శ్రీలంకలో మరింత తీవ్రంగా మారిన ఆర్థిక సంక్షోభం, పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు

శ్రీలంకలో చమురు నిల్వలు దాదాపు పూర్తిగా అడుగంటాయి.

దాంతో దేశాధ్యక్షుడు తీవ్రమైన ఒత్తిళ్లలో పడిపోయారు.

ఈ చిన్న దేశం ఎన్నడూ చూడనంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. చమురు దిగుమతి చేసుకునే స్తోమత కూడా లేకుండా పోయింది.

ఈ వారం స్కూళ్లను కూడా మూసేశారు.

అత్యవసర సేవలకు మాత్రమే ఇంధన సరఫరా జరుగుతోంది.

తాజాగా... తమకు చౌకగా చమురు సరఫరా చేయాలని శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు లేఖ రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)