You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైతీ: ఇంటిపై దాడి చేసి దేశాధ్యక్షుడిని హత్య చేసిన సాయుధులు – Newsreel
హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మోస్ హత్యకు గురయ్యారని ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి జోసెఫ్ వెల్లడించారు.
దేశ రాజధానిలో ఉన్న అధ్యక్షుడి ఇంటిపై జరిగిన సాయుధ దాడిలో జొవెనెల్ చనిపోయారని తెలిపారు.
స్థానిక కాలమానం ప్రకారం ఒంటి గంటకు గుర్తుతెలియని కొందరు సాయుధులు అధ్యక్షుడి అధికారిక నివాసంలోకి చొరబడ్డారు.
ఈ దాడిలో అధ్యక్షుడి భార్య కూడా గాయపడినట్లు అనుమానిస్తున్నారు.
దేశంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తాత్కాలిక ప్రధానమంత్రి జోసెఫ్ చెప్పారు.
2017 ఫిబ్రవరి నుంచి జొవెనెల్ మోస్ హైతీ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.
ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
జొవెనెల్ పదవి కాలం 2021 ఫిబ్రవరిలోనే ముగిసిందని, వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని హైతీ విపక్షాలు డిమాండ్ చేశాయి.
అయితే, తన పదవి కాలం మరో ఏడాది ఉందంటూ ఆయన గద్దె దిగడానికి నిరాకరించారు.
ఇవి కూడా చదవండి:
- అనకొండలు, పులులు, మొసళ్లను తప్పించుకుంటూ దట్టమైన అమెజాన్ అడవిలో 36 రోజులు గడిపాడు
- ‘కలకత్తాలోని చీకటి గదిలో 146 మంది బ్రిటిష్ సైనికులను బంధిస్తే తెల్లవారేసరికి 23 మందే మిగిలారు’
- డచ్ ప్రజలు ఎందుకంత పొడవుగా ఉంటారు? వాళ్లు వెల్లడిస్తున్న రహస్యాలేంటి
- ఇళ్ల మధ్యలో నెల రోజుల్లో వందకు పైగా భారీ గుంతలు ఏర్పడ్డాయి
- శ్రీలంక: ఆ రాతి చిత్రపటం పై విశ్వంలోకి అడుగుపెట్టే సీక్రెట్ కోడ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)