వరద బాధిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటన

ఫొటో సోర్స్, @TelanganaCMO
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం పర్యటన ఆలస్యంగా సాగుతోంది. ముందుగా అనుకున్నట్టుగా హెలికాప్టర్ లో కాకుండా రోడ్డు మార్గంలో బస్సులో కేసీఆర్ ప్రయాణిస్తున్నారు.
రాత్రి వరంగల్‌లో బస చేసిన కేసీఆర్ ఉదయాన్నే హెలికాప్టర్లో భద్రాచలం చేరుకుని, ఆ తరువాత అదే హెలికాప్టర్లో ఏటూరు నాగారం వెళ్లాల్సి ఉంది. అయితే వర్షం కురుస్తూండడం, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ప్రయాణంతో పాటూ, భద్రాచలంలో చేయాల్సిన ఏరియల్ సర్వేను కూడా రద్దు చేశారు అధికారులు.
వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో ఏటూరు నాగారం, ములుగుల్లో పర్యటిస్తూ అక్కడి వరద ప్రభావాన్ని తెలుసుకుంటున్నారు. అక్కడి నుంచి భద్రాచలం వైపు వస్తారు. భద్రాచలంలో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. గోదావరిని సందర్శిస్తారు.








