You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫేస్‌బుక్ పని అయిపోయిందా? సోషల్ మీడియాలో పోటీని ఇక తట్టుకోలేదా?
17 లక్షల కోట్ల రూపాయలు.. ఇందులో ఎన్ని సున్నాలుంటాయని అడిగితే మనలో చాలా మందికి వెంటనే చెప్పడం కూడా కష్టమే. మనకు బాగా తెలిసిన ఫేస్‌బుక్ ఒక్క రోజులో పోగొట్టుకున్న సంపద ఇది.
న్యూజీలాండ్, శ్రీలంక, గ్రీస్ వంటి అనేక ఆసియా, యూరప్, కొన్ని ఆఫ్రికన్ దేశాల జీడీపీ పరిమాణం కూడా 17 లక్షల కోట్ల కంటే తక్కువే.
మరి ఎందుకు ఈ సంస్థ మార్కెట్ విలువ అంతగా పడిపోయింది? రాత్రికి రాత్రే గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ.. మార్క్ జుకర్‌బర్గ్‌ను మించిన శ్రీమంతులుగా ఎలా మారారు?
కొంతకాలంగా మార్కెట్‌లోని ఇతర సంస్థల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది ఫేస్‌బుక్.
కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఇదే మాట అన్నారు. యువతలో టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌కు పెరుగుతున్న క్రేజ్‌తో తమకు తీవ్రమైన పోటీ ఎదురవుతోందని చెప్పుకొచ్చారు జుకర్‌బర్గ్.
ఫేస్‌బుక్‌కు గట్టి పోటీ ఇస్తున్న మరొక ప్లాట్‌ఫాం యూట్యూబ్. తక్కువ డ్యూరేషన్ ఉండే షార్ట్ వీడియోలకు ఆదరణ పెరుగుతుండటం టిక్‌టాక్, యూట్యూబ్‌లకు కలిసి వస్తోంది.
ఇవి కూడా చదవండి:
- కొండబడి: "9 గూడెంలలో ఒక్కడే పదోతరగతి వరకూ వెళ్లాడు.. దీంతో బడే గూడెంకు వెళ్లింది"
- రాజ్యాంగాన్ని సవరిస్తే అంబేడ్కర్‌ను అవమానించినట్లా? - కేటీఆర్
- రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఉద్యోగులు ఆశించినవన్నీ జరగవా? కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?
- WORDLE: ఈ సరదా గేమ్ మరో సుడోకు అవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)