ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.
ఐసీఐసీఐ బ్యాంకు - వీడియోకాన్ రుణాల కుంభకోణ కేసులో చందా కొచ్చర్ మీద, ఆమె భర్త మీద ఆరోపణలున్నాయి.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో అయిన చందా కొచ్చర్‌ని, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ని సీబీఐ అరెస్ట్ చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఐసీఐసీఐ బ్యాంకు - వీడియోకాన్ రుణాల కుంభకోణ కేసులో వీరిద్దరిపై ఆరోపణలున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, @SANAMWAZIR
అక్రమ నగదు చెలామణీ చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో కేరళ జర్నలిస్టు సిద్ధీక్ కప్పన్‌కు అలహాబాద్ హైకోర్టు బెయిలు జారీచేసింది.
కప్పన్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌పై జస్టిస్ దినేశ్ కుమార్ సింగ్ శుక్రవారం విచారణ చేపట్టిన అనంతర బెయిలు మంజూరుచేశారు.
2020 అక్టోబర్ 5న ఉత్తర్ ప్రదేశ్‌లోని హాథ్‌రస్ అత్యాచారం కేసు కవర్ చెయ్యడానికి వెళ్తుండగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)తోపాటు పీఎంఎల్‌ఏ కింద ఆయనపై కేసులు నమోదుచేశారు.
యూఏపీఏ కేసులో ఇప్పటికే సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేసింది. తాజాగా పీఎంఎల్ఏ కేసులో అలహాబాద్ హైకోర్టు బెయిలు జారీచేసింది.
బహుశా సోమవారం జైలు నుంచి కప్పన్ విడుదలయ్యే అవకాశముందని అతడి న్యాయవాది మహమ్మద్ దానీశ్ బీబీసీతో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, AFP
ఫ్రాన్స్‌లోని సెంట్రల్ ప్యారిస్‌లో ఓ సాయుధుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు.
కుర్దిష్ కల్చరల్ సెంటర్ ‘‘గారే డీ ఎలెస్ట్’’కు సమీపంలోనే ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.
దాడికి తెగబడినట్లుగా అనుమానిస్తున్న 69 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
‘‘అంతా భయానకంగా కనిపించింది. వెంటనే దుకాణాల్లోకి వెళ్లి తలుపులు మూసేసుకున్నాం’’అని ఓ దుకాణదారుడు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు వెల్లడించారు.
ఏడెనిమిదిసార్లు కాల్పులు జరిపినట్లు తాము చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి.
నిందితుడు ప్రతిఘటించలేదని, అతడి దగ్గర నుంచి ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అతడు ఎందుకు ఈ దాడికి ఒడిగట్టాడో తెలియాల్సి ఉంది.
ఐపీఎల్ 2023 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మయాంక్ అగర్వాల్‌ని రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది.
మయాంక్ అగర్వాల్‌ని తొలుత వేలం పాటలో కోటి రూపాయలుగా నిర్ణయించారు. చాలా టీమ్‌లు ఆయన్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించాయి.
చెన్నైసూపర్ కింగ్స్ కూడా తన టీమ్‌లో మయాంక్ అగర్వాల్ కోసం బిడ్ వేసింది.
అంతకుముందు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంగ్లాంగ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్ల బిడ్ వేసి కొనుగోలు చేసింది.
కుడి చేతి బ్యాట్‌మాన్ అయిన మయాంక్ అగర్వాల్ నాలుగు భిన్నమైన టీమ్‌లతో కలిసి ఆడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
ఉత్తర సిక్కిం జీమా ప్రాంతంలో శుక్రవారం నాడు ఆర్మీ ట్రక్కు లోయలో పడ్డ ప్రమాదంలో 16 మంది సైనికులు మృతి చెందినట్టు భారత ఆర్మీ తెలిపింది.
మూడు వాహనాల కాన్వాయ్‌లో ఈ ఆర్మీ ట్రక్కు కూడా ఒకటి. నేడు ఉదయం చత్తెన్ నుంచి థాంగు వ్యాలీ వైపుగా ఈ వెహికిల్ వెళ్తుండగా జీమా మార్గంలోని ఒక మలుపు దగ్గర అదుపు తప్పి కిందకి పడిపోయింది.
వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినప్పటికీ, ముగ్గురు జూనియర్ కమిషన్ ఆఫీసర్లతో పాటు 13 మంది సైనికులకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయారు. నలుగురు సైనికులు గాయాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాదంపై సైనికుల కుటుంబ సభ్యులకు భారత ఆర్మీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుందని ఆర్మీకి చెందిన ఈస్ట్రన్ కమాండ్ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్‌లో ఇద్దరు విదేశీయులను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను శుక్రవారం నాడు సుందర సెంట్రల్ జైలు నుంచి విడుదల చేశారు.
