బిహార్ ఎన్నికల ఫలితాలు: ఆర్‌జేడీ అతి పెద్ద పార్టీ.. రెండో స్థానంలో బీజేపీ... ఎన్‌డీఏ విజయం

బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల్లో 75 సీట్లు గెలుచుకున్న ఆర్‌జేడీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. 74 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. అయితే.. బీజేపీతో కూడిన ఎన్‌డీఏ కూటమి 125 స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని నిలుపుకుంది.

లైవ్ కవరేజీ

  1. ఎన్‌డీఏకు సంపూర్ణ ఆధిక్యం

    బిహార్‌ ఎన్నికల్లో ఎన్‌డీఏకు సంపూర్ణ ఆధిక్యం లభించింది. బీజేపీ మిత్ర పక్షాలకు 125 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 122/243 సీట్లు సరిపోతాయి. అయితే, అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయంటే...

    ఆర్జేడీ - 75

    బీజేపీ - 74

    జేడీయూ - 43

    కాంగ్రెస్ - 19

    సీపీఐ(ఎంఎల్) - 12

    హెచ్‌ఏఎం - 4

    ఎంఐఎం - 5

    సీపీఎం - 2

    సీపీఐ - 2

    బిహార్ ఎన్నికలు

    ఫొటో సోర్స్, EC

  2. ముందంజలో ఎవరున్నారు...

    ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బిహార్ ఎన్నికల్లో వినిధ పార్టీల ఆధిక్యాలు ఈ విధంగా ఉన్నాయి...

    బిహార్ ఎన్నికలు
  3. బిహార్ ఎన్నికల ఫలితాలు: రాత్రి 11.30కు వివిధ పార్టీల స్థితి

    ఎన్నికల ఫలితాలు

    ఫొటో సోర్స్, https://results.eci.gov.in/

    రాత్రి 11.45 సమయానికి ఎన్నికల సంఘం మొత్తం 193 స్థానాల ఫలితాలు ప్రకటించింది.

    మహాకూటమిలోని ఆర్జేడీ 62, కాంగ్రెస్ 16, సీపీఐ ఎంఎల్ 9, సీపీఐ 2, సీపీఎం 2, స్థానాలు గెలుచుకున్నాయి.

    ఎన్డీయే కూటమిలోని బీజేపీ 55, జేడీయూ 33, హిందుస్తానీ అవామ్ మోర్చా 3, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ 4 స్థానాలు గెలుచుకున్నాయి.

    అదే సమయానికి మొత్తం 50 స్థానాల్లో వివిధ పార్టీల అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మహాకూటమిలోని ఆర్జేడీ 14, కాంగ్రెస్ 3, సీపీఐఎంఎల్ 3 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి.

    ఎన్డీయే కూటమిలోని బీజేపీ 18, జేడీయూ 10, హిందుస్తానీ అవామ్ మోర్చా 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

    ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించి 1 సీటులో ఆధిక్యంలో ఉండగా, బీఎస్పీ 1 స్థానంలో, ఎల్జేపీ 1 స్థానంలో విజయం సాధించాయి.

    ఎన్డీయే 124 స్థానాలతో, మహాకూటమి 111 స్థానాలతో కొనసాగుతున్నాయి.

  4. ఒక స్థానంలో చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ విజయం

    చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది.

    ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ఎల్జేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.

    ఎన్నికల కమిషన్ జారీ చేసిన తాజా గణాంకాలలో చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించినట్లు కనిపిస్తోంది.

    ఎల్జేపీ

    ఫొటో సోర్స్, eci

  5. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ ఈసీకి ఆర్జేడీ, కాంగ్రెస్ ఫిర్యాదు

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో అర్జేడీ, కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లాయి.·

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రతినిధులు పట్నాలో ఎన్నికల కమిషన్ కార్యాలయం వెళ్లారని, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కౌంటింగ్‌ను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారని ఏఎన్ఐ చెప్పింది.

    ఆర్జేడీ ఆరోపణలకు సమాధానంగా "ఒక పార్టీ తాము 119 సీట్లను గెలిచినట్లు చెప్పిందని, కానీ ఇప్పటివరకూ 146 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు విజయం సాధించినట్లు ప్రకటించామని, మిగతా 97 స్థానాల్లో కౌంటింగ్ ఇంకా జరుగుతోందని" ఎన్నికల కమిషన్ చెప్పింది.

