హాకీ వరల్డ్ కప్: తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌ మీద భారత్ గెలుపు

బిర్సా ముండా స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-0 స్కోరుతో స్పెయిన్‌ను ఓడించింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. ఒడిశా: అదృశ్యమైన మహిళా క్రికెటర్.. మృతదేహంగా లభ్యం, భువనేశ్వర్ నుంచి సందీప్ సాహు, బీబీసీ కోసం

    మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్

    ఫొటో సోర్స్, Biswaranjan Mishra

    ఒడిశాలో అదృశ్యమైన మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ (26) రెండు రోజుల తర్వాత శవమై చెట్టుకు వేలాడుతూ కనిపించారు.

    రాజశ్రీ బుధవారం నాడు కటక్ నగరంలోని ఓ హోటల్ వద్ద చివరిసారిగా కనిపించారు. శుక్రవారం ఉదయం కటక్ జిల్లాలోని గుర్డి జాటియా అడవి సమీపంలో రాజశ్రీ స్కూటీ, హెల్మెట్ కనిపించాయి.

    ఆ తర్వాత పోలీసులు అడవిలోకి ప్రవేశించి చెట్టుకు వేలాడుతున్న రాజశ్రీ మృతదేహాన్ని గుర్తించారు.

    మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ స్కూటీ

    ఫొటో సోర్స్, Biswaranjan Mishra

    పుదుచ్చేరిలో జరగనున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు సీనియర్ మహిళల జట్టులోకి ఎంపిక కాకపోవడంతో రాజశ్రీ తీవ్ర షాక్‌కు గురైందని చెబుతున్నారు.

    కటక్‌లో జరుగుతున్న 25 మంది ఆటగాళ్ల ఎంపిక శిబిరంలో ఆమె పాల్గొన్నారు. అయితే మంగళవారం ప్లేయర్స్ జాబితా విడుదల చేయగా అందులో రాజశ్రీ పేరు లేదు.

    ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ), మహిళా క్రికెట్ జట్టు కోచ్ పుష్పాంజలి బెనర్జీపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. చేపలు తిన్నాక పాలు తాగితే చర్మంపై మచ్చలు వస్తాయా?

  4. హాకీ వరల్డ్ కప్: స్పెయిన్‌ మీద భారత్ గెలుపు

    భారత హాకీ జట్టు

    ఫొటో సోర్స్, Getty Images

    ఒడిషాలో జరుగుతున్న హాకీ ప్రపంచ కప్ టోర్నమెంటులో స్పెయిన్ మీద భారత్ గెలిచింది.

    రూర్కెలాలోని బిర్సా ముండా స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-0 స్కోరుతో స్పెయిన్‌ను ఓడించింది.

    ఈ టోర్నీలో గ్రూప్-డిలో ఆడుతున్న భారత్‌కి ఇది తొలి మ్యాచ్.

    మ్యాచ్‌లో భారత ప్లేయర్ అమిత్ రోహిదాస్ మొదటి క్వార్టర్‌లో తొలి గోల్ చేశాడు.

    రెండో క్వార్టర్‌లో హార్దిక్ సింగ్ మరో గోల్ చేశాడు. దీంతో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

    మూడు, నాలుగో క్వార్టర్లలో కూడా భారత్ ఆటగాళ్లు స్పెయిన్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. సానియా మీర్జా: టెన్నిస్‌కు ‘కన్నీటి వీడ్కోలు’ చెప్పిన భారత స్టార్ ప్లేయర్

    సానియా మీర్జా

    ఫొటో సోర్స్, Getty Images

    భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.

    తన చివరి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ ఓపెన్ తర్వాత టెన్నిస్ ఆడబోనని ఆమె తెలిపారు.

