You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాబుల్: బస్సులో సీట్ల కోసం తన్నుకున్నట్లు విమానంలో సీట్ల కోసం తోపులాటలు
నిస్సహాయ స్థితిలో ఉన్న వేలాది అఫ్గాన్ ప్రజలు దేశం విడిచివెళ్లేందుకు కాబుల్ విమానాశ్రయానికి చేరుకోవడంతో గందరగోళం ఏర్పడింది.
కాబూల్ విమానాశ్రయంలో ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కడుతూ బీబీసీ దక్షిణాసియా బ్యూరో చీఫ్ నికోలా కరీమ్ ట్వీట్ చేశారు.
"అఫ్గానిస్తాన్‌లో నేను చూసిన అత్యంత విషాధ దృశ్యాల్లో బహుశా ఇది ఒకటి. ఇక్కడ సహాయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి, ప్రభుత్వం ఏదీ లేదు" అని నికోలా అన్నారు.
నికోలా పోస్ట్ చేసిన వీడియోలో బస్సుల్లో సీటు కోసం జనం ఎలా ఒకరినొకరు తోసుకుంటారో, అలాగే ఒక విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొంతమంది ఎలాగైనా సీటు సంపాదించడానికి మెట్ల మీద నుంచి జారిపోతున్నా తమ ప్రయత్నం వదులుకోవడం లేదు.
తాలిబాన్లు మొత్తం దేశాన్ని ఆక్రమించుకోవడంతో విదేశీయులు, అఫ్గానిస్తాన్‌లోని కార్మికులు, ఇతరులు దేశం వదిలి వెళ్లేందుకు పరుగులు పెడుతున్నారు.
కాగా, కాబుల్ విమానాశ్రయం మూసివేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారని బీబీసీ యాంకర్, కరస్పాండెంట్ యాల్దా హకీమ్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: ఈ సంక్షోభంలో ఏ ఇస్లామిక్ దేశం ఎటువైపు ఉంది?
- చరిత్రలోనే బలమైన ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులకు తెలుగు ఎందుకు నేర్పేది?
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
- అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు
- మారుతున్న కేబుల్ ధరలు.. దేనికెంత
- రేణూ దేశాయ్: స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు
- జనవరి 1నే కొత్త సంవత్సర వేడుకలు ఎందుకు జరుపుకొంటాం?
- మనం పుట్టడమే మంచివాళ్లుగా పుడతామా? చెడ్డవాళ్లుగా పుడతామా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)