మియన్మార్‌లో సైనిక కుట్రకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన ప్రజాఉద్యమంపై తూటా

మియన్మార్‌లో నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 18 మందికి పైగా మరణించారని ఐరాస మానవ హక్కుల కార్యాలయం వెల్లడించింది.

సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై పోలీసులు తూటాలతో విరుచుకుపడ్డారని తెలిపింది.

యాంగూన్, దావె, మండాలె సహా వివిధ పట్టణాలలో నిరసనకారులపై కాల్పులు జరగ్గా కొందరు ప్రాణాలు కోల్పోయారు.

మియన్మార్‌లో ఫిబ్రవరి 1న సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి నిరసనలు జరుగుతున్నాయి.

ఆంగ్ సాన్ సూచీ సహా అనేక మంది నాయకులను నిర్బంధంలో ఉంచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)