    ఈ విషయాన్ని సానియా మీర్జా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆమె.. 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని నాసర్ స్కూల్‌కి చెందిన తను ఆరేళ్ల వయసులో తల్లితో కలిసి మొదటిసారి నిజాం క్లబ్‌లోని టెన్నిస్ కోర్టుకు వెళ్లానని సానియా తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    టెన్నిస్ నేర్చుకునేందుకు కోచ్‌తో పోరాడినట్లు ఆమె చెప్పారు. కలను సాధించడానికి పోరాటం ఆరేళ్ల వయస్సులో ప్రారంభమైందని సానియా తెలిపారు.

    ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ ఒక రోజు గ్రాండ్‌స్లామ్‌ ఆడి దేశానికి అత్యున్నత స్థాయిలో కీర్తిని తీసుకురావాలని కలలు కన్నానని చెప్పారు సానియా.

    మార్టినా హింగిస్, సానియా మీర్జా

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, మార్టినా హింగిస్, సానియా మీర్జా జోడీ 2015లో వింబుల్డన్ డబుల్స్ టైటిల్ గెలిచారు

    "ఇప్పుడు నేను నా కెరీర్‌ను తిరిగి చూసుకుంటే, 50 గ్రాండ్‌స్లామ్‌లు ఆడటమే కాదు, దేవుడి దయతో వాటిలో కొన్నింటిని గెలుచుకునే అదృష్టం కలిగింది’’ అని సానియా ట్విట్టర్‌లో పోస్టు చేసిన లేఖలో పేర్కొన్నారు.

    ‘‘నా దేశం కోసం పతకం గెలవడం గొప్ప గౌరవం. త్రివర్ణ పతాకం ఎత్తుకు ఎగురుతున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు తను సాధించిన ఘనతకు గౌరవం ఇస్తున్నారని తెలిసి పోడియంపై నిల్చోవడం కృతజ్ఞతగా భావిస్తున్నా’’ అన్నారు.

    ‘‘నేను ఈ లేఖ రాసేటప్పుడు నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి" అని సానియా చెప్పారు.

  6. యుక్రెయిన్‌లో ఉప్పు నగరాన్ని స్వాధీనం చేసుకున్నామన్న రష్యా

    రష్యా - యుక్రెయిన్ యుద్ధం

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌లోని సోలెడార్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించింది. సోలెడార్ ఉప్పు తవ్వకాలకు ప్రసిద్ధి.

    ఈ విజయం సమీపంలోని పెద్ద నగరమైన బఖ్‌ముట్‌లో యుక్రేనియన్ సరఫరా మార్గాలను తమ దళాలు నిలిపివేయడానికి వీలు కల్పిస్తుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

    సోలెడార్

    ఫొటో సోర్స్, MAXAR TECHNOLOGIES

    అయితే సోలెడార్‌లో ఇంకా పోరాటం కొనసాగుతోందని యుక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా తప్పుడు సమాచారం అందించిందని ఆరోపించారు.

    ఇప్పటికీ 15 మంది పిల్లలతో సహా 559 మంది నగరంలో ఉన్నారని అక్కడి గవర్నర్ పావ్లో కిరిలెంకో తెలిపారు. సోలెడార్‌లో కొద్ది రోజులుగా సాగిన యుద్ధం అత్యంత రక్తపాత ఘటనల్లో ఒకటిగా నిలిచింది.

    సోలెడార్ స్వాధీనం రష్యాకు పెద్ద ఘనత కాకపోయినా గత కొన్ని నెలల పరిస్థితి అంచనా వేస్తే ఈ విజయం మాస్కోకు గొప్పదిగానే కనిపిస్తోంది.

    యుక్రెయిన్ యుద్ధం మ్యాప్
  7. జోషీమఠ్‌: 12 రోజుల్లో 5.4 సెంటీమీటర్లు కుంగిన నేల.. ఇస్రో శాటిలైట్ సమాచారం వెల్లడి

  8. కోవిడ్: చైనాలో 90 కోట్ల మందికి సోకిన కరోనావైరస్

    చైనా కోవిడ్

    ఫొటో సోర్స్, EPA

    చైనాలో ఈ జనవరి 11 వరకు దాదాపు 90 కోట్ల మంది జనం కోవిడ్ బారిన పడ్డారని పెకింగ్ యూనివర్సిటీ తన అధ్యయనంలో తెలిపింది.