అతడిని 19 సంవత్సరాల 3 నెలల అనంతరం విడుదల చేశారు. శోభరాజ్‌ను ఇమిగ్రేషన్ విభాగానికి పంపించామని సెంట్రల్ జైల్ జెయిలర్ ఈశ్వరి ప్రసాద్ పాండే బీబీసీకి చెప్పారు.
అతడిని ఫ్రాన్స్‌కు అప్పగించే ప్రక్రియను ఇమిగ్రేషన్ విభాగం పూర్తిచేస్తుందని ఆయన తెలిపారు.
శోభరాజ్ తాను మీడియా ముందుకు వెళ్లనని, మీడియాతో మాట్లాడనని చెప్పినట్లు పాండే వివరించారు.
అతడిని ఫ్రాన్స్‌కు పంపించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఫ్రాన్స్ పౌరుడైన శోభరాజ్‌ను 15 రోజుల్లోగా విడుదల చేసి, ఫ్రాన్స్‌కు అప్పగించాల్సిందిగా నేపాల్ సుప్రీంకోర్టు బుధవారం నాడు ఆదేశించింది. అతడిని ‘బికిని కిల్లర్’ అని, ‘సీరియల్ కిల్లర్’ అని, ‘ది సర్పెంట్’ అని పిలుస్తుంటారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఒక పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో ఒక పోలీసు, దాడి చేసిన వ్యక్తి సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆరుగురికి గాయాలయ్యాయి.
ఐ-14 సెక్టార్‌లో ఈగల్ స్క్వాడ్ చెక్ పాయింట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఒక టాక్సీని తనిఖీ చేయడం కోసం ఆపినప్పుడు ఈ ఘటన జరిగిందని ఇస్లామాబాద్ పోలీస్ డీఐజీ సోహైల్ జాఫర్ చట్టా చెప్పారు.
వాహనాన్ని సోదా చేస్తుండగా, లోపల కూర్చున్న వ్యక్తి పేలుడుకు పాల్పడ్డారని తెలిపారు. పేలుడు ధాటికి కారులో మంటలు చెలరేగాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ఘటనలో ఒక మహిళ, దాడికి పాల్పడ్డ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. టాక్సీని తనిఖీ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆదిల్ హుస్సేన్ కూడా మరణించారు. అక్కడే ఉన్న ఇద్దరు పౌరులు గాయపడ్డారని సమాచారం.
దాడి చేసిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఘటనను ఖండించారు. ఘటనపై నివేదిక అందించాలని అధికారులను కోరారు.
ఈ దాడిపై దర్యాప్తు ప్రారంభించామని డీఐజీ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మీర్‌పుర్‌లోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరుగుతోంది.
మొదటిరోజు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 227 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
ఇక రెండో రోజు మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఓపెనర్లిద్దరు తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. కేఎల్ రాహుల్ 10 పరుగులు, శుభ్ మాన్ గిల్ 24 పరుగులు చేసి తైజుల్ బౌలింగ్‌లో ఔటయ్యారు.
అనంతరం వచ్చిన పుజారా (20) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు.
భారత జట్టు ఇప్పటివరకు మూడు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (18), రిషబ్ పంత్ (12) క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్ తైజుల్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఖతార్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ ముగింపు వేడుకల్లో సెలబ్రిటీ చెఫ్ సాల్ట్ బేతో పాటు బయటి వ్యక్తులు పిచ్ వద్దకు ఎలా వచ్చారని ఫిఫా దర్యాప్తు చేస్తోంది.
సాల్ట్ బే ఒక టర్కిష్ చెఫ్. ఆయన అసలు పేరు నుస్రత్ గుచ్చీ.
ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్న సమయంలో నుస్రత్ ప్రపంచకప్ ట్రోఫీని పట్టుకుని ముద్దాడుతున్నట్లు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రపంచ కప్ ట్రోఫీని తాకే అవకాశం "చాలా కొద్దిమందికి" మాత్రమే ఉంటుందని, టోర్నమెంట్ విజేతలు, ఫిఫా అధికారులు, దేశాధినేతలు మాత్రమే దాన్ని తాకగలరని ఫిఫా నియమాలు చెబుతున్నాయి.
