ఎర్రకోట నుంచి రాహుల్ గాంధీ: ‘ఇది మోదీ ప్రభుత్వం కాదు.. అంబానీ, అదానీ ప్రభుత్వం’
విద్వేష రాజకీయాలు, చైనా అంశాన్ని ప్రశ్నించారు. జీఎస్టీ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఇది పాలసీ కాదు, చిన్న, మధ్యతరహా వ్యాపారుల ప్రాణం తీసే ఆయుధమని, ఇలా చేయడం వల్ల యువతకు ఉపాధి లభించడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.
లైవ్ కవరేజీ
టీవీ నటి తునిషా శర్మ మృతి.. ఆత్మహత్యగా పోలీసుల అనుమానం

ఫొటో సోర్స్, Instagram/Tunisha Sharma
టీవీ నటి తునిషా శర్మ (20) మృతిచెందారు. మహారాష్ట్రలో శనివారం సాయంత్రం 4 గంటలకు షూటింగ్ విరామ సమయంలో తునిషా తన మేకప్ రూంలోకి వెళ్లారు.
ఎంతకీ తిరిగి రాకపోవడంతో షూటింగ్ నిర్వాహకులు వెళ్లి చూడగా ఆమె చలనం లేకుండా కనిపించారు.
వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కాగా, తునిషా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
తునిషా 2015 లో భారత్ కా వీర్ పుత్ర్ మహారాణా ప్రతాప్ సీరియల్‌తో తన కెరీర్ ప్రారంభించారు.
బాలీవుడ్ సినిమా ఫితూర్‌లో కూడా ఆమె నటించారు.
దేశంలో ఎక్కడ వస్తువు కొని నష్టపోయినా మీ సొంత జిల్లాలో ఫిర్యాదు చేయొచ్చు.. ఫోన్ చేసి కూడా కంప్లయింట్ చేయొచ్చు.. వినియోగదారుడి హక్కు అది..
300 డైనోసార్ గుడ్లు అక్కడ శిలాజ రూపంలో దొరికాయి
ఎర్రకోట నుంచి రాహుల్ గాంధీ: ‘ఇది మోదీ ప్రభుత్వం కాదు.. అంబానీ, అదానీ ప్రభుత్వం’

ఫొటో సోర్స్, congress
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' శనివారం సాయంత్రం దిల్లీలోని ఎర్రకోట మైదానానికి చేరుకోగానే మక్కళ్ నీతి మయ్యం పార్టీ చీఫ్, సినీ నటుడు కమల్ హాసన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయనతో కలిసి అడుగులేశారు.
ఎర్రకోటపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ గాంధీ మీడియాను, బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు.
విద్వేష రాజకీయాలు, చైనా అంశాన్ని ప్రశ్నించారు. జీఎస్టీ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఇది పాలసీ కాదు, చిన్న, మధ్యతరహా వ్యాపారుల ప్రాణం తీసే ఆయుధమని, ఇలా చేయడం వల్ల యువతకు ఉపాధి లభించడం లేదని ఆరోపించారు.
‘గేమ్‌ను అర్థం చేసుకోండి. జీఎస్టీని ఉద్యోగాలు ఇచ్చేవారిపై విధించి, వారి వెన్ను విరిచారు. ఇప్పుడు వారు యువతకు ఉపాధి ఎలా కల్పిస్తారు.'' అని ప్రశ్నించారు.
ఇది మోదీ ప్రభుత్వం కాదని, ఆదానీ, అంబానీల ప్రభుత్వమని ఆరోపించారు రాహుల్.

ఫొటో సోర్స్, congress
రాహుల్ నా తమ్ముడు.. మేం ఇద్దరం భారత్ పుత్రులం: కమల్ హాసన్
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతోపాటూ కాంగ్రెస్ నేతలు ఉన్న వేదికపై కమల్ హాసన్ కూడా ప్రసంగించారు.
నేను రాహుల్ గాంధీని నా సోదరుడుగా భావిస్తున్నాను. మేం భారత పుత్రులం. ఆయన నెహ్రూ మనవడు అయితే, నేను గాంధీ మనవడిని. ఇద్దరం ఈ దేశ పుత్రులమే. ఇక్కడ పార్టీల ప్రసక్తే ఉండదు. ఎప్పుడు రాజ్యాంగంపై దాడి జరిగినా నేను ముందుకు వస్తాను. ఏ పార్టీ అధికారంలో ఉందనేది నాకు అక్కర్లేదు. నేను ఇక్కడికి అందుకే వచ్చాను అన్నారు.
తమిళంలో మాట్లాడాలని రాహుల్ గాంధీ కోరడంతో కమల్ తమిళంలోనూ ప్రసంగించారు.
నేను అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకుని దేశానికి నా అవసరం ఉన్న సమయం ఇదేనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు కమల్ భారత్‌ను ముక్కలు చేయడానికి సాయం చేయకు, జోడించడానికి సాయం చెయ్ అని నాకొక గళం వినిపించింది. అందుకే దేశానికి నా అవసరం ఉన్నప్పుడే నేనిక్కడికి వచ్చాను అన్నారు.
2022లో 9 కీలక ఘట్టాలు
‘కృష్ణ జన్మభూమి’, షాహీ ఈద్గా మైదానం వివాదంలో కీలక ఆదేశాలు, సర్వే చేయాలన్న మథుర కోర్టు

