ఒంటి చేత్తో బాడీ బిల్డింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన యువతి.. ‘అప్పుడు నా జీవితం ముగిసిపోయిందనుకున్నా.. ఇప్పుడు ఇంకా సాధించగలనని నమ్ముతున్నా’

2008లో జరిగిన యాక్సిడెంట్ న-యూన్ జీవితాన్నే మార్చేసింది. ఆమె ఎలాంటి వైకల్యాలూ లేని వారిపై పోటీ చేసి బాడీ బిల్డింగ్ ట్రోఫీని గెలిచారు.

యాక్సిడెంట్ జరిగే నాటికి ఆమె వయసు 27 సంవత్సరాలు.

ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై వెళ్తుంటే.. బండి స్కిడ్ అయ్యి ఇద్దరూ కింద పడ్డారు.

అప్పుడే న యూన్ చెయ్యి తెగిపోయింది.

‘నా కలలన్నీ కొట్టుకుపోయాయి. నేను రెండు నెలల పాటు ఆసుపత్రి బెడ్‌మీదే ఉన్నాను. ఇదంతా జరిగి ఇప్పటికి మూడేళ్లు అవుతోంది. నా జీవితం ఇంకా కష్టంగానే ఉంది’ అని న యూన్ అన్నారు.

వైకల్యం నుంచి ఎవరైనా కోలుకోగలరా? అని ఆలోచిస్తూ ఆమె దీన్నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉన్నదానితోనే సంతృప్తి పడాలని నిర్ణయించుకున్నారు.

యాక్సిడెంట్లు అయినవారిని ఉంచే రీహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లారు. అయితే, అక్కడ ఉన్నవారిని చూసి ఆమె చాలా నిరుత్సాహపడ్డారు.

‘నా జీవితం కూడా ముగిసిపోయిందనే అనుకున్నా’ అని ఆమె చెప్పారు.

కానీ, వైకల్యం అడ్డుకాదు అని నిరూపించాలని ఆమె బాడీ బిల్డింగ్ ప్రారంభించారు.

ఫిట్‌నెస్ సాధించడంతో ఆమెలో ఆత్మవిశ్వాసం, బలం పెరిగాయి.

ట్రోఫీని కూడా సాధించారు.

‘నా కథతో అందరికీ స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నా. జీవితంలో ఇంకా చాలా సాధించగలననే అనుకుంటున్నా’ అన్నారు న యూన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)