ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో బీజేపీకి భారీ మెజార్టీ, పంజాబ్‌లో ఆప్ క్లీన్‌స్వీప్
ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం నాలుగు దిక్కుల నుంచి బీజేపీకి లభించిన దీవెన అని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఫలితాల నుంచి తాము నేర్చుకుంటామని రాహుల్ గాంధీ అన్నారు. పంజాబ్‌లో 'ఆమ్ ఆద్మీ' క్లీన్ స్వీప్ చేసింది.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
రాత్రి 10 గంటల సమయానికి ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు
ఫొటో సోర్స్, https://results.eci.gov.in/
రాత్రి 10 గంటల సమయానికి ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ఫలితాలు తుది
దశలో ఉన్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ 232 స్థానాల్లో విజయం సాధించి, మరో 24 స్థానాల్లో
ఆధిక్యంలో ఉంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ 91 స్థానాల్లో గెలిచి, మరో 19 సీట్లలో
ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకుంది.
అప్నాదళ్ 12, బీఎస్పీ 1, జనసత్తా దళ్ లోక్‌తాంత్రిక్ 2, నిర్బల్ ఇండియన్ 6,
రాష్ట్రీయ లోక్‌దళ్ 8, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 6 స్థానాలు గెలుచుకున్నాయి.
మరోవైపు ఉత్తరాఖండ్‌లో బీజేపీ మొత్తం 48 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్
మొత్తం 18 స్థానాలు గెలుచుకునేలా ఉంది. రాష్ట్రంలో బీఎస్పీ 2, స్వతంత్రులు 2 స్థానాల్లో
విజయం సాధించారు.ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్. ధన్యవాదాలు.
‘ప్రజాతీర్పు శిరోధార్యం’- యూపీలోకాంగ్రెస్ ఓటమిపై ప్రియాంకా గాంధీ
ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో
పార్టీ బాధ్యతలు స్వీకరించిన ప్రియాంకా గాంధీ పార్టీ ఓటమి గురించి మాట్లాడుతూ ‘ప్రజల నిర్ణయం శిరోధార్యం’ అన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లలోనే గెలిచింది. రాష్ట్రంలో పార్టీ ఓటమిపై ప్రియాంకా గాంధీ ట్వీట్
చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
“ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పే శిరోధార్యం. మా కార్యకర్తలు, నేతలు కష్టపడ్డారు. ఒక్కటై ప్రజా సమస్యలపై పోరాడారు. కానీ, మేం మా కష్టాన్ని ఓట్లుగా మార్చుకోవడంలో విజయం సాధించలేకపోయాం. కాంగ్రెస్ పార్టీ సానుకూల ఎజెండాతో ముందుకెళ్లి ఉత్తర్‌ప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పోరాడే విపక్షంగా మా కర్తవ్యాన్ని పూర్తి బాధ్యతతో నిర్వహించడం కొనసాగిస్తుంది” అన్నారు.
మరోవైపు బీజేపీ నేత స్మృతి ఇరానీ ప్రియాంకాగాంధీ లక్ష్యంగా విమర్శలు సంధించారు.
“తమ తప్పుల నుంచి నేర్చుకునేంత బలం వారికి ఉందని నాకు అనిపించడం లేదు. నేర్చుకోకపోయినా, అది కాంగ్రెస్‌కు సంబంధించిన విషయం, మా పార్టీది కాదు. ప్రియాంకా జీ వస్తారు, పార్టీకి కొత్త ఊపిరులు ఊదుతారని ఉత్తర్‌ప్రదేశ్‌లో చెప్పుకున్నారు. అదిప్పుడు మొత్తం దేశానికి తెలుసు” అన్నారు.
యూపీ ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారు, మిగతా పార్టీలు ఓటమిని కప్పిపుచ్చుకుంటున్నాయి-అసదుద్దీన్
ఉత్తర్‌ప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ స్పందించారు. ఆ రాష్ట్ర ప్రజలు
బీజేపీని ఎన్నుకున్నారని అన్నారు.
మిగతాపార్టీలు తమ ఓటమిని కప్పిపుచ్చుకోడానికి
ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు.
“ఈవీఎంల తప్పు లేదని, జనాల మెదళ్లలోనే చిప్ వేసేశారని నేను 2019
నుంచి చెబుతున్నా, అది వాటి తప్పు కాదు”
అని ఒవైసీ అన్నారని ఏఎన్ఐ చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఎన్నికల్లో విజయానికి తమ పార్టీ కష్టపడిందని, కానీ ఫలితాలు తాము అనుకున్న విధంగా రాలేదని అసదుద్దీన్ చెప్పారు.
