ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
కామన్వెల్త్ గేమ్స్ మహిళల టి20 క్రికెట్ ఈవెంట్‌లో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్ స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

ఫొటో సోర్స్, Alex Davidson/Getty Images
కామన్వెల్త్ గేమ్స్ మహిళల టి20 క్రికెట్ ఈవెంట్‌లో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్ స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.
దీంతో గ్రూప్ ‘ఎ’లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది.

ఫొటో సోర్స్, Alex Davidson/Getty Image
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. మునీబా అలీ సిద్ధిఖీ (32; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది.
భారత బౌలర్లలో రాధా యాదవ్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు తీయగా... షెఫాలీ వర్మ, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 100 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్ 11.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
షెఫాలీ వర్మ 19 పరుగులు చేయగా స్మృతి మంధాన అర్ధసెంచరీతో అలరించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు.
ప్రత్యర్థి బౌలర్లలో ఒమైమా సొహైల్, తుబా హసన్ చెరో వికెట్ తీశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Twitter/SAI
కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. ఈ విభాగంలో భారత్ మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 67 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ జెరెమీ లాల్‌రినుంగా విజేతగా నిలిచాడు. దీంతో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది.
స్నాచ్ విభాగంలో అత్యుత్తమంగా 140 కేజీలు ఎత్తిన జెరెమీ... క్లీన్ అండ్ జర్క్ కేటగిరీలో 160 కేజీల బరువునెత్తి ఓవరాల్‌గా 300 కేజీలతో అగ్రస్థానంలో నిలిచాడు.
స్నాచ్ తొలి ప్రయత్నంలో 136 కేజీలు, రెండో ప్రయత్నంలో 140 కేజీలు ఎత్తిన జెరెమీ మూడో ప్రయత్నంలో 143 కేజీలు ప్రయత్నించి విఫలమయ్యారు.
క్లీన్ అండ్ జర్క్ కేటగిరీలో తొలి ప్రయత్నంలో 154 కేజీలు, రెండో ప్రయత్నంలో 160 కేజీలు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డును నెలకొల్పారు. మూడో ప్రయత్నంగా 165 కేజీలు ఎత్తబోయి ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సమోవాకు చెందిన ఐయానె వెయ్‌పవా నెవో మొత్తం 293 కేజీలతో రజతాన్ని, నైజీరియాకు చెంది. ఉయోఫియా ఎడిడియోంగ్ జోసెఫ్ మొత్తం 290 కేజీలతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకున్నారు.
బర్మింగ్‌హామ్‌లో భారత్‌కు ఇప్పటివరకు లభించిన 5 పతకాలు వెయిట్ లిఫ్టింగ్‌లోనే రావడం విశేషం. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి.
కామన్వెల్త్ గేమ్స్‌లో 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. స్నాచ్ రౌండ్ తర్వాత చాను 12 కిలోల భారీ ఆధిక్యం సాధించింది.
ఈసారి చాను మొదటి నుంచి పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించింది. ఆమె మొత్తం 201 కిలోల బరువులను ఎత్తింది. స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కిలోలను ఎత్తగలిగింది. ఈ విభాగంలో రికార్డు కూడా సృష్టించింది మీరాబాయి.
తొలి ప్రయత్నంలోనే 84 కిలోల బరువును ఎత్తిన చాను, రెండో ప్రయత్నంలో 88 కేజీలతో వ్యక్తిగత అత్యుత్తమ రికార్డును సమం చేసింది.