ఫొటో సోర్స్, SURESH SAINI
శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో షాహీ ఈద్గా మసీదు ప్రాంతంలో సర్వేకు మధుర కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శ్రీ కృష్ణుడి జన్మస్థలం, షాహీ ఈద్గా మసీదు వివాదం కీలక మలుపు తిరిగింది.
ఆ ప్రాంతంలో సర్వే చేయాల్సిందిగా మథుర సివిల్ కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది.
2023 జనవరి 20లోగా రిపోర్టును సమర్పించాల్సిందిగా ఆదేశించింది.
‘శ్రీకృష్ణుడి జన్మ స్థలానికి’ సమీపంలో ఉన్న షాహీ ఈద్గా మసీదుపై సర్వేకు ఆదేశించాలంటూ హిందు సేన వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మధుర సివిల్ కోర్టు జడ్జి సోనికా వర్మ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
మొఘల్ పాలకుడు ఔరంగజేబు1669-70ల కాలంలో శ్రీకృష్ణుడి జన్మస్థలం వద్ద ఉన్న కట్రా కేశవ్ దేవ్ ఆలయంలోని కొంత భాగంలో ఈ షాహీ ఈద్గా మసీదును నిర్మించారని హిందు సేన ఆరోపిస్తోంది.
భారత్ vs బంగ్లాదేశ్ టెస్ట్: 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ - ముగిసిన మూడో రోజు ఆట

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, కోహ్లీ వికెట్ తీసిన ఆనందంలో ఎగిరి గంతులేస్తున్న బంగ్లాదేశ్ బౌలర్ మెహదీ హసన్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది.
ఈ టెస్టు గెలవాలంటే భారత్ ఇంకా 100 పరుగులు చేయాలి.
బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
కెప్టెన్ కేఎల్ రాహుల్ 2 పరుగులు చేసి ఔటయ్యారు.
అనంతరం పుజారా కూడా 6 పరుగులు చేసి జట్టు స్కోరు 12 వద్ద పెవిలియన్ చేరారు.
మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా 7 పరుగులు చేసి ఔటవడంతో జట్టు కష్టాల్లో పడింది.
అనంతరం వచ్చిన కోహ్లీ 22 బంతులు ఎదుర్కొని ఒకే ఒక పరుగు చేసి పెవిలియన్ చేరారు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి అక్షర్ పటేల్ 26 పరుగులు, జయదేవ్ ఉనద్కత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హాసన్ 3 వికెట్లు తీయగా, షకీబుల్ హాసన్ ఒక వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 231 పరుగులు చేసి ఆలౌటైంది.
కెప్టెన్ లిటన్ దాస్ అత్యధికంగా 73 పరుగులు చేశారు.
జాకీర్ హుస్సేన్ 51 పరుగులు చేశారు.
రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అక్షర్ పటేల్ 3 వికెట్లు తీయగా, అశ్విన్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.
క్రిస్మస్ ట్రీ ఎన్ని రోజులు ఉంచాలి? ఎప్పుడు తీసేయాలి.. క్రిస్మస్ రోజున టర్కీ కోడిని ఎందుకు తింటారు
చందా కొచ్చర్: పదేళ్ల కిందట పద్మభూషణ్.. ఇప్పుడు ఆర్థిక నేరాలలో అరెస్టు
ఖాళీగా ఉండటం మీ బ్రెయిన్‌కి ఎందుకు అవసరం
ముస్లిం పురుషులు నాలుగు పెళ్లిళ్లు ఎలా చేసుకోగలుగుతున్నారు, మహిళల హక్కులేంటి?
వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం, 20 మందికి పైగా మృతి