మేం రేపటి నుంచి మళ్లీ పని ప్రారంభిస్తాం. ఈసారీ మరింత మెరుగ్గా చేయగలమనే నేను అనుకుంటున్నా అన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో మైనారిటీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని ఎంఐఎం నేత ఆరోపించారు.
లఖీంపూర్ ఖీరీలో కూడా బీజేపీ గెలిచింది. అందుకే ఇది 80-20 విజయం అని చెబుతున్నా. ఈ 80-20 పరిస్థితి ఏళ్ల వరకూ ఉంటుంది. ప్రజలు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు.
4 రాష్ట్రాల్లో విజయం నాలుగు దిక్కుల నుంచి బీజేపీకి దీవెన- ప్రధాని మోదీ
ఫొటో సోర్స్, Twitter/@BJP4India
యూపీ అసెంబ్లీ
ఎన్నికల్లో భారీ విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని బీజేపీ ప్రధాన
కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన
ప్రజలకు, కార్యకర్తలకు తన కృతజ్ఞతలు తెలిపారు. పలు అంశాలపై మాట్లాడారు. .
యూపీ దేశానికి
ఎంతోమంది ప్రధానమంత్రులను ఇచ్చింది. యూపీలో 37 ఏళ్లలో ఏ
ప్రభుత్వమూ వరసగా రెండోసారి రాలేదు అని అన్నారు.
సరిహద్దు పక్కనే
ఉన్న ఒక పర్వత రాష్ట్రం, సముద్ర తీర రాష్ట్రం, గంగాదేవి ప్రత్యేక దీవెనలు ఉన్న ఒక
రాష్ట్రం, ఒక ఈశాన్య రాష్ట్రం రూపంలో బీజేపీకి నాలుగు దిక్కుల నుంచి ఆశీర్వాదం
లభించింది మోదీ అన్నారు.
యూపీ ప్రజలు మోదీని ఆశీర్వదించారు- బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా
ఫొటో సోర్స్, Twitter /BJP4India
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో
బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.
ఈ సందర్భంగా దిల్లీలోని బీజేపీ ప్రధాన
కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
నాలుగు రాష్ట్రాల్లో పార్టీ విజయం ప్రధాని మోదీ అమలు చేసిన కార్యక్రమాలు, విధానాలకు ఆమోద ముద్ర వేసిందని చెప్పారు.
ఈ ఫలితాలు మోదీ
నేతృత్వంలో భారత రాజకీయాలు ఏ దిశగా ముందుకెళ్తాయి అనేది నిర్దేశిస్తున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్ విషయానికి వస్తే నాలుగుసార్లు వరుసగా యూపీ ప్రజలు మోదీని
ఆశీర్వదించారు అని ఆయన అన్నారు.
“ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక పార్టీ వరసగా రెండుసార్లు విజయం
సాధించడం అనేది 37 ఏళ్ల తర్వాత మొదటిసారి జరుగుతోంది. ఇదే విధంగా ఉత్తరాఖండ్
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ ప్రతి ఎన్నికల్లో ప్రభుత్వం మారుతూ రావడం మనం
చూశాం. ఉత్తరాఖండ్ ప్రజలు మొదటిసారి వరుసగా రెండోసారి బీజేపీ ప్రభుత్వానికి ఓటు
వేశారు. మణిపూర్‌లో మొదటిసారి బీజేపీ ఆధిక్యంతో మా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు
చేస్తోంది. గోవా విషయానికి వస్తే మేం మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం” అని జేపీ నడ్డా అన్నారు.
ఎన్నికల్లో విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారంటే..
అయిదు రాష్ట్రాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి? ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు?
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలిపోతాయి. ఇప్పటివరకు విడుదలైన ఫలితాల బట్టి ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యం సాధించింది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
ఫొటో సోర్స్, Election Commission
ఫొటో క్యాప్షన్, పంజాబ్ ఫలితాలు
పంజాబ్
పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 91 స్థానాల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. అటు కాంగ్రెస్ 18 గెలిచింది. శిరోమణి అకాలీదళ్ 3 స్థానాలు, బీజేపీకి రెండు స్థానాల్లో విజయం సాధించాయి.