ఫొటో సోర్స్, Twitter/Sanjay Raut
ముంబైలోని ములుంద్‌లో శివసేన నేత సంజయ్ రౌత్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం ఆదివారం ఉదయం దాడులు చేసింది.
ఆయనపై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపినట్టు పీటీఐ వెల్లడించింది.
'పత్రా చాల్ ల్యాండ్ భూమి' కేసులో ఈడీ చర్యలు తీసుకుంటోందని ఏఎన్ఐ తెలిపింది.
సంజయ్ రౌత్‌కు మద్దతుగా శివ్ సైనికులు ఆయన ఇంటి బయట గుమికూడి నినాదాలు చేశారు.
ఈడీ చర్యలను స్వాగతిస్తున్నామని బీజేపీ నేత కిరీట్ సోమయ్య అన్నారు.
మరో వైపు, తాను నిర్దోషినని, తన పోరాటం కొనసాగుతుందని, మహారాష్ట్ర, శివసేన మధ్య పోరు కొనసాగుతోందని చెబుతే సంజయ్ రౌత్ వరుస ట్వీట్లు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో మొక్కలను, వృక్షాలను పూజించే సంప్రదాయం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్లాలమ్మ గుడిలో అమ్మవారికి పూలు, పళ్లు నైవేద్యంగా సమర్పించేందుకు ఆన్యం శ్రీదేవి భర్తతో కలిసి వెళ్లారు. పక్షుల కిలకిలా రావాలు, చల్లని గాలి, భారీ వృక్షాలు, ప్రవహించే నీటి గల గలలతో ఆ అడవి వారికి స్వాగతం పలికింది.
"పిల్లలు లేని వారిక్కడకు వస్తే పిల్లలు పుడతారని చాలామంది నమ్ముతారు" అని శ్రీదేవి భర్త ఆన్యం రాంబాబు చెప్పారు. ఆయన ఈ గుడికి తరచుగా వస్తూ ఉంటారు.
ఈ గుడిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ప్రశాంత వదనంతో ఆసీనురాలైన చిన్న దేవతా విగ్రహం ఉంది. అమ్మవారికి పూలు, పళ్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూరుతాయని ఇక్కడికొచ్చే భక్తులు నమ్ముతారు. పల్లాలమ్మ దేవి ప్రకృతికి దగ్గరగా ఉండటంతో ఆమెను ప్రకృతి దేవత అని కూడా పిలుస్తారు.

ఫొటో సోర్స్, Getty Images, ANI, Reuters
సంకేత్ సర్గర్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి మొదటి పతకాన్ని అందించాడు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 55 కిలోల విభాగంలో మొత్తం 248 కిలోలు ఎత్తి రజత్ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
తరువాత వెయిట్ లిఫ్టింగ్ లోనే గురురాజ్ పూజారి 61 కేజీల విభాగంలో మొత్తం 269 కేజీలు ఎత్తి కాంస్య పతకాన్ని సాధించాడు. భారత్‌కు ఇది రెండో పతకం.
వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మహిళల 49 కిలోల విభాగంలో మొత్తం 201 కిలోలు ఎత్తి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇది భారత్‌కు మూడో పతకం. తొలి బంగారు పతకం కూడా.
స్నాచ్ రౌండ్ తరువాత చాను 12 కిలోల భారీ ఆధిక్యం సాధించింది. స్నాచ్‌లో 88 కిలోలు ఎత్తింది. క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కిలోలు ఎత్తి రికార్డు సృష్టించింది. ఈ విభాగంలో స్నాచ్ గేమ్స్ రికార్డు కూడా ఇదే.
వెయిట్ లిఫ్టర్ బిందియారాణి దేశానికి నాలుగో పతకం అందించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళల 55 కిలోల విభాగంలో మొత్తం 202 కిలోలు ఎత్తి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ బిందియారాణి దేశానికి నాలుగో పతకం అందించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళల 55 కిలోల విభాగంలో మొత్తం 202 కిలోలు ఎత్తి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
బిందియారాణి స్నాచ్‌లో 86 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కిలోలు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డు సృష్టించింది.
నైజీరియాకు చెందిన ఆదిజత్ ఒలారినోయ్ బిందియారాణి కంటే కేవలం ఒక కేజీ బరువు ఎక్కువ ఎత్తి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
బిందియారాణి దేవి మణిపూర్‌లోని ఓ రైతు కుటుంబంలో జన్మించింది. పతకం సాధించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, "ఇది నా తొలి కామన్వెల్త్ గేమ్స్. రికార్డుతో పాటు రజతం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 2008 నుంచి 2012 వరకు టైక్వాండో ఆడాను. కానీ, నా ఎత్తు వలన సమస్య రావడంతో వెయిట్ లిఫ్టింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. వెయిట్ లిఫ్టింగ్‌కు నా ఎత్తు అనువైనదని అందరూ చెప్పారు" అని చెప్పింది.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.