర్లండ్ మీద గెలిచి సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.
ఇరు జట్ల మధ్య దక్షిణాఫ్రికాలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. డక్‌వర్త్ లూయిస్ రూల్ ప్రకారం.. భారత జట్టు 5 పరుగుల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 155 పరుగులు చేసింది. స్మృతి మంధాన 87 పరుగులు చేశారు.
ఐర్లండ్ 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టగా.. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది.
ఐర్లండ్ టీం 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగుల స్కోరు వద్ద ఉండగా వర్షం రావటంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత తిరిగి కొనసాగలేదు.
దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత జట్టును విజేతగా ప్రకటించారు. స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