ఫిఫా ప్రతినిధి ఒకరు బీబీసీ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ, డిసెంబరు 18న లుసైల్ స్టేడియంలో ప్రపంచకప్ ముగింపు వేడుక తర్వాత బయటి వ్యక్తులు పిచ్ వద్దకు ఎలా వచ్చారు, వారికి ఎవరు అనుమతి ఇచ్చారన్న దానిపై ఫిఫా దర్యాప్తు చేస్తోందని చెప్పారు.
"దీనిపై అంతర్గతంగా చర్యలు తీసుకుంటామని" తెలిపారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
సాల్ట్ బేకు విలాసవంతమైన హోటళ్లు ఉన్నాయి. మాంసానికి మసాలా దట్టించి తయారు చేయడంలో నుస్రత్ ప్రసిద్ధి. 2017 తర్వాత నుస్రత్ మాంసం వండే స్తైల్ ఇంటర్నెట్‌లో బాగా పాపులర్ అయింది.
మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, డేవిడ్ బెక్‌హామ్ సహా పలువురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు సాల్ట్ బే రెస్టారెంట్లలో ఆతిథ్యం స్వీకరించారు కూడా.
నవంబర్‌లో ప్రపంచ కప్ సందర్భంగా నుస్రత్ ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినోను ఆలింగనం చేసుకున్న వీడియోను పోస్ట్ చేశారు.
ఆ తరువాత, ఒక మ్యాచ్ సందర్భంగా జియాని ఇన్ఫాంటినో, బ్రెజిల్ లెజెండ్స్ రొనాల్డో, రాబర్టో కార్లోస్, కాఫులతో యన వీఐపీ సీట్లలో కూర్చున్న ఫొటోలు బయటికొచ్చాయి.
కాగా, ఫైనల్లో అర్జెంటీనా విజయం తర్వాత సాల్ట్ బే తన దగ్గరికి రావడానికి ప్రయత్నించినప్పుడు మెస్సీ ఆయనను పట్టించుకున్నట్టు కనిపించలేదు.

అఫ్గానిస్తాన్‌లో ఆందోళనలు చేస్తున్న అయిదుగురు మహిళలను, పలువురు జర్నలిస్టులను తాలిబాన్లు అరెస్టు చేశారు.
యూనివర్సిటీల్లో మహిళల ప్రవేశంపై తాలిబాన్ ప్రభుత్వం మంగళవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
దీనిపై బుధవారం మహిళలు యూనివర్సిటీల వద్ద ఆందోళనలు చేపట్టారు.
తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మహిళల విద్యపై విధించిన కొత్త నిబంధన ఇది. ఆ దేశంలో అనేక సెకండరీ పాఠశాలల్లో బాలికలకు ఇప్పటికీ ప్రవేశం లేదు.
యూనివర్సిటీల్లో మహిళల నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని తాలిబాన్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ మంత్రి తెలిపారు.
డ్రెస్ కోడ్ సరిగా పాటించనందుకే విద్యార్థినుల యూనివర్సిటీ ప్రవేశంపై నిషేధం విధించామని మంత్రి నేదా మహహ్మద్ నదీం అన్నారు.
"పెళ్లిళ్లకు తయారయి వచ్చినట్లు యూనివర్సిటీలకు వస్తున్నారని" ఆరోపించారు.
పరిస్థితులు చక్కబడే వరకు విద్యార్థినులకు యూనివర్సిటీలో ప్రవేశం సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గురువారం 20 మందికి పైగా అఫ్గాన్ మహిళలు హిజాబ్ ధరించి కాబూల్ వీధుల్లో ర్యాలీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారంతా బ్యానర్లు పట్టుకుని, నినాదాలు చేశారు.
అఫ్గాన్ మహిళలు ముందుగా కాబూల్ యూనివర్సిటీ ఎదుట గుమికూడాలని నిర్ణయించుకున్నారు కానీ, అధికారులు అక్కడ సెక్యూరిటీని పెంచడంతో వేరేచోట ఆందోళనలకు దిగారు.
నిరసనలు తెలుపుతున్న వారిని తాలిబాన్ మహిళా అధికారులు కొట్టారని వారు బీబీసీకి చెప్పారు.
చాలామందిని అరెస్టు చేశారు కానీ, ఇద్దరిని మాత్రమే విడుదల చేశారని నిరసనకారులు ఆరోపించారు.
తాలిబాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీల్లోని 50 మంది పురుష ప్రొఫెసర్లు రాజీనామా చేశారు.
మహిళలకు మద్దతుగా పలువురు పురుష విద్యార్థులు పరీక్షలను బాయ్ కాట్ చేశారు.