ఫొటో సోర్స్, Election Commission
ఫొటో క్యాప్షన్, ఉత్తర్‌ప్రదేశ్ ఫలితాలు
ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 స్థానాల్లో బీజేపీ 109 స్థానాల్లో విజయం సాధించి, మరో
143 స్థానాల్లో ముందంజలో ఉంది. అంటే బీజేపీ మొత్తం 252 స్థానాల్లో గెలిచేలా ఉంది.
ఎస్పీ రెండో స్థానంలో ఉంది. 32 స్థానాల్లో గెలిచి, మరో 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కేవలం ఒక్క సీటే గెలిచి, మరో స్థానంలో
ముందంజలో ఉంది.
ఫొటో సోర్స్, Election Commission
ఫొటో క్యాప్షన్, మణిపూర్ ఫలితాలు
మణిపూర్
మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 24 స్థానాల్లో విజయం సాధించి మరో 8 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలో
కాంగ్రెస్‌కు 4 స్థానాలు దక్కాయి. ఇక్కడ జేడీయూ 6 స్థానాల్లో విజయం సాధించింది.
ఫొటో సోర్స్, Election Commission
ఫొటో క్యాప్షన్, ఉత్తరాఖండ్ ఫలితాలు
ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 34 స్థానాల్లో విజయం సాధించి, మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు కాంగ్రెస్‌కు 19
స్థానాలు లభించేలా కనిపిస్తోంది. ఇక్కడ బీఎస్పీ 1 స్థానంలో గెలిచి మరో
నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది.
ఫొటో సోర్స్, Election Commission
ఫొటో క్యాప్షన్, గోవా ఫలితాలు
గోవా
గోవాలో 40 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 20 స్థానాల్లో విజయం
సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలిచి, మరో సీటులో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో విజయం తరువాత యోగి ఏమన్నారంటే..
ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో బీజేపీ మళ్లీ భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
విజయం ఖాయమైన తరువాత యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడారు.
ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ యోగి ఏమన్నారంటే..
"ప్రధాని మోదీ నాయకత్వంలో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. గౌరవనీయులైన ప్రధాన మంత్రికి, జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి, రక్షణ మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
దేశం, ప్రపంచం దృష్టి కూడా ఉత్తర్‌ప్రదేశ్‌పై ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ మెజారిటీని అందించినందుకు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. కార్యకర్తల కృషి వల్లే నేడు భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. ఓట్ల లెక్కింపు గురించి తప్పుడు ప్రచారం జరిగింది. కానీ ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు బీజేపీనే గెలిపించారు."
పంజాబ్ ప్రజలు బీజేపీని, కాంగ్రెస్‌ను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు - శరద్ పవార్
ఫొటో సోర్స్, ANI
ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి భారీ మెజారిటీ, పంజాబ్‌లో ఆప్ ఏకపక్ష విజయం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది.
మరోవైపు, వివిధ పార్టీల నుంచి ఎన్నికల ఫలితాలపై స్పందనలు వస్తున్నాయి.
పంజాబ్ ప్రజలు బీజేపీని, కాంగ్రెస్‌ను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.
పంజాబ్ రైతులు ప్రధాని మోదీ పట్ల కోపంగా ఉన్నారని పవార్, ఏఎన్‌ఐ వార్తా సంస్థతో అన్నారు
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, ఇందులో అఖిలేశ్ యావద్ తప్పు లేదని, ఆయన తన శక్తిని ఒడ్డి ఎన్నికల్లో పోరాడారని అన్నారు.
ఈ ఎన్నికల ఫలితాల గురించి అఖిలేశ్ ఎక్కువ ఆలోచించక్కర్లేదని, దేశంలో ఆయన స్థాయి ఇంతకన్నా ఎక్కువగా ఉందని అన్నారు. అఖిలేశ్ గత ఎన్నికల కన్నా మెరుగ్గా పోరాడారని పవార్ అన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందింది. 244 స్థానాల్లో ముందంజలో ఉంది. సమాజ్‌వాదీ పార్టీ 115 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ 44 స్థానాల్లో విజయం సాధించింది. 48 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధించి, 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
బీజేపీ విజయం దేశ ప్రజల విజయం-సోము వీర్రాజు
ఫొటో సోర్స్, UGC
బీజేపీ ఏపీ అధ్యక్షుడు
సోమువీర్రాజు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుండాన్ని దేశ ప్రజల
విజయంగా అభివర్ణించారు.
నాలుగు
రాష్ట్రాల్లో బీజేపీ విజయం దిశగా వెళ్తుండడంతో రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ విజయోత్సవాలు నిర్వహించింది.
“ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు
రాష్ట్రాల్లో విజయం సాధించాం. పంజాబ్‌లో కూడా ఓట్లు పెంచుకునే ప్రయత్నం చేశాం. ఇది
భారత ప్రజల విజయం” అని సోమువీర్రాజు అన్నారు.
బీజేపీ అభ్యర్థి చేతిలో మనోహర్ పారికర్ కొడుకు ఓటమి
ఫొటో సోర్స్, ANI
గోవా పణజి స్థానంలో మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ ఓటమి పాలయ్యారు.
ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ
చేసిన ఉత్పల్‌ను బీజేపీ అభ్యర్థి అతానాసియో మొనసెరెట్ ఓడించారు.
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం బీజేపీ
అభ్యర్థికి మొత్తం 6787 ఓట్లు రాగా, ఉత్పల్ పారికర్‌కు 6071 ఓట్లు వచ్చాయి. ఆయన
716 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
గోవాలో బీజేపీ అధిక్యం
40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో
బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధించింది. 15 స్థానాల్లో ముందంజలో ఉంది.
మరోవైపు 3 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో గెలిచారు, ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
ఎన్నికల్లో పార్టీ ఓటమిపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..
ఫొటో సోర్స్, Getty Images
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓటమిని అంగీకరించిన
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, విజయం సాధించిన పార్టీలకు శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ విజయం కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు
రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు.
"ఈ ఫలితాల నుంచి మేం నేర్చుకుంటాం. భారత ప్రజల
ప్రయోజనాల కోసం పనిచేయడం కొనసాగిస్తాం" అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఓటమి అంగీకరించిన చరణ్‌జీత్ సింగ్ చన్నీ, భగవంత్ మాన్‌కు అభినందనలు
ఫొటో సోర్స్, Getty Images
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ తన ఓటమి అంగీకరిస్తూ
ట్వీట్ చేశారు. విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
"పంజాబ్ ప్రజల తీర్పును, మేం వినయంగా స్వీకరిస్తున్నాం. ఆమ్
ఆద్మీ పార్టీకి అభినందనలు. ఆప్ ముఖ్యమంత్రి
అభ్యర్థి భగవంత్ మాన్‌కు కూడా అభినందనలు. భగవంత్ మాన్ ప్రజల అంచనాలు అందుకుంటారని
ఆశిస్తున్నాను" అన్నారు.
అంతకు ముందు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ తన
ఓటమిని అంగీకరిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.
సిద్దూ అమృత్‌సర్ ఈస్ట్ స్థానంలో ఓటమిపాలయ్యారు. ఆయనతోపాటూ
చరణ్‌జీత్ సింగ్ చన్నీ కూడా ఓడిపోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ విజయం, రాష్ట్రంలో బీజేపీ ముందంజ
ఫొటో సోర్స్, ani
హింగాంగ్ అసెంబ్లీ స్థానంలో మణిపూర్ సీఎం ఎన్.బిరేన్ సింగ్ విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థిపై 18,271 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించినట్లు ఏఎన్ఐ చెప్పింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరని ఒక జర్నలిస్ట్ ఆయన్ను ప్రశ్నించగా, దానిపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన
చెప్పారు.
"తుది ఫలితాలు రానివ్వండి. మాకు ఆధిక్యం లభిస్తుంది. ముఖ్యమంత్రి
నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. నా పని రాష్ట్రం కోసం పనిచేయడమే" అని బిరేన్ సింగ్ అన్నారు.
'నేను తీవ్రవాదిని కాదు, నిజమైన కొడుకునని దేశం చెప్పింది'- పంజాబ్ ఫలితాలపై కేజ్రీవాల్
ఫొటో సోర్స్, Getty Images
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా
దూసుకెళ్తోంది. దీనిపై తన మద్దతుదారులనుద్దేశించి ప్రసంగించిన పార్టీ
సుప్రీమో అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలు అద్భుతం చేశారన్నారు.
“పంజాబ్ మేమంతా నిన్ను
ప్రేమిస్తున్నాం. పంజాబ్ లోపల పెద్ద పెద్ద కుర్చీలు కదిలిపోయాయి. కెప్టెన్
ఓడిపోయారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఓడిపోయారు, ప్రకాశ్ సింగ్ బాదల్ ఓటమి పాలయ్యారు.
నవజ్యోత్ సింగ్ సిద్దూ ఓడిపోయారు. స్వతంత్రం వచ్చిన తర్వాత సిస్టమ్ మారకపోతే, ఏదీ
మారదు.. అని భగత్ సింగ్ ఒకసారి అన్నారు.” అని కేజ్రీవాల్ అన్నారు.