ఫొటో సోర్స్, REUTERS
వృద్ధాశ్రమంలో మంటలు చెలరేగడంతో 20 మందికి పైగా చనిపోయారని, మరో ఆరుగురు గాయాల పాలయ్యారని రష్యా అధికారులు తెలిపారు.
సైబీరియాలోని కెమెరోవో నగరంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.
ఈ అగ్ని ప్రమాదంలో చెక్కతో నిర్మించిన రెండు అంతస్థుల భవనం పైకప్పు మొత్తం కాలిపోయిందని వెల్లడించారు.
హీటింగ్ బాయిలర్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక పరీక్షలు తెలిపాయి.
చట్టవిరుద్ధంగా ఈ వృద్ధుల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులను ఉటంకిస్తూ టాస్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
రష్యా అంతటా రిజిస్టర్ కాని అనేక వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయని టాస్ న్యూస్ తెలిపింది.
2018లో కెమెరోవోలోని విశ్రాంతి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 37 మంది చిన్నారులతో సహా 60 మంది మరణించారు.
బిహార్: ఇటుక బట్టీ చిమ్నీలో పేలుడు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

ఫొటో సోర్స్, ANI
బిహార్ రాష్ట్రం తూర్పు చంపారన్ జిల్లాలోని ఒక ఇటుక బట్టీలో చిమ్నీ పేలడంతో తొమ్మిది మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
ఈ ప్రమాదం శుక్రవారం ఉదయం మోతిహారిలోని రామ్‌గర్వా ప్రాంతంలో జరిగింది.
చనిపోయిన వారిలో ఇటుక బట్టీ యజమాని మొహమ్మద్ ఇష్రార్ కూడా ఉన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
వార్తా సంస్థ ఏఎన్‌ఐప్రకారం, మోతిహారి పోలీసులు మాట్లాడుతూ, ‘‘ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చాం. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.ఏఎస్పీ రక్సాల్, పోలీసు బృందాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో ఉన్నాయి’’ అని చెప్పారు.
మోతిహారి ఎస్‌ఆర్పీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజిత్ కుమార్ మాట్లాడుతూ, “బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.ఎడెనిమిది మందిని ఇక్కడ చేర్చారు.అందులో ముగ్గురు వెంటిలేటర్‌పై ఉన్నారు’’ అని తెలిపారు.
ఈ ప్రమాదం గురించి ట్వీట్ చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రలుకు సరైన చికిత్స అందించాలని ఆదేశించారు.
ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఒక సీరియల్ కిల్లర్‌ను విడుదల చేయడం ప్రమాదకరం కాదని ఎలా నిర్ణయించారు?
ఏడాది పాటు పేదలందరికీ ఉచిత రేషన్

ఫొటో సోర్స్, SOPA IMAGES
జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) పరిధిలోకి వచ్చే దాదాపు 81.3 కోట్ల మంది పేదలకు ఏడాది పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ చట్టం ప్రకారం ప్రస్తుతం నెలకు కుటుంబంలో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున కిలో రూ.2-3 ధరకు అందిస్తున్నారు.
అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్న కుటుంబాలకైతే నెలకు 35కిలోల చొప్పున ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ఈ ప్రకటన చేశారు.
జాతీయ ఆహార భద్రత చట్టం కింద పేదలకు ఉచితంగా రేషన్ ఇవ్వాలంటే ఏడాదికి దాదాపు 2 లక్షల కోట్ల మేర ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక భారాన్ని కేంద్రమే భరిస్తుందని అన్నారు.
దిల్లీలో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర ఈరోజు దిల్లీలోని బదర్‌పూర్ సరిహద్దు నుంచి ఎర్రకోట వరకు సాగనుంది.
రాహుల్ గాంధీ హరియాణాలోని ఫరీదాబాద్ నుంచి దిల్లీలో అడుగుపెట్టారు. ఆయనకు స్వాగతం పలికేందుకు దిల్లీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బదర్‌పూర్ బోర్డర్‌కు చేరుకున్నారు.
హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, శక్తిసిన్హ్ గోహిల్ వంటి పార్టీ సీనియర్ నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.
దిల్లీలో అడుగుపెట్టే ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కానీ దేశంలోని సామాన్యులు మాత్రం ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. ప్రతి రాష్ట్రంలో లక్షలాది మంది యాత్రలో చేరారు. మీ విద్వేషాల బజారులో ప్రేమ అనే దుకాణం తెరవడానికి వచ్చామని ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ ప్రజలకు చెప్పాను’’ అన్నారు. రాహుల్ గాంధీ 150 రోజులుగా 'భారత్ జోడో యాత్ర' చేస్తున్నారు.
గుడ్ మార్నింగ్...
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.
