You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మనం తాగే నీటికి డైనోసార్ల బ్యాక్టీరియాకు సంబంధం ఏమిటి?
నీళ్ల గురించి చెప్పమంటే మంచినీళ్లు తాగినంత ఈజీగా చెప్పొచ్చు అని అనుకుంటున్నారా?... ఆగండాగండి.
జీవ మనుగడకు ఆధారమైన నీటి గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి గురించి మరికొంత తెలుసుకుందాం.
రంగు, రుచి, వాసన లేని పదార్థం నీరు అనే విషయం మనకు తెలిసిందే. అయితే, అన్ని పదార్థాల మాదిరిగా సాధారణ రసాయిన నిమయాలను నీళ్లు పాటించవు. ఆ విరుద్ధ స్వభావం వల్లే భూమ్మీద జీవ మనుగడ సాధ్యం అయింది.
మన భూగోళం మీద నీరు మొదట వాయురూపంలో ఉండేది. తేలికైన ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులతో అది రూపొందింది. శీతలీకరిస్తే అన్ని రసాయన పదార్థాల మాదిరిగా కాకుండా నీరు విస్తరిస్తుంది. అందువల్లే మంచుగడ్డలు నీటిపై ప్రవహిస్తాయి. నిజానికి ఇది చాలా అసహజంగా కనిపిస్తుంది. మంచు యుగాల నుంచి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి కారణంగా గడ్డ కట్టిన నీటిలోనూ జీవరాశులు బతికేలా చేసింది. ఇదొక్కటే కాదు. చల్లటి నీటి కంటే వేడి నీళ్లే త్వరగా గడ్డకడుతాయనే విషయం మీకు తెలుసా.. చాలా మందికి తెలియదు.
గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా నీళ్లు ప్రవహించగలవు. అందువల్లే మన శరీరంలోని పై భాగంలో ఉన్న మెదుడుకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. భూమి నుంచి మొక్కలు నీటిని గ్రహిస్తున్నాయి. మరో విషయం... మన సౌరవ్యవస్థలో చాలా చోట్ల నీటి ఆనవాళ్లు ఉన్నాయి. నీటితో ఉన్న గ్రహం మనదొక్కటే అని ఇన్నాళ్లు భావించాం. కానీ, నిజానికి సౌర వ్యవస్థ నీటితోనే ఉంది. చంద్రుడు, అంగాకరకుడు, ప్లూటో గ్రహాల్లోనూ నీటి ఆనవాళ్లు ఉన్నట్లు ఇటీవల కనిపెట్టాం.
ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. గ్లాసులో నీళ్లు పోసి రంగు, రుచి, వాసనలు లేని ఆ అద్భుత పదార్థాన్ని చూడండి. నీటికి ఆ విచిత్ర లక్షణం లేకుంటే మీరు, నేనే కాదు ఈ భూమ్మీద జీవమే లేదు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)