You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
85 ఏళ్ళ వయసులోనూ వంటలు చేస్తూ బ్రిటన్‌లో రెస్టారెంట్ నడుపుతున్న ఇండియన్ బామ్మ
ఆగస్టు 1972లో యుగాండాలోని భారతీయులు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు తక్షణం దేశం వదిలి వెళ్ళిపోవాలని 90 రోజుల గడువిచ్చింది అప్పటి యుగాండా ప్రభుత్వం.
దాంతో చాలా మంది యుగాండా నుంచి బ్రిటన్‌కు వలస వెళ్ళారు.
వారిలో ఒకరు మంజు పటేల్. లండన్ చేరేనాటికి పటేల్ దంపతుల చేతిలో కేవలం 12 పౌండ్లున్నాయి.
వారికి ఇద్దరు పిల్లలు. అలా మొదలైన వారి కథలో ఎన్నో మలుపులు.... ఇప్పుడు వారు నడిపించే మంజూస్ రెస్టారెంట్ బ్రిటన్‌లోని పాపులర్ రెస్టారెంట్లలో ఒకటి.
బీబీసీ ప్రతినిధి గగన్ సభర్వాల్ అందిస్తున్న కథనం.
వంటలు వండడమంటే మంజుకి చాలా ఇష్టం. సొంతంగా రెస్టారెంట్ నడపాలని ఆమె ఎప్పటినుంచో కలలు కంటున్నారు. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఆమె దాని గురించి ఆలోచించడం మానేశారు. ఓ స్థానిక ఫ్యాక్టరీలో మెషీన్ ఆపరటర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు.
‘‘తన జీవితంలో ఎన్నటికైనా రెస్టారెంట్ నడపాలనే ఆలోచన అమ్మకు ఉందని నాకు తెలుసు. దాంతో మా అన్నయ్య, నేను కలిసి ఇప్పుడెందుకు ప్రారంభించకూడదు అనుకున్నాం. సరైన స్థలం కోసం వెతికాం. ఒక చోటు మాకు బాగా నచ్చి, దాన్ని కొనాలనుకున్నాం. అనుకోకుండా అమ్మ 80వ పుట్టిన రోజునే అది మాకు దక్కింది’’ అని మంజు కొడుకు జయ్‌మిన్ పటేల్ బీబీసీతో చెప్పారు.
‘‘నా కొడుకులు నా కోసం రెస్టారెంట్ కొనిపెడతారని నేనూహించలేదు. ఒకరోజు నన్ను సర్‌ప్రైజ్ చేశారు. నాకు చాలా సంతోషాన్నిచ్చింది. కంట తడి పెట్టుకున్నాను. నా కల నెలవేరిందిప్పుడు అని వారితో అన్నాను’’ అని మంజు చెప్పారు.
2017 నుంచి ఈ రెస్టారెంట్లో రకరకాల సంప్రదాయ గుజరాతీ వంటకాలు, ఇంట్లో వండే రకరకాల శాకాహారాన్ని సర్వ్ చేస్తున్నారు.
మంజూస్ రెస్టారెంట్ ఒక ఫ్యామిలీ రెస్టారెంట్. ఇందులో మంజు కొడుకులు వచ్చేవారికి స్వాగతం చెప్పి, ఆర్డర్లు తీసుకుంటారు, మంజు , మంజు కోడళ్లు దీపాలి, కీర్తిలు కిచెన్లో పనిచేస్తారు. వచ్చిన ఆర్డర్లకి తగినట్టు వంటలు వండుతారు.
కోవిడ్‌తో పాటు, ఇటీవల గ్యాస్ ధరలు, విద్యుత్ బిల్లులతో ఆహారోత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. దీంతో మంజూస్ రెస్టారెంట్‌కి కూడా కొన్ని ఇబ్బందులు తప్పలేదు. అయితే కోవిడ్ సమయంలో కానీ, ఎడతెరిపిలేకుండా కురిసే వర్షాలు కానీ.. మంజూస్ వేగానికి ఏవీ బ్రేక్ వెయ్యలేకపోయాయి.
‘‘నాకు ఈ పని ఇష్టం. వంట నాకు చాలా ఇష్టం. కాబట్టి దీన్ని నేనెప్పటికీ ఆపను. షెఫ్‌గా ఎప్పటికీ రిటైర్ కాను’’ అని మంజు నవ్వుతూ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
- మనం ఎందుకు చనిపోతాం? సంతాన సామర్థ్యం.. వృద్ధాప్యానికీ, మరణానికీ దారితీస్తుందా?
- అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి
- తల్లిపై అత్యాచారం జరిగిన 28 ఏళ్ల తర్వాత నిందితులపై కేసు పెట్టి అరెస్టు చేయించిన కొడుకు
- హమీదా బాను: 20 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో కనిపించిన భారతీయ మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)