You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రష్యాలో బలవంతపు సైనిక సమీకరణ.. పుతిన్‌పై పెరుగుతున్న వ్యతిరేకత
బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోజెన్‌బర్గ్ అందిస్తున్న కథనం.
బలవంతపు సైనిక సమీకరణపై రష్యన్లలో ఆగ్రహం పెరుగుతోంది. అయితే, ఈ సైనిక సమీకరణ తాత్కాలికమేనని అధ్యక్షుడు పుతిన్ గతంలో ప్రకటించారు.
కానీ అది ఎప్పుడు ముగుస్తుందనే దానిపై క్రెమ్లిన్ పెదవి విప్పడం లేదు. యుక్రెయిన్‌లో తమ స్వాధీనంలోని ప్రాంతాలపై పట్టు కొనసాగించేందుకు రష్యన్లు పోరాడుతున్నారు.
సైనిక శిక్షణ లేని వారు యుద్ధరంగానికి వెళ్తుండడంతో అది వారు చనిపోవడానికే దారితీస్తోంది.
పుతిన్ స్ట్రాంగ్ మ్యాన్ అని ప్రచారం చేస్తోంది క్రెమ్లిన్. ప్రేమగా చూసుకునే సర్వ సైన్యాధ్యక్షుడు అని చెప్తోంది. రష్యన్లు దేశ సేవ కోసం యుక్రెయిన్ మీద యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కొత్త రిక్రూట్లకు తగినంత శిక్షణ ఉందంటున్నారు. కానీ వీరికి మాత్రం లేదు.
సమీకరణలో భాగంగా ఇటీవల సైన్యంలోకి భర్తీ అయిన సైనికులు తమకు వసతులు, శిక్షణ ఏవీ లేవని ఆరోపించారు. పాత తుపాకులు ఇచ్చారని, హెల్మెట్లు గానీ, ఉక్కు కవచాలు కూడా ఇవ్వలేదని అన్నారు.
ఈ సైనిక సమీకరణ రష్యన్ సమాజంలో తీవ్ర అలజడిని రేకెత్తించింది. తమవారిని యుద్ధరంగానికి పంపిస్తే ఏం చేయాలనే దానిపై ఈ మానవ హక్కుల సంస్థ సలహాలు ఇస్తోంది. యుక్రెయిన్‌లో పోరాడేందుకు దాదాపు రెండు లక్షల మందికిపైగా రిజర్వ్ బలగాలను సమీకరించామని క్రెమ్లిన్ అంటోంది.
సైనిక సమీకరణతో యుక్రెయిన్‌లో ఏం జరుగుతుందనే దానిపై రష్యన్ ప్రజలకు వాస్తవాలు తెలిశాయి. సైన్యంలోకి చేర్చుకున్న వారందరినీ మాతృభూమి పరిరక్షణ కోసమే పంపిస్తున్నట్లు రష్యన్లు నమ్మాలని క్రెమ్లిన్ కోరుకుంటోంది. అయితే ఈ ప్రచారాన్ని అందరూ నమ్మడం లేదు.
ఇవి కూడా చదవండి:
- గ్రహణం రోజున దేవాలయాలను ఎందుకు మూసివేస్తారు? శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం ఎందుకు తెరుస్తారు?
- SAvZIM: దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతోందా? విజయానికి 13 పరుగుల దూరంలో జింబాబ్వేతో మ్యాచ్ ఎందుకు ఆగిపోయింది?
- 'ఆ చివరి మూడు ఓవర్లు చూస్తూ దీపావళి పండుగ చేసుకున్నా' - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సోషల్ మీడియాలో చర్చ
- విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టకుండా చిత్రమైన టోపీలు... వైరల్ అవుతున్న ఫోటోలు
- రిషి సునాక్: బ్రిటన్ చరిత్రలో మొట్టమొదటి హిందూ ప్రధాన మంత్రి - జీవిత ప్రస్థానం ఫొటోల్లో
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)