    దేశ జనాభాలో 64 శాతం మందికి వైరస్ సోకిందని ఈ రిపోర్టు ద్వారా స్పష్టమవుతోంది. గన్సు ప్రావిన్స్‌‌లో 91 శాతం మందికి, యునాన్‌లో 84 శాతం మందికి, కింగ్ హై‌లో 80 శాతం మందికి కరోనా సోకినట్లు రిపోర్టు చెప్పింది.

    చాంద్రమాన కొత్త సంవత్సరంలో చైనాలోని గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు మరింతగా పెరుగుతాయని చైనాకు చెందిన టాప్ ఎపిడెమియాలజిస్ట్ (సాంక్రమిక వ్యాధుల నిపుణుడు) హెచ్చరించారు.

    చైనా కోవిడ్

    ఫొటో సోర్స్, MARK R CRISTINO/EPA-EFE/REX/SHUTTERSTOCK

    చైనా కోవిడ్ వేవ్ గరిష్ట స్థాయి రెండు నుంచి మూడు నెలల వరకు ఉంటుందని భావిస్తున్నట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మాజీ హెడ్ జెంగ్ గువాంగ్ తెలిపారు.

    చైనా ప్రజలు లక్షలాది మంది 23 జనవరి చాంద్రమాన కొత్త సంవత్సరం సందర్భంగా తమ సొంత గ్రామాలకు వెళుతున్నారు.

    జీరో కోవిడ్ నిబంధనలు సడలించినప్పటి నుంచి చైనా కరోనా కేసుల గణాంకాలను వెల్లడించడం నిలిపివేసింది.

  9. గంగా విలాస్ క్రూయిజ్: డిజైన్ చేసింది తెలుగు మహిళ.. మోదీ ప్రారంభించిన ఈ షిప్‌‌ ప్రత్యేకతలేమిటి? విమర్శలు ఎందుకు?

  10. సౌదీ అరేబియా: ప్రేయసితో రోనాల్డో సహజీవనానికి ‘షరియా’ నుంచి మినహాయింపు ఇస్తారా?

  11. వాల్తేరు వీరయ్య: తన ‘మానసిక పరిస్థితి బాగోలేద’న్న వదంతులపై శ్రుతి హాసన్ ఫైర్

    చిరంజీవి, శృతి హాసన్

    ఫొటో సోర్స్, @MythriOfficial

    సినీ నటి శ్రుతి హాసన్ మానసిక పరిస్థితి బాగోలేనందున ఆమె వాల్తేరు వీరయ్య ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరుకాలేదని సోషల్ మీడియాలో వదంతులు వచ్చాయి.

    అయితే ఈ వదంతులపై తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ వేదికగా శ్రుతీ హాసన్ స్పందించారు. జ్వరం కారణంగానే వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు రాలేకపోయానని ఆమె స్పష్టంచేశారు.

    ‘‘అవాస్తవాలు ప్రచారం చేసి వాటికి నాటకీయత జోడించడం ద్వారా జనం తమ మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటానికి భయపడుతారనుకుంటున్నారా? నా విషయంలో అలా ఎప్పటికీ జరగదు’’ అని కౌంటర్ ఇచ్చారు. ‘‘ఒకవేళ మీకు అలా అనిపిస్తే థెరపిస్టులను కలవండి’’ అని చురకలంటించారు శ్రుతి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    తన మానసిక ఆరోగ్యం, తన గురించి ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటానని ఆమె తెలిపారు. తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని శ్రుతి హాసన్ చెప్పారు.

    మెగాస్టార్ చిరంజీవి, రవితేజలు నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా శుక్రవారం నాడు థియేటర్లలో విడుదలైంది.