“గత 75 ఏళ్లుగా సిస్టమ్ మారలేదు.
వీరు ఉద్దేశపూర్వకంగా పేదలను ఉంచారు. మేం నిజాయితీ రాజకీయాలను ప్రారంభించాం. బాబా
సాహెబ్ అంబేడ్కర్, భగత్ సింగ్ కలలు నెరవేరుతున్నాయి. చాలా
పెద్ద పెద్ద శక్తులు కలిసి దేశాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని అనుకుంటున్నాయి.
ఆమ్ ఆద్మీకి వ్యతిరేకంగా అవి ఒక్కటయ్యాయి. పెద్ద పెద్ద కుట్రలు చేశాయి. కేజ్రీవాల్
తీవ్రవాది అన్నాయి. కేజ్రీవాల్ తీవ్రవాది కాదని, దేశానికి నిజమైన కొడుకని, దేశ భక్తుడని
ఫలితాల ద్వారా పంజాబ్ చెప్పింది” అని చెప్పారు.
నిరుద్యోగానికి వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పు ఇది, పంజాబ్‌లో భారీ ఆధిక్యంపై ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్
ఫొటో సోర్స్, Getty Images
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. తమ విజయాన్ని నిరుద్యోగానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన
తీర్పుగా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ వర్ణించారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయనివారిని కూడా తాము స్వాగతిస్తామని అన్నారు. తాను
పంజాబ్ ముఖ్యమంత్రి అవుతానని, తమకు ఓట్లు వేసినవారు, వేయనివారి పట్ల తమ ప్రభుత్వం
ఎలాంటి తేడాలూ చూడదని చెప్పారు.
“ప్రత్యర్థి
పార్టీల నేతలు అరవింద్ కేజ్రీవాల్‌పై, నాపై వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేశారు. అనరాని
మాటలు అన్నారు. వారి ఆ మాటలకు, వారికి అభినందనలు. వారిని క్షమించండి. కానీ ఇక
ముందు అందరూ పంజాబ్‌లోని 2 కోట్ల 75 లక్షల మంది పంజాబీలను గౌరవించాల్సుంటుంది.”
“మనమంతా కలిసి పంజాబ్‌ను నడుపుదాం.
ఇంతకు ముందు పంజాబ్‌లో పెద్ద పెద్ద తలుపులున్న ఇళ్ల నుంచి నడిచేది. కానీ ఇక నుంచి
పంజాబ్ గ్రామాల నుంచి నడుస్తుంది. పట్టణాల నుంచి నడుస్తుంది” అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
60 శాతం ఓట్లు లెక్కించడం ఇంకా మిగిలుంది-బీజేపీ ఆధిక్యంపై ఎస్పీ
ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ భారీ మెజారిటీతో
దూసుకెళ్తోంది. ఎన్నికల సంఘం వివరాల
ప్రకారం మొత్తం 403 స్థానాల్లో 255 సీట్లలో ఆ పార్టీ ముందంజలో ఉంది. సమాజ్‌వాదీ
పార్టీ 116 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఇప్పటివరకూ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ గురించి సమాజ్‌వాదీ పార్టీ ట్వీట్
చేసింది.
“ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్‌లో వంద
స్థానాల్లో 500 ఓట్లకు పైగా తేడా మాత్రమే ఉంది. ఎస్పీ కూటమి కార్యకర్తలు, నేతలు
అప్రమత్తంగా ఉండాలి. ఎస్పీ అభ్యర్థులు ముందంజలో ఉన్న అసెంబ్లీ స్థానాల వివరాలను
ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో చాలా మెల్లగా అప్‌డేట్ చేస్తోంది. అవి వెంటనే అప్‌డేట్
అయ్యేలా ఎన్నికల సంఘం చూడాలి” అని చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
“ఇంకా 60 శాతం ఓట్ల లెక్కింపు మిగిలుంది. వంద స్థానాల్లో తేడా ఇప్పటికీ 500 ఓట్లుగా ఉంది. మీరందరూ గట్టిగా నిలబడాలి. చివరి ఫలితం వచ్చేవరకూ అప్రమత్తంగా ఉండాలి. గోరఖ్‌పూర్ గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 32 వేల ఓట్ల లెక్కింపు పూర్తైంది. గాజీపూర్‌లో ఇప్పటివరకూ 16 వేల ఓట్లే లెక్కించారు. ఎస్పీ కూటమి లీడ్ ఉన్న స్థానాల్లో కౌంటింగ్ మెల్లగా సాగుతోంది. దీనిపై ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలి” అని ట్వీట్ చేసింది.