    "ఈసీ ఎన్నికల ప్రక్రియల ప్రకారమే పనిచేస్తోంది. ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ఎవరి ఒత్తిడికీ గురికాదు. కొన్ని ప్రాంతాల్లో తుది దశ ఓట్ల లెక్కింపు మిగిలింది. మొత్తం పరిస్థితిని కమిషన్ నిశితంగా పర్యవేక్షిస్తోంద"ని ఈసీ డిప్యూటీ కమిషనర్ చంద్రభూషణ్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్సులో.చెప్పారు.

    ఎన్నికల కమిషన్ రాత్రి 10 గంటల సమయానికి 146 స్థానాల ఫలితాలను ప్రకటించింది.

  6. ఆర్జేడీ ఆరోపణలను తోసిపుచ్చిన ఈసీ

    ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ఎవరి ఒత్తిడి కిందా పనిచేయలేదని ఈసీఐ సెక్రటరీ జనరల్ ఉమేష్ సిన్హా చెప్పారని ఏఎన్ఐ ట్వీటర్‌లో తెలిపింది.

    బీహార్ ఎన్నికల ఫలితాలను ప్రకటించడానికి అధికారులు, యంత్రాంగం నిజాయితీగా పనిచేస్తున్నారని పేర్కొంది..

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. ఎన్నికల్లో నితీశ్ మోసం చేశారని ఆర్జేడీ ఆరోపణ

    ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహా కూటమి 114 స్థానాల్లో, ఎన్డీయే 122 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

    ఇటు సీఎం నితీశ్ కుమార్ ఎన్నికల్లో మోసచేశారని ఆరోపిస్తూ ఆర్జేడీ ట్వీట్ చేసింది. మహా కూటమి అభ్యర్థులు 119 స్థానాల్లో గెలిచారని, వారికి రిటర్నింగ్ అధికారులు సర్టిఫికెట్ జారీ చేయలేదని ఆరోపించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    సీఎం నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల కుమార్ మోదీపై ఆర్జేడీ ఆరోపణలు చేసింది. జిల్లా కలెక్టర్లపై ఒత్తిడి తీసుకొచ్చిన వారు మహాకూటమిని ఎలాగైనా 105-110 సీట్ల దగ్గరే అడ్డుకోవాలని చూస్తున్నారని వరుస ట్వీట్లు చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 4

  8. ఈరోజు మా పార్టీకి చారిత్రక దినం - అసదుద్దీన్ ఒవైసీ

    ఒవైసీ సమావేశం

    ఫొటో సోర్స్, Getty Images

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లలో ఆధిక్యం సాధించడంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంతోషం వ్యక్తంచేశారు.

    ఈ రోజును చరిత్రాత్మక దినంగా అభివర్ణించిన ఆయన.. "బిహార్ ప్రజలు మమ్మల్ని ఓట్లతోనే కాదు, ప్రేమతో కూడా గెలిపించారు. బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాకు మాటలు చాలడం లేదు’’ అన్నారు.

    గ్రాండ్ డెమాక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో ఏర్పడిన కూటమిలో ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్‌పి లాంటి పార్టీలు ఉన్నాయి.

    ఈ కూటమిలో ఎంఐంఎం, బీఎస్పీ మాత్రమే ఆరు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

    తమ పార్టీ నుంచి బరిలో దిగిన 21 మంది అభ్యర్థుల్లో, ఐదుగురు విజయం సాధించారని, తమకు ఆదరణ లభించని ప్రాంతాలకు తాను మళ్లీ వెళ్తానని, అక్కడ తమ బలహీనతలను తెలుసుకుంటానని ఒవైసీ చెప్పారు.

    బిహార్‌లో మరింత పెద్ద రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

    అయితే, ఆర్జేడీకి మద్దతు ఇస్తారా? అనే ప్రశ్నకు ఆయన నేరుగా ఏ సమాధానం ఇవ్వలేదు.

  9. బిహార్ ఎన్నికల ఫలితాలు

    ఫలితాల సరళి

    ఫొటో సోర్స్, results.eci.gov.in

  10. బీజేపీ, ఆర్జేడీ హోరాహోరీ

    బీజేపీ, ఆర్జేడీ హోరాహోరీ

    ఫొటో సోర్స్, https://results.eci.gov.in/

    ఈసీ తాజా సమాచారం ప్రకారం బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించి 56 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    19 స్థానాల్లో విజయం సాధించిన ఆర్జేడీ కూడా 56 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది.

