సాయి పల్లవి: 'నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు, హింస ఏ మతం పేరుతో జరిగినా తప్పే'

ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేసిన నటి సాయిపల్లవి తాను గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై వివరణ ఇచ్చారు. దాదాపు నాలుగు నిమిషాల ఈ వీడియోలో ఆమె హింస ఏ మతం పేరుతో జరిగినా తప్పేనని తాను చెప్పదలచుకున్నానని వివరించారు. తన మాటలను పూర్తిగా వినకుండానే కొందరు వివాదం రేపడం బాధ కలిగించిందన్నారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. లైవ్ అప్‌డేట్లను ముగిస్తున్నాం

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన తాజా అప్డేట్ల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.

  2. సాయి పల్లవి: 'నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు, హింస ఏ మతం పేరుతో జరిగినా తప్పే'

    సాయి పల్లవి

    ఫొటో సోర్స్, Saipallavi/Instagram

    సినీ నటి సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై వివరణ ఇచ్చారు. “నేను చెప్పిన మాటలకు వేరే అర్థం తీసుకున్నారు. దానికి వివరణ ఇవ్వాలని నాకు అనిపించింది. అయితే, ఇంత ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. ఆ ఇంటర్వ్యూలో 'మీరు లెఫ్ట్‌కు సపోర్టు చేస్తారా, రైట్ వింగ్‌కు సపోర్ట్ చేస్తారా' అని నన్నడిగారు. నేను తటస్థంగా ఉంటానని చాలా స్పష్టంగా చెప్పాను. ఏదైనా ఒక సంస్థతో ఐడెంటిఫై కావడానికన్నా ముందు మనం మంచి మనిషిగా, మానవత్వంతో ఉండాలని నేను కోరుకుంటాను” అని సాయిపల్లవి చెప్పారు.

    ఇన్‌స్టాలో, ట్విటర్‌లో ఆమె ఇంగ్లీషులో మాట్లాడుతూ ఈ వివరణ ఇచ్చారు. దాదాపు నాలుగు నిమిషాల వీడియోను విడుదల చేసిన సాయి పల్లవి, సమాజంలో అణచివేతకు గురవుతున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ కల్పించాలన్నదే తన భావమని చెప్పారు.

    “కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసిన తరువాత నాకు ఆ దర్శకునితో మాట్లాడే అవకాశం దొరికింది. అప్పట్లో అక్కడి ప్రజల దురవస్థను చూసి చాలా డిస్ట్రబ్ అయ్యానని ఆయనతో అన్నాను. ఒక మనిషిగా ఆ మారణహోమానికి సంబంధించిన విషాదాన్ని, ఆ ప్రభావానికి ఇప్పటికీ గురవుతున్న తరాల కష్టాలను నేను తక్కువ చేసి చూడలేను. అలాగే, కోవిడ్ సమయంలో జరిగిన మూక హత్యలను కూడా సమర్థించలేను. ఆ వీడియోను చూసి నేను చాలా కలత చెందాను. హింస ఏ రూపంలో ఉన్నా తప్పేనని నేను నమ్ముతాను. ఏ మతం పేరుతోనైనా హింస జరగడం సరైనది కాదు. ఇదే నేను చెప్పదలచుకున్నది” అని సాయి పల్లవి ఈ వీడియోలో వివరించారు.

    “కానీ, చాలా మంది ఆన్‌లైన్లో మూక దాడులను సమర్థించడం చాలా బాధాకరం. మనలో ఎవరికీ మరొకరి ప్రాణం తీసే హక్కు లేదు. ఒక మెడికల్ గ్రాడ్యుయేట్‌గా నేను అందరి ప్రాణాలూ ముఖ్యమేనని, అందరూ సమానమేనని భావిస్తాను” అని ఆమె అన్నారు.