ఉత్తరాఖండ్‌లో స్పష్టమైన ఆధిక్యం దిశగా బీజేపీ
ఫొటో సోర్స్, ANI
70 సీట్లున్న
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీజేపీ 47 సీట్లతో ఆధిక్యంలో ఉంది.
ఎన్నికల కమిషన్
తాజా సమాచారం ప్రకారం, కాంగ్రెస్ 18 సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది. బీఎస్పీ రెండు
స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఓటింగ్ శాతం
విషయానికి వస్తే, బీజేపీకి 44 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 39 శాతం ఓట్లు
దక్కగా.. బీఎస్పీకి ఐదు శాతం ఓట్లు వచ్చాయి.
మరోవైపు ఆప్‌కు
3.5 శాతం ఓట్లు వచ్చాయి.
తర్వాత పీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథేనా? హేమా మాలిని ఏం అన్నారు
ఫొటో సోర్స్, Getty Images
ఉత్తరప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం కనబరచడంపై మథుర లోక్‌సభ ఎంపీ, సినీనటి హేమా మాలిని
మాట్లాడారు.
‘‘మహిళల జీవితాలకు యోగి ఆదిత్యనాథ్ భద్రత కల్పించారు. ఆయన
తీసుకొచ్చిన విధానాలు మంచి ఫలితాలను చూపిస్తున్నాయి. ఆయన చాలా అభివృద్ధి
కార్యక్రమాలను చేపట్టారు’’అని ఎన్‌డీటీవీతో ఆమె చెప్పారు.
‘‘ఇదివరకు స్టేజ్ దగ్గరకు మాట్లాడటానికి వెళ్లడం కష్టమయ్యేది.
అభిమానులు చాలా గందరగోళం సృష్టించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నేను
హాయిగా స్టేజీ మీదకు వెళ్లి మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు బృందావన్‌లో ఒక ఇల్లు
కూడా తీసుకున్నాను. దీంతో ఇక్కడకు రావడం పోవడం సులభమైంది’’అని ఆమె అన్నారు.
తర్వాత ప్రధాన మంత్రి యోగి ఆదిత్యనాథ్‌యేనా? అని విలేకరులు
ప్రశ్నించినప్పుడు.. ‘‘ఈ ప్రశ్నకు నేను ఇప్పుడే సమాధానం చెప్పలేను’’అని ఆమె
అన్నారు.
‘‘బీజేపీ సినిమా పరిశ్రమ లాంటిది కాదు. ఇక్కడ ఎవరి చోటు
వారికి ఉంటుంది. బీజేపీ అందరిది. ఇక్కడ ఎవరిపైనా వివక్ష ఉండదు’’అని ఆమె అన్నారు.
ఉత్తర్
ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమైనట్లు
కనిపిస్తోంది. గోరఖ్‌పుర్‌లో యోగి ఆదిత్యనాథ్ ఆధిక్యంలో ఉన్నారు.
మధ్యాహ్నం
ఒంటి గంట సమయంనాటికి తన సమీప ఎస్పీ ప్రత్యర్థి కంటే 15,000 ఓట్లు ఆదిత్యనాథ్‌కు
ఎక్కువగా వచ్చాయి. ఇదే నియోజకవర్గం నుంచి ఇదివరకు ఆయన పలుమార్లు గెలిచారు.
ఆదిత్యనాథ్‌పై
పోటీచేసిన దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్‌కు కేవలం 900 ఓట్లు మాత్రమే వచ్చాయి.
మరోవైపు
ఎస్పీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ తమ పార్టీ కంచుకోట కర్హల్‌లో విజయం సాధించే సూచనలు
కనిపిస్తున్నాయి.
ఓబీసీ
ఓట్లు తమ పార్టీ ఖాతావేయడంలో క్రియాశీలంగా పనిచేసిన సీనియర్ బీజేపీ నాయకుడు,
డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య.. వెనుకబడ్డారు. ఎస్పీ అభ్యర్థి పల్లవి పటేల్
కంటే ఆయనకు 2000 ఓట్లు తక్కువ వచ్చాయి.
మరోవైపు
ఇటీవల ఎస్పీలో చేరిన బీజేపీ మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యపై బీజేపీ అభ్యర్థి
సురేంద్ర కుమార్ కుశ్వాహా ఆధిక్యంలో ఉన్నారు.