  12. ఎల్విస్ ప్రెస్లీ కూతురు లిసా మేరీ ప్రెస్లీ మృతి

    లిసా మేరీ ప్రెస్లీ

    ఫొటో సోర్స్, REUTERS

    అమెరికాలో రాక్ అండ్ రోల్ స్టార్ ఎల్విస్ ప్రెస్లీ కుమార్తె లిసా మేరీ ప్రెస్లీ (54) మరణించారు. ఈ విషయాన్ని ఆమె తల్లి ప్రిస్సిల్లా ప్రెస్లీ ప్రకటించారు.

    లిసా ప్రెస్లీ గాయని. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో గురువారం ఆస్పత్రికి తరలించారు. ఆమె గుండెపోటుతో మరణించినట్లు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    కాలిఫోర్నియాలోని తన ఇంట్లో లిసా అపస్మారక స్థితిలో కనిపించినట్లు అమెరికన్ న్యూస్ వెబ్‌సైట్ టీఎంజెడ్ తన కథనంలో పేర్కొంది.

    లిసా చాలా ఉత్సాహంగా ఉండే దృఢమైన మహిళ అని ఆమె తల్లి చెప్పారు. అయితే లిసా మరణానికి కారణాలను ఆమె తల్లి వెల్లడించలేదు.

    ఎల్విస్, ప్రిసిల్లా దంపతులకు లిసా మేరీ 1968లో జన్మించారు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఎల్విస్, ప్రిసిల్లా దంపతులకు లిసా మేరీ 1968లో జన్మించారు

    లిసా ప్రెస్లీ 1968లో జన్మించారు. ఆమె కూడా తన తండ్రిలాగే సంగీతాన్ని తన వృత్తిగా చేసుకున్నారు. లిసా మూడు ఆల్బమ్‌లు రూపొందించారు. 2003లో విడుదలైన ఆమె మొదటి ఆల్బమ్ ప్రజాదరణ పొందింది.

    లిసా మేరీ 1990ల్లో పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత నటుడు నికోలస్ కేజ్, అనంతరం మ్యుజిషియన్ కియోఫ్, నాలుగోసారి మైఖేల్ లాక్‌వుడ్‌లను చేసుకున్నారు.

    నటి రిలే కీఫ్‌తో సహా లిసాకు నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రెస్లీ కుమారుడు బెంజమిన్ కీఫ్ 2020లో ఆత్మహత్య చేసుకున్నారు.

    లిసా మేరీ ప్రెస్లీ చివరిసారిగా మంగళవారం రాత్రి బెవర్లీ హిల్స్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో పాల్గొన్నారు.

    లిసా మేరీ ప్రెస్లీ, మైఖేల్ జాక్సన్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, లిసా మేరీ ప్రెస్లీ 1990లలో మైఖేల్ జాక్సన్‌ను పెళ్లాడారు
  13. టాటా నానో: కొత్త ఎలక్ట్రిక్ కారుతో రతన్ టాటా కల ఇప్పటికైనా నెరవేరుతుందా?

  14. రోడ్డు ప్రమాదాలను తగ్గించే హమ్‌సఫర్ యాప్‌కు పెరుగుతున్న ఆదరణ

  15. జనవరి 31 నుంచి పార్లమెంట్ 2023 బడ్జెట్ సమావేశాలు

    పార్లమెంట్

    ఫొటో సోర్స్, ANI

    పార్లమెంట్ 2023 బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు.

    ఈ సమావేశాలు ఏప్రిల్ 6 వరకు కొనసాగనున్నాయని తెలిపారు.

    విరామ కాలంతో పాటు 66 రోజుల్లో 27 సార్లు పార్లమెంట్ సమావేశమవుతుంది.

    ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకు పార్లమెంట్ సమావేశాలకు విరామం ఉంటుందని ప్రహ్లాద్ జోషి ట్వీట్‌లో చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. పంజాబ్‌: మద్యం ఫ్యాక్టరీ మూసివేతకు రైతుల ఆందోళన

  17. బ్రిటన్: మేకప్ ప్రొడక్టులలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాల వాడకం

    మేకప్

    ఫొటో సోర్స్, Getty Images

    యూకేలో విక్రయించే చాలా మేకప్ ప్రొడక్టులలో ‘ఫరెవర్ కెమికల్స్’ వాడుతున్నట్టు బీబీసీ న్యూస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది.

    కాస్మోటిక్స్ తయారీ కంపెనీ అర్బన్ డికే, రివాల్యుషన్, ఇంగ్లెట్‌లు యూకేలో విక్రయిస్తున్న తమ మేకప్ ప్రొడక్టులలో ఈ రసాయనాలను వాడుతున్నట్టు బీబీసీ కనుగొంది.

    ఈ రసాయనాలనే పీఎఫ్ఏఎస్ అని కూడా పిలుస్తారు. ఇవి క్యాన్సర్ లేదా ఇతర ప్రమాదకర వ్యాధులకు కారకమవుతాయి.

    యూకేలో ఇవి అక్రమం కానప్పటికీ, ఐదు యూరోపియన్ దేశాలు మాత్రం యూరప్ వ్యాప్తంగా వీటిని నిషేధించాలని ప్రతిపాదించే అవకాశం ఉంది.

    లోరియల్

    ఫొటో సోర్స్, Getty Images

    అర్బన్ డికే అనేది లోరియల్ సబ్సిడరీ. ఈ రసాయనాలను తొలగించే ప్రక్రియలో ఉన్నట్టు లోరియల్ బీబీసీకి తెలిపింది.

    పీఎఫ్ఏఎస్ అంటే పాలీ అండ్ పర్‌ఫ్లోరోఅల్కైల్ పదార్థాలు. మేకప్ ఎక్కువ సమయం పాటు ఉండేందుకు ప్రొడక్టులలో దీన్ని వాడతారు.కానీ ఆరోగ్యంపై ఇది చూపే ప్రభావంతో, కొన్ని బ్రాండ్లు దీన్ని వాడటం లేదు. బ్రిటన్‌లో చాలా ఉత్పత్తులలో ప్రస్తుతం పీఏఎఫ్ఎస్ కెమికల్‌ను గుర్తించారు.

  18. దేవికా రాణి: బాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన ఈ ‘ముద్దు సీన్’ చుట్టూ అల్లుకున్న కథలేంటి?

  19. చలి తీవ్రతకు ఉత్తరాది రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగులు

    చలిగాలులు

    ఫొటో సోర్స్, ANI

    ఉత్తరాదిన చలి తీవ్రత పెరగడంతో ఉత్తర ప్రదేశ్‌లోని లఖ్‌నవూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరిగింది. శ్వాసకోశ సంబంధ సమస్యలతో రోగులు ఆసుపత్రులలో చేరుతున్నారు.

    లఖ్‌నవూ కేజీఎంయూ, లోహియా, సివిల్ హాస్పిటల్‌లలో శ్వాసకోశ సమస్యతో చేరిన రోగులు 50 శాతం నుంచి 60 శాతం పెరిగినట్టు ఏఎన్ఐ రిపోర్టు చేసింది.

    చాలామంది ప్రజలు గుండెపోటు వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నట్టు ఆరోగ్య నిపుణులు చెప్పారు. చలుల తీవ్రత పెరగడంతో శ్వాసకోశ సంబంధ రోగుల సంఖ్య భారీగా పెరిగినట్టు తెలిపారు.

    సరిగ్గా గాలి తీసుకోలేకపోవడం, దగ్గు, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు పేషెంట్లలో కనిపిస్తున్నట్టు సివిల్ హాస్పిటల్ డాక్టర్ ఒకరు చెప్పారు.

  20. వాల్తేరు వీర‌య్య మూవీ రివ్యూ: బాసు, గ్రేసు బాగున్నాయి, కానీ....