సౌదీలోని రియాద్ విమానాశ్రయంపై దాడి, 12 మంది మృతి

ఫొటో సోర్స్, Sofiane ALSAAR / AFP via Getty Images
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో కనీసం 12 మంది మరణించగా, 309 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.
యెమెన్‌కు చెందిన హూతీలు ఇలాంటి దాడులు చేసినట్లు ప్రకటించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరిగింది.
మృతుల్లో నలుగురు సౌదీ పౌరులు, బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు, అమెరికా, జోర్డాన్, పాలస్తీనా, సిరియా, సూడాన్, ఈజిప్టుకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని సౌదీ పౌర విమానయాన సంస్థ తెలిపింది.
ఈ దాడి నేపథ్యంలో కింగ్ ఖాలిద్ విమానాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేశారు.
హూతీలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించిన సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి.. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ దాడిని యుద్ధ నేరంగా అభివర్ణించింది.


