You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫోర్బ్స్ టాప్-10 హీరోయిన్లలో నంబర్ వన్ స్కార్లెట్ జాన్సన్... హీరోలలో నాలుగో స్థానంలో అక్షయ్ కుమార్
ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా వరుసగా రెండో సంవత్సరం కూడా స్కార్లెట్ జాన్సన్ ఫోర్బ్స్ జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు.
ముప్ఫయినాలుగేళ్ల ఈ హాలీవుడ్ నటి ఆదాయం 5.6 కోట్ల డాలర్లు(భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 402 కోట్ల రూపాయలు). అధిక పారితోషికాలు అందుకుంటున్న తొలి పది మంది పురుష నటుల జాబితాలో ఏడో స్థానంలో ఉన్న ఆడమ్ సాండ్లర్ కంటే స్కార్లెట్ ఆదాయం 10 లక్షల డాలర్లు తక్కువ.
2018తో పోల్చితే ఈ ఏడాది ఆమె 1.55 కోట్ల డాలర్లు ఎక్కువ సంపాదించారు. 'అవెంజర్స్ ఎండ్‌గేమ్' భారీ సక్సెస్ కూడా దీనికి కారణమే.
ప్రపంచంలో అధిక పారితోషికాలు అందుకుంటున్న తొలి పది మంది నటుల జాబితాలో ఇద్దరే ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. అందులో స్కార్లెట్ ఒకరు కాగా రెండో నటి సోఫియా వెర్గారా.
టాప్-10 నుంచి ఏంజెలినా మాయం
ఈ ఏడాది టాప్ టెన్‌లో ఉన్న నటీమణులంతా 2 కోట్ల డాలర్లకు పైగా సంపాదించినవారే. గత ఏడాది టాప్ టెన్‌లో ఉన్నవారిలో స్కార్లెట్, ఏంజెలీనా జోలీ మాత్రమే 2 కోట్ల డాలర్ల కంటే ఎక్కువ ఆర్జించారు.
అయితే, గత ఏడాది రెండో స్థానంలో ఉన్న ఏంజెలీనా జోలీకి ఈసారి టాప్ టెన్‌లో చోటు దక్కలేదు.
గత ఏడాది టాప్-10లో ఉన్న మిలా కునిస్, జూలియా రాబర్ట్స్, కేట్ బ్లాంచెట్, మెలిసా మెక్‌కార్తీ, గాల్ గేడట్‌లు కూడా ఈసారి జాబితాలో లేరు.
ప్రపంచంలో అధిక పారితోషికాలు పొందుతున్న 10 మంది నటీమణులు వీరే(ఫోర్బ్స్ 2019)
1. స్కార్లెట్ జాన్సన్ ( 5.6 కోట్ల డాలర్లు)ైపోూే
2. సొఫియా వెర్గారా (4.41 కోట్ల డాలర్లు)
3. రీజ్ విథర్‌స్పూన్ (3.5 కోట్ల డాలర్లు)
4. నికోల్ కిడ్మన్ (3.4 కోట్ల డాలర్లు)
5. జెన్నిఫర్ అనిస్టన్ (2.8 కోట్ల డాలర్లు)
6. కేలీ కువోకో (2.5 కోట్ల డాలర్లు )
7. ఎలిసబెత్ మాస్ (2.4 కోట్ల డాలర్లు)
8. మార్గో రాబీ (2.3 కోట్ల డాలర్లు )
9. షార్లీజ్ థెరాన్ (2.3 కోట్ల డాలర్లు)
10. ఎలెన్ పాంపియో (2.2 కోట్ల డాలర్లు)
అందరికంటే టాప్ డ్వేన్ జాన్సన్... నాలుగో స్థానంలో అక్షయ్ కుమార్
గత 12 నెలల కాలంలో సంపాదన ఆధారంగా ప్రపంచంలోనే అత్యధికంగా హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ అలియాస్ 'ద రాక్' 8.94 కోట్ల డాలర్లు సంపాదించారు. నిజానికి ఆయన గత ఏడాది సంపాదన కంటే ఇది తక్కువే. గత ఏడాది ఆయన 11.9 కోట్లు సంపాదించారు.
నటీనటులు తమ నటకకు తీసుకునే పారితోషికమే కాకుండా ప్రకటనల ద్వారా ఆర్జించిన మొత్తాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాలు రూపొందించారు.
డ్వేన్ జాన్సన్ క్రీడాదుస్తుల కంపెనీ అండర్ ఆర్మర్ ప్రకటనల్లో కనిపిస్తుంటారు. దాని ద్వారానూ ఆయనకు మంచి ఆదాయం వస్తోంది.
గత ఏడాది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ స్పిన్ ఆఫ్ హాబ్స్ అండ్ షా, స్కైక్రేపర్ వంటి సినిమాల్లో నటించడంతో పాటు ఫైటింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ షాజామ్ వంటి చిత్రాలను నిర్మించారు కూడా. 'జుమాంజీ ద నెక్స్ట్ లెవల్' సినిమాలో ఆయన కనిపించబోతున్నారు.
ఈసారి టాప్ టెన్‌లో భారతీయ నటుడు అక్షయ్ కుమార్ కూడా స్థానం సంపాదించారు. అక్షయ్ కుమార్ 6.5 కోట్ల డాలర్ల ఆర్జనతో నాలుగో స్థానంలో ఉన్నారు.
ప్రపంచంలో అధిక పారితోషికాలు పొందుతున్న 10 మంది పురుష నటులు వీరే(ఫోర్బ్స్ 2019)
1. డ్వేన్ జాన్సన్ (8.94 కోట్ల డాలర్లు)
2. క్రిస్ హెమ్స్‌వర్త్ (7.64 కోట్ల డాలర్లు)
3. రాబర్ట్ డౌనీ జూనియర్ (6.6 కోట్ల డాలర్లు)
4. అక్షయ్ కుమార్ (6.5 కోట్ల డాలర్లు)
5. జాకీ చాన్ (5.8 కోట్ల డాలర్లు)
6. బ్రాడ్లీ కూపర్ ( 5.7 కోట్ల డాలర్లు )
7. ఆడమ్ సాండ్లర్ (5.7 కోట్ల డాలర్లు)
8. క్రిస్ ఇవాన్స్ (4.3 కోట్ల డాలర్లు )
9. పాల్ రడ్ (4.1 కోట్ల డాలర్లు )
10. విల్ స్మిత్ (3.5 కోట్ల డాలర్లు )
ఇవి కూడా చదవండి:
- ఇంట్లో ప్రవేశించి మంచమెక్కి పడుకున్న పులి
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- ఈ గాయని నోటికి టేప్ అతికించుకుని నిద్రపోతారు.. కారణమేంటో తెలుసా
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)