    'విద్యార్థి జీవితమంతా ‘భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను’ అని పాడుతూ పెరిగాను. మతం, కులం, సంస్కృతి అంటూ మనుషుల్ని వేరు చేసి చూడకూడదు. నేను గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను పూర్తిగా చూడకుండానే కొందరు వాటి మీద విమర్శలు చేశారు. నేను ఏం తప్పు చేశానో తెలియక విస్తుపోవాల్సి వచ్చింది’ అని చెప్పిన సాయి పల్లవి, ఈ సమయంలో తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

    అందరూ శాంతి, ప్రేమలతో ఉండాలని ఆశిస్తున్నానని ఆమె తన వీడియోను ముగించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. బుల్డోజర్: భారతీయ ముస్లింలలో భయాన్ని పుట్టిస్తున్న మెషీన్

  4. అగ్నిపథ్ నిరసనలు - దామెర రాకేశ్: 'ఆందోళన చేస్తే కాల్చి చంపుతారా?' - కన్నీరుమున్నీరైన దబ్బీర్‌పేట

  5. రాష్ట్రపతి పదవికి పోటీ చేయనన్న ఫారూఖ్ అబ్దుల్లా

    ఫారూఖ్ అబ్దుల్లా

    ఫొటో సోర్స్, ANI

    జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దుల్లా కూడా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలవడానికి నిరాకరించారు.

    క్రియాశీలక రాజకీయాల్లో తాను ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్న ఫారూఖ్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్‌లో సున్నితమైన పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సందర్భంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అనుకుంటున్నానని శనివారం నాడు చెప్పారు.

    అంతకుముందు, నేషనలిస్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా తనకు రాష్ట్రపతి పదవి కోసం పోటీ పడేందుకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున తాను అభ్యర్తిగా ఉండబోనని శరద్ పవార్ చెప్పారు.

    రాష్ట్రపతి అభ్యర్థి విషయమైన త్వరలో శరద్ పవార్ నివాసంలో జరగబోయే సమావేశానికి ముందుగినే ఫారూఖ్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫారూఖ్ అబ్దుల్లా ప్రస్తుతం లోక్‌సభ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.

  6. లాహోర్‌లోని హిందువుల రాగి, ఇత్తడి వస్తువులతో తయారు చేసిన ఫిరంగులను అఫ్గాన్ పాలకులు ఎక్కడ ఉపయోగించారు?

  7. ఏపీలోనూ అగ్నిపథ్ టెన్షన్: విశాఖ రైల్వేస్టేషన్ మూసివేత, గుంటూరులో వందల మంది అరెస్ట్

    విశాఖలో పోలీసు బందోబస్తు

    సైన్యంలో తాత్కాలిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సాగుతున్న ఆందోళనల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనూ కనిపిస్తోంది.

    రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు అవకాశం ఉందనే అంచనాలతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్రం ఆదేశాలతో అదనపు బలగాలను రంగంలో దింపారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత ఏర్పాటు చేశారు.

    రైల్వే స్టేషన్ల వద్ద పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన స్టేషన్లలోనూ తనిఖీలు చేసి టికెట్లు ఉన్న ప్రయాణిలకును మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.

    విశాఖలో పోలీసు బందోబస్తు
    విశాఖలో పోలీసు బందోబస్తు

    విశాఖ, గుంటూరు నగరాల్లో శనివారం నిరసనలు జరిగే అవకాశం ఉందని పోలీసులకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో రెండు కేంద్రాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

    విశాఖ రైల్వే స్టేషన్‌ని ఉదయం నుంచి మూసివేశారు. ప్రయాణికుల రాకపోకలు కూడా నిలిపివేశారు. రైళ్లను దువ్వాడ మీదుగా మళ్లించారు. దాంతో విశాఖ రైల్వే స్టేషన్ బోసిపోయింది. పూర్తిగా పోలీసు బలగాల ఆధ్వర్యంలో కనిపించింది.

    గుంటూరులో కూడా రైల్వే స్టేషన్‌తో పాటు బస్‌స్టాండ్, ఇతర ప్రధాన కార్యాలయాల వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. అయినప్పటికీ కొందరు నిరసనలు తెలియజేందుకు యత్నించారు.

    గుంటూరు సహా పలు కేంద్రాల్లో 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    విశాఖలో పోలీసు బందోబస్తు
    గుంటూరులో పోలీసు బందోబస్తు

    పోలీస్ ఆంక్షలు ఉల్లంఘించి ఆందోళనకు పూనుకునేందుకు యత్నించిన వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్టు గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ ఎస్సీ ఆరిఫ్ ప్రకటించారు.

    తాడేపల్లిలోని సీఎం కార్యాలయం, విజయవాడ రైల్వే స్టేషన్ సహా పలు కార్యాలయాల వద్ద పోలీసుల గస్తీ ఏర్పాటు చేశారు. సీఎంవోకి వెళ్లే మార్గంలో అనుమానితులను పోలీసులు ప్రశ్నించి, ఆధారాలు చూపించిన తర్వాత అనుమతిస్తున్నారు.

