రాత్రి 11.45 సమయానికి ఎన్నికల సంఘం మొత్తం 193 స్థానాల ఫలితాలు ప్రకటించింది.
మహాకూటమిలోని ఆర్జేడీ 62, కాంగ్రెస్ 16, సీపీఐ
ఎంఎల్ 9, సీపీఐ 2, సీపీఎం 2, స్థానాలు
గెలుచుకున్నాయి.
ఎన్డీయే కూటమిలోని బీజేపీ 55, జేడీయూ 33,
హిందుస్తానీ అవామ్ మోర్చా 3, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ 4 స్థానాలు
గెలుచుకున్నాయి.
అదే సమయానికి మొత్తం 50 స్థానాల్లో వివిధ పార్టీల అభ్యర్థులు
ఆధిక్యంలో ఉన్నారు. మహాకూటమిలోని ఆర్జేడీ 14, కాంగ్రెస్ 3, సీపీఐఎంఎల్ 3 స్థానాల్లో
ఆధిక్యంలో నిలిచాయి.
ఎన్డీయే కూటమిలోని బీజేపీ 18, జేడీయూ 10,
హిందుస్తానీ అవామ్ మోర్చా 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించి 1 సీటులో
ఆధిక్యంలో ఉండగా, బీఎస్పీ 1 స్థానంలో, ఎల్జేపీ 1 స్థానంలో విజయం సాధించాయి.
ఎన్డీయే 124 స్థానాలతో, మహాకూటమి 111 స్థానాలతో
కొనసాగుతున్నాయి.