    10 సీట్లు గెలుచుకున్న జేడీయూ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధించి, 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  11. తేజస్వి , తేజ్ ప్రతాప్, జీతన్ రామ్ మాంఝీ విజయం

    తేజస్వి విజయం

    ఫొటో సోర్స్, Getty Images

    మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ రాధోపూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్‌పై 27,839 ఓట్ల తేడాతో గెలిచారు.

    ఆయన సోదరుడు ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ హసన్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి జేడీయూ అభ్యర్థి రాజ్ కుమార్ రాయ్‌పై 21,139 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

    ఇమామ్‌గంజ్ స్థానంలో హమ్ పార్టీ చీఫ్ మాజీ ముఖ్యమంత్ర జీతన్ రామ్ మాంఝీ ఆర్జేడీ అభ్యర్థి ఉదయ్ నారాయణ్ చౌధరిపై 16 వేలకు పైగా ఓట్లతో గెలిచారు.

    బంకీపూర్ స్థానంలో నటుడు శత్రుఘ్న్ సిన్హా కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి లవ్ సిన్హా 21 వేల సీట్లకు పైగా వెనకబడి ఉన్నారు.

    అటు బిహారీగంజ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సుభాషిణి శరద్ యాదవ్ 13 వేలకు పైగా ఓట్లతో వెనకబడ్డారు.

  12. ఎన్డీయే, మహా కూటమి హోరాహోరీ.. తగ్గిన వ్యత్యాసం

    తగ్గిన తేడా

    ఫొటో సోర్స్, Getty Images

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే 120 స్థానాల్లో మహాకూటమి 115 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.

    ఎన్డీయే కూటమి 11 స్థానాల్లో విజయం సాధించగా, మహాకూటమి 9 సీట్లలో గెలిచింది.

    గెలిచిన స్థానాలు, ప్రస్తుతం పార్టీల ఆధిక్యాన్ని బట్టి చూస్తే ఎన్డీయే కూటమి మహాకూటమి మధ్య వ్యత్యాసం తగ్గిపోయింది.

    అటు, ఎంఐఎం 1 స్థానంలో గెలిచి, నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాకూటమిలో ఉన్న బీఎస్పీ కూడా ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.

    లోక్ జన శక్తి పార్టీ ఎక్కడా ఆధిక్యంలో లేదు.

    సాయంత్రం ఐదున్నర వరకూ ఈవీఎం నుంచి 2.7 కోట్ల ఓట్లు లెక్కించామని ఈసీ ప్రెస్ కాన్ఫరెన్సులో చెప్పింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 4 కోట్ల ఓట్లు పోలయ్యాయి.

  13. బిహార్ తాజా ఫలితాలు

    బిహార్ ఫలితాలు
  14. బిహార్ ఫలితాలు: బీజేపీ కంటే ఆధిక్యంలో ఆర్జేడీ

    బిహార్ ఆర్జేడీ ఆధిక్యం

    ఫొటో సోర్స్, Getty Images

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

    ఈసీ తాజా సమాచారం ప్రకారం ఎన్డీయే కూటమి 9 స్థానాల్లో విజయం సాధించి, 114 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

    అటు 3 స్థానాల్లో విజయం సాధించిన మహా కూటమి 109 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    అయితే పార్టీల విషయానికి వస్తే బీజేపీ 67 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆర్జేడీ 72 సీట్లలో ముందంజలో ఉంది.

    ఎంఐఎం 5 స్థానాల్లో, బీఎస్పీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.

  15. ఆధిక్యం 100 కంటే తక్కువగా ఉన్న స్థానాలు

    బైకుంఠపూర్- బీజేపీ అభ్యర్థి 98 ఓట్లతో ఆధిక్యం

    బోధ్ గయ- బీజేపీ అభ్యర్థి 98 ఓట్ల ఆధిక్యం

    డెహరీ-ఆర్జేడీ అభ్యర్థి 81 ఓట్లతో ఆధిక్యం

    మధుబన్-బీజేపీ అభ్యర్థి 84 ఓట్లతో ఆధిక్యం

  16. బిహార్ ఎన్నికల కౌంటింగ్: ఫలితాలు వెల్లడైన స్థానాలు

    బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వెల్లడైన స్థానాల్లో విజేతల పేర్లను ఈసీ ప్రకటించింది.