    జాతీయ రహదారిపై కూడా పలు చోట్ల పోలీసు పహారా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ అదనపు బలగాలను రంగంలో దింపినట్టు డీజీపీ కార్యాలయం ప్రకటించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.

    శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనల నేపథ్యంలో అటు రైల్వే పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలతో పాటుగా ఏపీ పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమయింది.

    గుంటూరులో పోలీసు బందోబస్తు
  8. సహారన్‌పూర్: వైరల్ వీడియోలో పోలీసుల క్రూరత్వంపై బాధితులు ఏమంటున్నారు?

  9. అగ్నిపథ్: ‘నాలుగేళ్లు గడిచాక సైన్యం నుంచి పంపించేస్తే మేమేం చేయాలి’

  10. ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే

  11. వరంగల్ వెళ్తుండగా రేవంత్ రెడ్డి అరెస్ట్

    రేవంత్ రెడ్డి

    సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పులలో మరణించిన దామెర రాకేశ్ మృతదేహానికి నివాళులు అర్పించడానికి వరంగల్ వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

    రేవంత్‌ను ఘట్‌కేసర్ వద్ద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

    వరంగల్ బయలుదేరడానికి ముందు రేవంత్ హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.

    కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే యువకులు బలవుతున్నారని ఆయన ఆరోపించారు.

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కాల్పుల బాధితులను పరామర్శించకుండా అమిత్ షాను కలిసేందుకు వెళ్లారని రేవంత్ ఆరోపించారు.

  12. ఎవరీ ఆవుల సుబ్బారావు? సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ విధ్వంసంలో పోలీసులు ఆయన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు

  13. కాబుల్‌లోని ‘కర్‌తే పర్వాన్’పై దాడి, 30 మంది చిక్కుకుపోయినట్లు వార్తలు

    అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లోని ప్రముఖ గురుద్వారా కర్‌తే పర్వాన్ పరిసరాల్లో శనివాసం ఉదయం భీకర దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

    ఈ దాడులు ఎవరు చేశారన్నది ఇప్పటివరకూ తెలియరాలేదు.

    కానీ ఈ దాడుల వెనుక ఐసిస్ హస్తం ఉండచ్చని భావిస్తున్నారు.

    అఫ్గానిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పిన వివరాల ప్రకారం... గురుద్వారాపై కారు బాంబు దాడి జరిగింది.

    దాడి తర్వాత ఆకాశంలో పొగలు కనిపించాయి.

    మరోవైపు గురుద్వారా పరిసరాల్లో దాదాపు 30 మంది చిక్కుకుపోయి ఉన్నట్లు ఈ గురుద్వారా అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ రాయిటర్స్‌కు చెప్పారు.

    అయితే ఇప్పటివరకూ ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియలేదు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    తాలిబాన్ పాలకులు ఆ పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారని కూడా గుర్నామ్ సింగ్ చెప్పారు.

    అక్కడ బందీలుగా పట్టుకున్నవారిని గురుద్వారా రెండో అంతస్తులో ఉన్నారని సోషల్ మీడియాలో కొందరు చెబుతున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ఈ గురుద్వారాపై దాడి పట్ల భారత్ చాలా ఆందోళనగా ఉందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ చౌదరి చెప్పారు.

    భారత్ అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని.

    పూర్తి సమాచారం కోసం వేచిచూస్తోందని ఆయన చెప్పారు.

  14. పశువులకు పెట్టే రొట్టెలను పిల్లలకు ఎందుకు తినిపిస్తున్నారు

  15. జమ్ము కశ్మీర్: సబ్-ఇన్‌స్పెక్టర్‌ను కాల్చి చంపిన తీవ్రవాదులు

    జమ్ము కశ్మీర్ హింస

    ఫొటో సోర్స్, Getty Images

    జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో తీవ్రవాదులు ఒక పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను అతడి గ్రామంలో కాల్చి చంపారు.

    ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీస్ విభాగం కొద్ది సేపటి కిందట ట్విటర్‌లో వెల్లడించింది.

    లెత్పోరాలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ ఫరూక్ అహ్మద్ మిర్ మృతదేహం అతది ఇంటి సమీపంలోని పొలంలో కనిపించినట్లు ఆ ట్వీట్‌లో తెలిపారు.

