బీచ్‌లో పర్యటకుల సమీపంలో కూలిన హెలికాప్టర్
ఫ్లోరిడాలో ఫిబ్రవరి 19న ఒక హెలికాప్టర్ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. అప్పుడు హెలికాప్టర్లో ముగ్గురు ఉన్నారు. హెలికాప్టర్ మయామీ బీచ్‌లోని జనాలకు దగ్గరగా కూలింది. ఈ ప్రమాదం వీడియో వైరల్ అయ్యింది. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. ఇద్దరు ప్రయాణికులను స్థానిక ఆస్పత్రిలో చేర్చినట్లు మయామీ బీచ్ పోలీసులు చెప్పారు. చాలా మంది ఈదుతున్న ప్రాంతంలో హెలికాప్టర్ కూలడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పైలట్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)