    • అలీనగర్- మిశ్రీలాల్ యాదవ్(వీఐపీ) - ఎన్డీయే
    • ఔరంగాబాద్- ఆనంద్ శంకర్ సింగ్(కాంగ్రెస్)
    • దర్భంగా - సంజయ్ సరావగీ(బీజేపీ)
    • హయాఘాట్-రామచంద్ర ప్రసాద్(బీజేపీ)
    • కృషేశ్వర్ స్థాన్-శశిభూషణ్ హజారీ(జేడీయూ)
    • సాహెబ్‌పూర్ కమాల్-సతానంద్ సంబుద్ధా(ఆర్జేడీ)
    • సకరా-అనోక్ కుమార్ చౌధరి(జేడీయూ)

    (సోర్స్-ఎన్నికల కమిషన్)

  17. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం

    బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటూ 12 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

    • మధ్యప్రదేశ్ - (28 సీట్లు) బీజేపీ 1 విజయం, 19 ఆధిక్యం, కాంగ్రెస్ 7, బీఎస్పీ 1 ఆధిక్యం
    • గుజరాత్ - (8 సీట్లు) బీజేపీ 3 స్థానాల్లో విజయం, 5 ఆధిక్యం
    • ఉత్తరప్రదేశ్ - (7 సీట్లు)బీజేపీ 6, కాంగ్రెస్ 1 ఆధిక్యం
    • మణిపూర్ - (5 సీట్లు) బీజేపీ 3 విజయం, 1 ఆధిక్యం, ఇండిపెండెంట్ 1 ఆధిక్యం
    • ఒడిశా - (2 సీట్లు) బిజూ జనతాదళ్ 2 ఆధిక్యం
    • నాగాలాండ్ - (2 సీట్లు) ఎన్డీపీపీ 1, ఇండిపెండెంట్ 1 ఆధిక్యం
    • కర్ణాటక - (2 సీట్లు) బీజేపీ విజయం 1, ఆధిక్యం 1
    • ఝార్ఖండ్ - (2 సీట్లు) కాంగ్రెస్ 1, జేఎంఎం 1 ఆధిక్యం
    • ఛత్తీస్‌గఢ్ - 1 కాంగ్రెస్ ఆధిక్యం
    • హరియాణా - 1కాంగ్రెస్ విజయం
    • తెలంగాణ - 1 బీజేపీ ఆధిక్యం
  18. జేడీయూకు మొదటి విజయం, కుశేశ్వర్ స్థాన్‌లో కాంగ్రెస్‌పై గెలుపు

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో ఫలితం వెల్లడైంది.

    కుశేశ్వర్ స్థాన్ సీటును జేడీయూ గెలుచుకుంది.

    ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం జేడీయూ అభ్యర్ఖి శశి భూషణ్ హజారీ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అశోక్ కుమార్‌ను 7,222 ఓట్ల తేడాతో ఓడించారు.

    శశి భూషణ్ హజారీ ఈ స్థానంలో 2015లో కూడా విజయం సాధించారు. అప్పుడు ఆయన 19,850 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

    జేడీయూ విజయం

    ఫొటో సోర్స్, Getty Images

  19. బిహార్ ఎన్నికల ఫలితాలు: మరింత వెనుకంజలో మహా కూటమి

    వెనకబడిన మహా కూటమి

    ఫొటో సోర్స్, bbc

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి.

    ఎన్డీయే ఆధిక్యం 131 స్థానాలకు చేరగా, మహా కూటమి ఆధిక్యం 101 స్థానాలకు తగ్గింది. ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

    ఆర్జేడీ ఒక స్థానంలో విజయం సాధించింది.

  20. బిహార్ ఎన్నికల ఫలితాలు: దర్భంగ గ్రామీణంలో ఆర్జేడీ విజయం

    బిహార్ ఎన్నికల్లో తొలి నియోజకవర్గ ఫలితం వచ్చేసింది. దర్భంగా గ్రామీణంలో ఆర్జేడీ నాయకుడు లలిత్ కుమార్ గెలిచారు. జేడీయూ అభ్యర్థి ఫరాజ్ ఫాత్మిపై 2141 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు.

    లలిత్ కుమార్‌కు మొత్తంగా 64,929 ఓట్లు దక్కాయి. ఫరాజ్‌కు 62,788 ఓట్లు వచ్చాయి. మరోవైపు లోక్ జన శక్తి పార్టీ అభ్యర్థి ప్రదీప్ కుమార్‌కు 17,605 ఓట్లు వచ్చాయి.

    2015 ఎన్నికల్లోనూ ఇక్కడ లలిత్ కుమారే గెలిచారు.

    బిహార్ ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images