అఫ్గానిస్తాన్‌లో బ్రిటన్ స్పెషల్ ఎయిర్ సర్వీస్ బలగాలు... నిరాయుధులు, ఖైదీలను హత్య చేసినట్లు ఆధారాలు

వీడియో క్యాప్షన్, అఫ్గాన్‌లో నిరాయుధులు, ఖైదీలను అఫ్గాన్‌లో బ్రిటన్ ప్రత్యేక బలగాలు హత్య చేసినట్లు ఆధారాలు..

బ్రిటన్‌కు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ – అంటే ఎస్ఏఎస్ – అఫ్గానిస్తాన్‌లో అదుపులోకి తీసుకున్న ఖైదీలను కాల్చి చంపిందని, నిరాయుధులను హత్య చేసిందనే ఆధారాలు బీబీసీ దర్యాప్తులో వెలుగుచూశాయి.

ఒక యూనిట్.. యాబై నాలుగు మందిని అనుమానాస్పద పరిస్థితుల్లో చంపేసినట్లు, సదరు ఆరోపిత హత్యల గురించి నివేదించటంలో సీనియర్ అధికారులు విఫలమయ్యారని, మిలటరీ పోలీసులకు ఆధారాలను బహిర్గతం చేయలేదని పనోరమ కనుగొంది.

బ్రిటన్ సైనిక బలగాలు అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తాయని, అఫ్గానిస్తాన్‌లో సాహసోపేతంగా, వృత్తి నిబద్ధతతో పనిచేశాయని రక్షణ మంత్రిత్వశాఖ చెప్తోంది.

బీబీసీ ప్రతినిధి రిచర్డ్ బిల్టన్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)