You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారీ తాబేలు.. ఏకంగా పెద్ద కారంత ఉంది
దక్షిణ అమెరికా ఉత్తర ప్రాంతంలో కనుగొన్న తాబేలు శిలాజం ఏకంగా ఒక కారు పరిమాణం ఉంది.
స్టుపెండెమిస్ జాగ్రాఫికస్ జాతికి చెందిన ఈ తాబేళ్లు 70 లక్షల ఏళ్ల కిందటి నుంచి కోటి 30 లక్షల ఏళ్ల మధ్య ఆ ప్రాంతంలో సంచరించి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
కొలంబియాలోని టటకోవా ఎడారి, వెనెజ్వేలాలోని ఉరుమాకో ప్రాంతాల్లో 4 మీటర్ల పొడవైన ఈ శిలాజాలను గుర్తించారు.
1970లోనే మొట్టమొదటిసారి స్టుపెండెమిస్ తాబేలు శిలాజాన్ని గుర్తించినప్పటికీ ఇప్పటికీ వీటికి సంబంధించి అనేక రహస్యాలు అలాగే మిగిలిపోయాయి.
పడవల్లాంటి పొడవైన కార్లంత పరిమాణంలో ఈ తాబేళ్లు ఉంటాయి. అమెజాన్, ఒరినోకో నదులు ఏర్పడక ముందు దక్షిణ అమెరికాలోని ఉత్తర ప్రాంత చిత్తడి నేలల్లో ఇవి నివసించేవన్నది శాస్త్రవేత్తల అంచనా.
ఈ భారీ తాబేళ్లలో మగవాటికి పైనుండే డొప్పకు రెండు వైపులా కొమ్ముల్లాంటివి ఉండేవి. శత్రువులతో పోరాడేందుకు అవి ఈ కొమ్ములను ఈటెల్లా వాడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శిలాజాల్లో ఈ కొమ్ములకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు.
తమకు దొరికిన 3 మీడర్ల పొడవైన డొప్ప, కింది దవడ ఎముకను బట్టి వాటి ఆహారానికి సంబంధించిన ఆధారాలు దొరికాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఇవి నదులు, భారీ జల వనరుల్లో అడుగు భాగాన మొసళ్లతో కలిసి నివసిస్తూ ఇతర జలచరాలు, నీటిలోని మొక్కలు, గింజలు, పండ్లను ఆహారంగా తీసుకునేవని భావిస్తున్నారు.
ఇతర మాంసాహార జీవుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి వాటి భారీ పరిమాణం ఉపయోగపడేదని.. దొరికిన శిలాజాల్లో ఒకదానిపైన మొసలి పన్ను గుచ్చుకుని ఉందని పరిశోధకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్యలో ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది
- కరోనావైరస్ పశ్చిమ బెంగాల్లోని ఈ పల్లెపై ఎలాంటి ప్రభావం చూపించింది
- 2022లోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న నిర్మల.. ఇది సాధ్యమేనా?
- ‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. ట్రంప్, జిన్పింగ్ పాలనపై జార్జ్ సోరస్ విమర్శలు
- బడ్జెట్ 2020: కొత్త ఆదాయపన్ను శ్లాబులు.. నిజంగానే పన్ను ఆదా చేస్తాయా
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- BBC Indian Sportswoman of the Year-2019: అవార్డ్ నామినీలు వీరే; 'భారత మహిళలు చరిత్ర లిఖిస్తున్నారు' -రూపా ఝా, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)