భారత్ జోడో యాత్ర: రాహుల్‌తో కలిసి నడుస్తుండగా క్షీణించిన ఆరోగ్యం, గుండెపోటుతో ఎంపీ మృతి

బీబీసీ కరెస్పాండెంట్ గుర్మీందర్ సింగ్ గ్రేవాల్ తెలిపిన వివరాల ప్రకారం, భారత్ జోడో యాత్రలో సంతోఖ్ సింగ్ నడుస్తుండగా ఆయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ అప్‌‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.

  2. సంక్రాంతి సంబరాలకు భీమవరం కేరాఫ్ అడ్రస్ అని ఎందుకు అంటారు?

  3. పుట్టుమచ్చలు, పులిపిర్లు పోవాలంటే ఏం చేయాలి?

  4. యుక్రెయిన్: యుద్ధ క్షేత్రంలో కొడుకు మృతదేహాన్ని ఈ తల్లి ఎలా కనిపెట్టారు?

  5. రాజమౌళి: ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ దేవుడు అన్న స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఎవరు

  6. సంక్రాంతి: ‘ఓటు ఉంటేనే బతికుంటాం... లేదంటే శవాలమే’... గంగిరెద్దుల కుటుంబాలపై గ్రౌండ్ రిపోర్ట్

  7. మిషన్ మజ్ను: ఈ భారతీయ సినిమా మీద పాకిస్తాన్ వాళ్లకు కోపం ఎందుకు?

  8. కర్ణ్‌ప్రయాగ్‌: జోషీమఠ్‌లాగే ఇక్కడా ఇళ్లకు పగుళ్లు... ఇళ్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు

  9. జల్లికట్టు: ఈ ఎద్దులు తన జీవితాన్నే మార్చేశాయంటున్న ట్రాన్స్‌జెండర్

  10. సంక్రాంతి: గంగిరెద్దులు ఆడించే సంచార జాతుల జీవిత కథ ఇది

  11. క్రైస్తవ మిషనరీలు మత మార్పిడుల కోసం బుద్ధుడి జన్మస్థలాన్ని టార్గెట్ చేశాాయా?

  12. భారత్ జోడో యాత్ర: రాహుల్‌తో కలిసి నడుస్తుండగా క్షీణించిన ఆరోగ్యం, గుండెపోటుతో ఎంపీ మృతి

    కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్

    ఫొటో సోర్స్, CH SANTOKH FACEBOOK

    ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్

    రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌధరీ కన్నుమూశారు.

    బీబీసీ కరెస్పాండెంట్ గుర్మీందర్ సింగ్ గ్రేవాల్ తెలిపిన వివరాల ప్రకారం, భారత్ జోడో యాత్రలో సంతోఖ్ సింగ్ నడుస్తుండగా ఆయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చింది.

    వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.

    జలంధర్ ఎంపీ అయిన సంతోఖ్ సింగ్ లూధియానాలో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

    ఎంపీ అనూహ్య మరణంతో యాత్రను నిలిపేశారు.

    ఈ రోజు యాత్రను నిలిపివేసినట్లు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఎంపీ సంతోఖ్ సింగ్ హఠాన్మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

    ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  13. సంతాన లేమి: పిల్లలు పుట్టకపోతే సమస్య ఎక్కడో ఎలా తెలుసుకోవాలి?

  14. బ్రేకింగ్ న్యూస్, అలీరెజా అక్బరీ ఉరితీత, ఇరాన్ అధికారిక మీడియా వెల్లడి

    అలీరెజా అక్బరీ

    ఫొటో సోర్స్, TWITTER

    బ్రిటిష్-ఇరానియన్ జాతీయుడు, ఇరాన్ మాజీ ఉప రక్షణ మంత్రి అలీరెజా అక్బరీని ఉరితీసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.

    గూఢచర్యం ఆరోపణలతో ఆయనకు ఇరాన్ మరణశిక్షను విధించింది.

    చివరి సారిగా ఆయనను చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు బుధవారం అనుమతిచ్చారు. తర్వాత ఆయనను మరో ప్రాంతానికి తరలించినట్లు ఆయన భార్య తెలిపారు.

    యూకేకు సమాచారం చేరవేరుస్తున్నారన్న ఆరోపణలతో 2019లో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

    ఉరిశిక్షను నిలిపివేయాలని, వెంటనే ఆయనను విడుదల చేయాలని ఇరాన్‌ను బ్రిటన్ కోరింది.

  15. న్యూజీలాండ్- భారత్ సిరీస్: పృథ్వీషా పునరాగమనం, ఆసీస్‌తో టెస్టు జట్టులో సూర్యకుమార్‌కు స్థానం

    సూర్యకుమార్ యాదవ్

    ఫొటో సోర్స్, ANI

    న్యూజీలాండ్‌తో వన్డే, టి20 సిరీస్‌లలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జనవరి 18 నుంచి ప్రారంభమయ్యే ఈ ద్వైపాక్షిక టోర్నీలో పాల్గొనేందుకు న్యూజీలాండ్, భారత్‌కు రానుంది.

    ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

    దీనితోపాటు ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

    ఈ టెస్టు సిరీస్‌కు సంబంధించి రెండు తొలి మ్యాచ్‌ల తేదీలతో పాటు జట్టును బీసీసీఐ ప్రకటించింది.

    సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు.

    మరోవైపు న్యూజీలాండ్‌తో జరిగే టి20 సిరీస్‌తో పృథ్వీషా జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు.దాదాపు ఏడాది తర్వాత అతను భారత జట్టులోకి వస్తున్నాడు.

    భారత వన్డే జట్టుకు రోహిత్, టి20 జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    న్యూజిలాండ్‌తో వన్డే జట్టు -రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.

    న్యూజిలాండ్‌తో టీ 20జట్టు - హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, యజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్.

    కుటుంబ కారణాలతో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ న్యూజిలాండ్ సిరీస్‌లో భాగం కావడం లేదు.

    ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 9 నుంచి మొదటి మ్యాచ్, ఫిబ్రవరి 17 నుంచి రెండో మ్యాచ్ జరుగుతుంది.

    ఆస్ట్రేలియాతో టెస్టు జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్

  16. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలతాజా అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

  17. మకరజ్యోతి నిజమా, కల్పితమా?