అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలిపోతాయి. ఇప్పటివరకు విడుదలైన ఫలితాల బట్టి ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యం సాధించింది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 91 స్థానాల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. అటు కాంగ్రెస్ 18 గెలిచింది. శిరోమణి అకాలీదళ్ 3 స్థానాలు, బీజేపీకి రెండు స్థానాల్లో విజయం సాధించాయి.
ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 స్థానాల్లో బీజేపీ 109 స్థానాల్లో విజయం సాధించి, మరో
143 స్థానాల్లో ముందంజలో ఉంది. అంటే బీజేపీ మొత్తం 252 స్థానాల్లో గెలిచేలా ఉంది.
ఎస్పీ రెండో స్థానంలో ఉంది. 32 స్థానాల్లో గెలిచి, మరో 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కేవలం ఒక్క సీటే గెలిచి, మరో స్థానంలో
ముందంజలో ఉంది.
మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 24 స్థానాల్లో విజయం సాధించి మరో 8 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలో
కాంగ్రెస్‌కు 4 స్థానాలు దక్కాయి. ఇక్కడ జేడీయూ 6 స్థానాల్లో విజయం సాధించింది.
ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 34 స్థానాల్లో విజయం సాధించి, మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు కాంగ్రెస్‌కు 19
స్థానాలు లభించేలా కనిపిస్తోంది. ఇక్కడ బీఎస్పీ 1 స్థానంలో గెలిచి మరో
నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది.
గోవాలో 40 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 20 స్థానాల్లో విజయం
సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలిచి, మరో సీటులో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించింది.