అందమైన ఈ గ్రామం మునిగిపోతోంది

ఇండోనేసియాలోని జావా ద్వీపంలో ఉన్న డిమాక్‌లో 200 కుటుంబాలుండేవి.

ప్రస్తుతం అక్కడ పస్జా ఒక్కరి ఇల్లు మాత్రమే మిగిలింది.

2005లో ఆ గ్రామం ఖాళీ చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.

అప్పటి నుంచి ఏటా గ్రామస్థులు ఆ ఊరి నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు.

ఇప్పుడు పస్జా కుటుంబానికి చెందిన అయిదుగురు మాత్రమే అక్కడున్నారు.

డిమాక్ వద్ద కొద్ది సంవత్సరాలలోనే తీరం రెండు కిలోమీటర్ల మేర కోతకు గురి కావడంతో అక్కడుండేవారిని ఖాళీ చేయమని అధికారులు ఆదేశించారు.

దాంతో అంతావెళ్లిపోయారు కానీ పస్జా కుటుంబం మాత్రం ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లలేదు.

వాతావరణ మార్పులు, భూగర్భ జలాలు తోడేయడం వల్ల తీరం కోతకు గురవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)