    ఆయన శుక్రవారం సాయంత్రం తన వరి పొలంలో పని చేయటానికి వెళ్లారని, అక్కడ తీవ్రవాదులు ఆయనను పిస్టల్‌తో కాల్చి చంపారని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైనట్లు చెప్పింది.

    ఫరూక్ అహ్మద్ మిర్ పుల్వామా జిల్లాలోని పాంపోర్ తహశీల్ పరిధిలో గల సాంబురా గ్రామంలో నివసిస్తున్నారు.

    రాష్ట్రంలో ఇటీవలి నెలల్లో తీవ్రవాదులు కొంత మంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకున కాల్చి చంపుతున్న ఘటనలు గణనీయంగా పెరిగాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. బ్రేకింగ్ న్యూస్, అగ్నిపథ్ పథకం: పారా మిలటరీ దళాల్లో అగ్నివీర్‌లకు 10 శాతం రిజర్వేషన్ - కేంద్రం ప్రకటన

    పారా మిలటరీ

    ఫొటో సోర్స్, Getty Images

    భారత సైన్యంలో ఉద్యోగాల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకం ‘అగ్నిపథ్’ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రిత్వశాఖ శనివారం పలు కీలక ప్రకటనలు చేసింది.

    అస్సాం రైఫిల్స్ సహా పారామిలటరీ దళాల నియామకాల్లో 10 శాతం సీట్లను.. అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్లు సర్వీస్ పూర్తిచేసిన అగ్నివీర్‌ల కోసం రిజర్వు చేస్తున్నట్లు తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి కార్యాలయం ట్విటర్ హ్యాండిల్ పలు ట్వీట్లు చేసింది.

    అలాగే ఈ బలగాల్లో నియామకాలకు గరిష్ట వయో పరిమితిలో కూడా.. అగ్నివీర్‌లకు మూడేళ్లు సడలింపు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిపింది.

    అయితే, అగ్నిపథ్ పథకం తొలి బ్యాచ్ సైనికులకు మాత్రం ఈ వయో పరిమితి సడలింపు ఐదేళ్లుగా నిర్ణయించినట్లు చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  17. నరేంద్ర మోదీ: మాతృమూర్తి 100వ పుట్టిన రోజున తల్లి పాదాలు కడిగిన ప్రధాని

    తల్లి పాదాలు కడిగిన ప్రధాని మోదీ

    ఫొటో సోర్స్, ANI

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు తన తల్లి హీరాబెన్ మోదీ 100వ పుట్టిన రోజు సందర్భంగా అహ్మదాబాద్‌లో ఆమెను కలిశారు.

    ఈ సందర్భంగా ప్రధాని తన తల్లి పాదాలు కడిగి, ఆమె ఆశీస్సులు తీసుకున్నారు.

    మోదీ తల్లి హీరాబెన్ తన చిన్న కుమారుడు పంకజ్ మోదీతో కలిసి అహ్మదాబాద్‌లో నివసిస్తున్నారు.

    ప్రధాని మోదీ గుజరాత్ రాజధానిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనటానికి శుక్రవారం అహ్మదాబాద్ వచ్చారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. తెలంగాణ: పోలీసు కాల్పుల్లో యువకుడి మృతికి నిరసనగా నర్సంపేట బంద్, శుభం ప్రవీణ్ కుమార్, బీబీసీ కోసం

    నర్సంపేట బంద్

    సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం నాటి హింసాత్మక నిరసనలపై పోలీసులు జరిపిన కాల్పుల్లో దామెర రాకేశ్ అనే యువకుడు చనిపోయారు. ఆయన మృతదేహానికి శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

    రాకేశ్ మృతికి నిరసనగా శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో బంద్ చేపట్టాలని స్థానిక ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో శనివారం నర్సంపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు బంద్ నిర్వహిస్తున్నారు.

    రాకేశ్ మరణానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, బీజేపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన పేర్కొన్నారు.

    ఇదిలావుంటే.. పోలీసు కాల్పుల్లో చనిపోయిన రాకేశ్ కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించారు.

    నర్సంపేట బంద్
    నర్సంపేట బంద్
  19. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్.

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

  20. సాయి పల్లవి: 'నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు, హింస ఏ మతం పేరుతో జరిగినా తప్పే'