ప్రపంచంలోనే అతి పెద్ద ముత్యం ఇదే... దీని ధర ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అతిపెద్ద ముత్యాన్ని మీరెప్పుడైనా చూశారా... ఏకంగా 27 కిలోలున్న ముత్యం ఇది. ఇలాంటివి దొరకడం చాలా అరుదు. అందుకే ఈ భారీ ముత్యం విలువ రూ.1,400 కోట్లకు పైగా ఉండొచ్చని బీమా సంస్థలు నిర్ధరిస్తున్నాయి.
ఇంతకీ ఈ ముత్యం ఎక్కడిది
కెనడాకు చెందిన ఫిలిపినో అబ్రహాం రెయెస్ దగ్గర ఈ ముత్యం ఉంది. వాళ్ల అత్త నుంచి ఇది వారసత్వంగా ఆయనకు సంక్రమించింది.
అలా బయట పడింది
రెయెస్ తాత 1950లో ఫిలిప్పీన్స్ లో ఒక భారీ ఆల్చిప్పను కొన్నారు. అయితే, ఆ ఆల్చిప్ప లోపల ఇంత పెద్ద ముత్యం ఉందని ఆయనకు తెలియదు. మొలస్కా జాతి జీవులు ఈ భారీ ఆల్చిప్పలో ఇరుక్కుపోయాయి. కొన్నాళ్లకు ఆల్చిప్ప లోపల ఈ ముత్యం బయటపడింది.
అమ్మేదే లేదు
నిపుణుల ధ్రువీకరణ తరువాత దీని విలువను బీమా సంస్థలు లెక్కగట్టాయి. కెనడాకు చెందిన వారు దీని విలువను రూ.400 నుంచి రూ. 600 కోట్ల మధ్య ఉంటుందని నిర్ధరించారు. హాంకాంగ్‌కు చెందినవారు దీని విలువను రూ.వెయ్యి నుంచి రూ.1400 కోట్ల మధ్య ఉంటుందన్నారు.
అయితే, ఎంతో చరిత్ర ఉన్న ఈ అరుదైన ముత్యాన్ని రెయెస్ అమ్మడం లేదు. దీన్ని అందరూ చూసేలా మ్యూజియంలు, గ్యాలరీలకు పంపాలనుకుంటున్నారు. దానివల్ల, ఇలాంటి అరుదైన ముత్యం ఉందన్న సంగతి అందరికీ తెలుస్తుందని ఆయన భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)